అమెరికాలోని వైట్‌హౌస్ (శ్వేత సౌధం)లో అధికారులు కొకైన్ (మాదకద్రవ్యం)ను గుర్తించారు. ఓ తెల్లటి పదార్ధాన్ని అధికారులు గుర్తించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఆ పౌడర్ లభ్యమయ్యిందని సమాచారం. వైట్‌హౌజ్‌లోని వెస్ట్ వింగ్ ప్రాంతంలో దీనిని సీజ్ చేశారు.
అనంతరం ఆ కాంప్లెక్స్‌లో ఉన్న వారిని మరో ప్రదేశానికి తరలించారు. అయితే కొకైన్‌ను గుర్తించిన సమయంలో వైట్‌హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ లేరు. ప్రస్తుతం ఆయన తన వీకెండ్‌ను క్యాంప్ డేవిడ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది ఆ తెల్లటి పౌడర్‌ను పలు విధాలుగా పరీక్షించారు. ప్రాథమిక పరీక్షలో అది పౌడర్ కొకైన్ అని గుర్తించారు.
దర్యాప్తు ముమ్మరం
ఆ తెల్లటి పౌడర్ ప్యాకెట్ గురించి మరింతగా తెలుసుకునేందుకు టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు ఆ పౌడర్ వైట్‌హౌస్‌లోనికి ఎలా చేరిందనే దానిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైట్‌హౌజ్ వెస్ట్ వింగ్ అనేది అధ్యక్ష భవనానికి సమీపంలో ఉంటుంది. క్యాబినెట్ రూమ్, ఓవల్ ఆఫీస్, ప్రెస్ రూమ్‌లు కూడా అక్కడే ఉంటాయి. కాగా వెస్ట్ వింగ్ వద్దకు ప్రతి రోజూ వివిధ ప్రభుత్వ పనుల కోసం వందల సంఖ్యలో జనం వస్తుంటారు.
ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామన్న రష్యా!
Comments
Please login to add a commentAdd a comment