
రద్దయిన నోట్లతో ఏం చేస్తున్నారో చూడండీ..!
హైదరాబాద్: రద్దయిన పాత రూ.500 నోట్ల డిజైన్‌తో మార్కెట్లో దొరుకుతున్న పర్సులు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా రూ.500 నోటు డిజైన్ బయటకు కనిపించేలా తయారు చేసిన పర్సులను కొందరు విక్రయిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా కనిపించడంతో ఈ పర్సుల అమ్మకాలు వారికి లాభదాయంగా మారాయి. కేవలం రూ.20కే పర్సులు అమ్ముతుండటంతో త్వరత్వరగా అమ్మకాలు జరుగుతున్నాయి.
ఇటీవల చైనాలోనూ మన కొత్త రెండు వేల రూపాయల నోటు, రూ.500 నోట్ల డిజైన్‌తో పర్సులు తయారు చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో ఆ డిజైన్ పర్సుల విక్రమయాలు అక్కడ ఊపందుకున్నాయి. తాజాగా నగరంలో రద్దయిన నోట్ల డిజైన్ కనిపించేలా చేసిన పర్సులు దర్శనమిస్తున్నాయి.