దిస్పూర్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులు, పౌరులు మృతి చెందినట్టు తెలుస్తోంది. కాగా, రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధ రంగంలోకి దిగి సైన్యాన్ని ముందుకు నడిపిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆయనను బాహుబలి అని కొందరు ప్రశంసించారు. ఇప్పుడు జెలెన్ స్కీ వరల్డ్‌వైడ్ ఎంతో ఫేమస్ అయిపోయారు.
ఇదిలా ఉండగా.. తాజాగా జెలెన్ స్కీ పేరుతో ఇండియాలో సైతం మారుమోగుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ బ్రాండ్ పేరుతో టీ పౌడర్ మార్కెట్లో విడుదలైంది. బ్లాక్ టీ పౌడర్‌ను అసోం స్టార్టప్ కంపెనీ అరోమిక్ టీ మార్కెట్‌లోకి విడుదల చేసింది. రియల్లీ స్ట్రాంగ్.. స్ట్రాంగ్ అస్సాం బ్లాక్ టీ అంటూ క్యాప్షన్స్ కూడా పెట్టింది. కాగా, జెలెన్‌స్కీ పేరుపై టీ పౌడర్ మార్కెట్లోకి విడుదల కావడం హాట్ టాపిక్‌గా మారింది.
A new Assam tea blend called Zelenskyy, Really Strong has been released by startup @AromicaTea This shows how globally people are appreciating the exceptional courage & valour of President @ZelenskyyUa of #Ukraine️ #UkraineWar #UkraineRussiaWar pic.twitter.com/JHrA4QYenI
— Joydeep Phukan (@joyphukan) March 16, 2022
ఈ నేపథ్యంలో అరోమిక్ టీ డైరెక్టర్ రంజిత్ బారువా మాట్లాడుతూ.. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో అసమాన ధైర్యం చూపుతున్న జెలెన్ స్కీకి గౌరవార్థం ఆయన పేరు మీదుగా ఇలా టీ పౌడర్‌ను విడుదల చేసినట్టు తెలిపారు. ఆయన వ్యక్తిత్వాన్ని తమ టీ పౌండర్‌తో పోల్చుతూ క్వాలిటీని ప్రతిబింబించేలా చూస్తామన్నారు. త్వరలో ఆన్‌లైన్ సైతం టీ పౌడర్ దొరుకుతుందని వెల్లడించారు. కాగా, కిలో టీ పౌడర్ వెల రూ. 450గా నిర్ణయించినట్టు తెలిపారు. మరో వైపు ఉక్రెయిన్ ఈ సంవత్సరంలో భారత దేశం నుంచి 1.73 మిలియన్ కిలోల టీ పొడిని దిగుమతి చేసుకోగా.. రష్యా 34.09 మిలియన్ కిలోల టీ పౌడర్‌ను దిగుమతి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment