తొలుత పురుషులకు మహిళల వేషం వేయించి వ్యవహారం
రోజంతా వసూళ్లు చేసినందుకు నిర్ణీత మొత్తం చెల్లింపు
ఆపై వారికి ఆపరేషన్లు చేయించి నపుంసకులుగా మార్పు
ఏడుగురిని అరెస్టు చేసిన నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ టీమ్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించిన ఇల్లు, ప్రారంభించిన దుకాణం, శుభకార్యం జరిగే చోట్లకు వచ్చిన హిజ్రాలు దూషిస్తే చెడు జరుగుతుందనే సెంటిమెంట్ చాలా మందికి ఉంటోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు అనేక మంది నకిలీ ట్రాన్స్‌జెండర్లు రంగంలోకి దిగి బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ దందా వ్యవస్థీకృతంగా సాగుతున్నట్లు ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. శుక్రవారం కార్ఖానా ఠాణా పరిధిలో వరుస దాడులు చేసిన అధికారులు ప్రధాన నిర్వాహకురాలైన నకిలీ హిజ్రా, ముగ్గురు సహాయకులతో పాటు నలుగురు హిజ్రా వేషం వేసుకున్న పురుషులను అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర వివరాలు వెల్లడించారు. ఇటీవల పెరిగిపోయిన నకిలీ హిజ్రాల వేధింపుల నేపథ్యంలో నగర వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
లాభదాయకంగా ఉండటంతో..
ఎవరైతే పుట్టుకతో నపుంసకులుగా ఉంటారో వారిని మాత్రమే హిజ్రాలుగా పరిగణించాల్సి ఉంది. అయితే నగర వ్యాప్తంగా కూడళ్లతో పాటు దుకాణాలు, వాహనచోదకులు, పాదచారులను బెదిరించి, వారి వెంటపడి డబ్బు వసూలు చేసే నకిలీ హిజ్రాలు అనేక మందిని ఆకర్షిస్తున్నారు. ఈ దందా లాభదాయకంగా ఉందని భావించే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. శివార్లలో తిష్టవేస్తూ తొలినాళ్లల్లో హిజ్రాల వేషం వేసుకుని వసూళ్లు ప్రారంభిస్తున్నారు. ఆపై నిర్ణీత మొత్తం తమ వద్దకు చేరిన తర్వాత ముంబై, పుణే సహా మహారాష్ట్రలోని వివిధ నగరాలకు వెళ్లి శస్త్రచికిత్సలు చేయించుకోవడం ద్వారా నకిలీ హిజ్రాలుగా మారుతున్నారు. ఆపై మరికొంత మందినీ తమతో చేర్చుకుని ముందు వేషం, ఆ తర్వాత అవతారం ఎత్తించి దందా కొనసాగిస్తున్నారు.
ఒక్కడు వచ్చి ఆరుగురిని ‘చేరదీసి’..
శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలసకు చెందిన సురద కుమార్ కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి యాప్రాల్‌లో స్థిరపడ్డాడు. తొలినాళ్లల్లో హిజ్రా వేషం వేసుకుని, ఆపై శస్త్రచికిత్స చేయించుకుని చాందినీగా మారి దందా నడిపాడు. కొన్నాళ్లకు అనంతపురం జిల్లాకు నల్లన్నగారి రమేష్ ఎత్తప్పగారి మల్తీలను ఆకర్షించి అదే పంథాలో జయశ్రీ,, మనీషాగా మార్చాడు. చాందినీ సహాయకులుగా మారిన వీరు తమ జిల్లాకే చెందిన కె.సురేష్ ఎస్‌కే బాష, ఎస్‌కే షఫీ, ఎష్‌కే ఇషాక్‌లను నగరానికి రప్పించి ఆశ్రయం కలి్పంచారు. ఈ నలుగురితోనూ హిజ్రా వేషం వేయించిన చాందినీ వీరికి చిత్ర, ముంతాజ్, ఆషు, సమీర అనే పేర్లు పెట్టాడు. చాందినీ, జయశ్రీ, మనీషా వీరికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆహారం, మద్యం తదితరాలు అందిస్తూ వసూళ్లు చేయిస్తున్నారు. అలా వచి్చన డబ్బు తీసుకునే వీరు రోజుకు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. కొన్నాళ్లకు వీరికీ శస్త్రచికిత్సలు చేయించి నకిలీ హిజ్రాలుగా మార్చేందుకు పథకం వేశారు.
సీపీ ఆదేశాలతో రంగంలోకి..
రాజధానిలోని రోడ్ల పైన, చౌరస్తాల్లోనూ, దుకాణాల వద్ద ఈ నకిలీ హిజ్రాల ఆగడాలపై వరుస ఫిర్యాదులు రావడంతో కొత్వాల్ సీవీ ఆనంద్ సీరియస్‌గా తీసుకున్నారు. నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాల్సిందిగా టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో ఎస్సైలు శ్రీనివాసులు దాసు, పి.గగన్‌దీప్ కార్ఖానా ప్రాంతంలో శుక్రవారం వరుస దాడులు చేశారు. ఫలితంగా చాందినీతో పాటు ఇద్దరు సహాయకులు, హిజ్రా వేషం వేసిన వాళ్లు చిక్కారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని స్థానిక పోలీసులకు అప్పగించారు. నగరంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు 100కు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి సహాయం పొందాలని అధికారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment