old 500 notes
-
సిరిసిల్ల శివారులో కరెన్సీ కంటెయినర్?
సిరిసిల్ల క్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర శివారులో రూ.3 కోట్ల కరెన్సీతో ఓ కంటెయినర్ తిరుగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందులో రూ.500 పాత కరెన్సీ ఉన్నట్లు కూడా సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు రూ.2.60 లక్షల పాత కరెన్సీని వేర్వేరు ప్రాంతాల మీదుగా తరలిస్తూ శనివారం సిరిసిల్ల పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో కంటెయినర్ విషయం వెలుగుచూసినట్లు తెలుస్తోంది. ఈ ఏడుగురిలో హైకోర్టులో పనిచేసే ఉద్యోగి ఉన్నారు. -
పింఛన్‌దారులకు పాత 500 నోట్ల పంపిణీ
కొత్త రూ.2000, 100 నోట్లు పక్కదారి.. అల్లాదుర్గం పోస్టాఫీస్‌లో ఘటన అల్లాదుర్గం: పింఛన్‌దారులకు పాత రూ.500 నోట్లను పంపిణీ చేస్తూ దొరికిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం పోస్టాఫీసులో చోటుచేసుకుంది. ఈ పోస్టాఫీస్‌కు కొత్త రూ.2000 నోట్లు 30 లక్షలు, రూ.100 నోట్లు 10 లక్షల వరకు వచ్చినట్లు తెలిసింది. ఫైనాన్సలు, వ్యాపారుల వద్ద పాత నోట్లు తీసుకొని వంద నోట్లు, కొత్త 2,000 నోట్లు లక్షల్లో పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నారుు. ఆసరా పింఛన్‌దారులకు ప్రభుత్వం నవంబరులో వారి ఖాతాలో డబ్బులు వేసింది. అప్పటి నుంచి ఎవరికి పింఛన్ డబ్బులు అందజేయలేదు. అరుుతే, వారం రోజుల నుంచి పోస్టాఫీసులో పాత రూ. 500 నోట్లను పింఛన్‌దారులకు పంపిణీ చేస్తున్నారు. ఈ ఐదు వందల నోట్లను ఆర్డీ కింద కడితే అదే అధికారులు తీసుకోవడం లేదు. పైగా బయట చెల్లుబాటు కావడం లేదు. విషయం తెలుసుకొని ‘సాక్షి’ విలేకరి వెళ్లి ఫొటోలు తీయడంతో వెంటనే పింఛన్ల పంపిణీని నిలిపివేశారు. పింఛన్‌దార్లు కోరితేనే..: ఈ విషయంపై పోస్ట్‌మాస్టర్ రాజశేఖర్‌ను ‘సాక్షి’ విలేకరి వివరణ కోరగా పింఛన్‌దారులు ఇవ్వమంటే పాత ఐదు వందల నోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. తమకు రూ.30 లక్షల రెండు వేల నోట్లు వచ్చాయని, వాటిని సేవింగ్ ఖాతా ఉన్న వారికి ఇచ్చామన్నారు. వంద రూపాయల నోట్లు రాలేదని, అందుకే పింఛన్‌దారులకు పింఛన్ డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. పాత ఐదు వందల నోట్లు ఇప్పుడెక్కడివని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వలేదు. -
రైల్లో భారీగా పాత రూ.500 నోట్లు
బిహార్: డీమానిటైజేషన్ తరువాత రద్దయిన రూ.500, 1000 నోట్లు పెద్ద ఎత్తున పట్టుబడుతున్న సంఘటనలు ఇంకా నమోదవుతూనే వున్నాయి. తాజాగా బీహార్ లోని గయనలో ఇఒక రైలు బోగీలో 35 లక్షల విలువైన రద్దయిన రూ.500 సంచిని అధికారులు గుర్తించారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లో గుర్తుతెలియని బ్యాగ్ నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ కస్టమ్స్ అధికారులు ఈ భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగ నవంబరు 8 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్రం చేపట్టిన ఈ చర్య సామాన్యలకు పలు కష్టాలను తెచ్చిపెట్టింది. నగదు కొరత సమస్యను అధిగమించేందుకు ఆర్థిక శాఖ, ఆర్ బీఐ ఎన్ని ఉపశమన చర్యల్ని చేపడుతున్నప్పటికీ కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి.ఏటీఎం, బ్యాంకు కేంద్రాల వద్ద జనం క్యూలు అంతకంతకూ పెరుగుతున్నాయి. -
రద్దయిన నోట్లతో ఏం చేస్తున్నారో చూడండీ..!
హైదరాబాద్: రద్దయిన పాత రూ.500 నోట్ల డిజైన్‌తో మార్కెట్లో దొరుకుతున్న పర్సులు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా రూ.500 నోటు డిజైన్ బయటకు కనిపించేలా తయారు చేసిన పర్సులను కొందరు విక్రయిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా కనిపించడంతో ఈ పర్సుల అమ్మకాలు వారికి లాభదాయంగా మారాయి. కేవలం రూ.20కే పర్సులు అమ్ముతుండటంతో త్వరత్వరగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇటీవల చైనాలోనూ మన కొత్త రెండు వేల రూపాయల నోటు, రూ.500 నోట్ల డిజైన్‌తో పర్సులు తయారు చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో ఆ డిజైన్ పర్సుల విక్రమయాలు అక్కడ ఊపందుకున్నాయి. తాజాగా నగరంలో రద్దయిన నోట్ల డిజైన్ కనిపించేలా చేసిన పర్సులు దర్శనమిస్తున్నాయి. -
మొబైల్ రీచార్జిలపైనా ఆదాయపన్ను నిఘా
పాత కరెన్సీ నోట్లతో ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జిలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అలా తమ వద్దకు వచ్చి పాత నోట్లతో ఎవరెవరు ఎంతెంతకు రీచార్జి చేయించుకున్నారో.. ఆయా నంబర్ల వివరాలన్నింటినీ ఇవ్వాలని కేంద్రం ఆదేశించినట్లు తాజా సమాచారం. అంటే.. ఈ విషయంపై కూడా ఆదాయపన్ను శాఖ నిఘా మొదలవుతోందని అర్థం. డిసెంబర్ 15వ తేదీ వరకు పాత నోట్లతో ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ల రీచార్జి చేసుకోవచ్చు. అయితే అందుకు కేవలం 500 రూపాయల నోట్లను మాత్రమే ఉపయోగించాలని, ఆయా వినియోగదారుల మొబైల్ నంబర్లను కూడా టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఇవ్వాలని టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ తెలిపారు. పెద్దనోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న కథనాలు రావడంతో.. వీటి కోసం 500 నోట్లను డిసెంబర్ 15 వరకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే దీన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. ఎవరెవరు వీటిని వినియోగించుకుంటున్నారో ఒక కన్నేసి ఉంచాలని భావిస్తోంది. దేశంలో 90 శాతం మంది ప్రీపెయిడ్ కనెక్షన్లనే ఉపయోగిస్తున్నట్లు ఓ అంచనా. -
పాత 500 తీసుకునేది ఇక్కడ మాత్రమే