
మాస్కో: రష్యాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మాస్కోకు ఆగ్నేయంగా 170 మైళ్ల దూరంలో ఉన్న రష్యాలో ఉన్న రియాజాన్ ప్రాంతంలోని ఎలాస్టిక్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గన్‌పౌడర్ ప్లాంట్ కావడంతో పేలుడు కూడా సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 17 మంది ఉండగా అందులో ఉన్న 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు 50 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. స్థానిక మీడియా ప్రకారం.. ప్లాంట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
చదవండి: Russia Orders: ఆ వారం రోజులు ఆఫీసులకు వెళ్లకండి.. అయినా జీతాలిస్తాం!