ఏంటీ.. కేజీ టీ పొడి ధర రూ.40 వేలా అని ముక్కున వేలేసుకోకండి. అంత ధర పలికింది ఎక్కడో కాదు.. టీ ఉద్యానవనాలకు స్వర్గధామమైన గువహటిలో.. అసోంలోని గువాహటి టీ వేలం కేంద్రంలో జరిగిన వేలం పాటలో రికార్డు ధర పలికింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని డానియి పోలో టీ ఎస్టేట్‌లో పండించిన అరుదైన గోల్డెన్ నీడిల్స్ టీ పొడి ఈ రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. అస్సామ్ టీ ట్రేడర్స్ ఈ టీపొడిని దక్కించుకున్నారు.
గత నవంబర్‌లో డానియి పోలో ఎస్టేట్‌లోని ఓయమ్ గ్రామానికి చెందిన తేయాకు తోటల్లో పండిన టీపొడి కేజీ ధర రూ.18,801 పలికింది. గోల్డెన్ నీడిల్స్ తేయాకు కాడలు చిన్నగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా వాటిని సేకరించాలి. ఆకు పైభాగం బంగారు రంగులో ఉంటుంది. ఆకులు చాలా మృదువుగా, మెత్తగా ఉంటాయి. ఈ పొడితో చేసిన టీ ముదురు బంగారు రంగులో ఉంటుంది. చెరుకు రసంలాంటి సువాసనతో తియ్యగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment