జాన్సన్ అండ్ జాన్సన్ ప్రొడక్ట్‌లపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. కంపెనీ అనుబంధ సంస్థ తయారుచేస్తున్న బేబీ పౌడర్‌లోని టాల్కమ్ స్త్రీల అండాశయ క్యాన్సర్‌కు కారణమవుతుందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. వాటిని పరిష్కరించడానికి 25 ఏళ్ల వ్యవధికిగాను కంపెనీ సుమారు 6.48 బిలియన్ డాలర్లు(రూ.54వేలకోట్లు) చెల్లించడానికి సిద్ధమైంది.
స్త్రీల పరిశుభ్రత కోసం కంపెనీ తయారుచేస్తున్న టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం ద్వారా ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై దాడిచేసే మీసోథెలియోమా, అండాశయ క్యాన్సర్ వస్తుందని ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించి కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తమ ఉత్పత్తుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో ఏమాత్రం నిజం లేదని కంపెనీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: గూగుల్‌లో మళ్లీ లే ఆఫ్స్.. ఎందుకో తెలుసా..
బుధవారం అనుబంధ సంస్థ పునర్నిర్మాణానికి 75% మంది వాటాదార్లు సానుకూలంగా ఓటు వేస్తే ప్రీప్యాకేజ్డ్ చాప్టర్ 11 దివాలాకు దాఖలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. మెసోథెలియోమాకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలను రిఆర్గనైజేషన్ ప్లాన్ వెలుపల పరిష్కరిస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment