పింఛన్‌దారులకు పాత 500 నోట్ల పంపిణీ
కొత్త రూ.2000, 100 నోట్లు పక్కదారి..
అల్లాదుర్గం పోస్టాఫీస్‌లో ఘటన
అల్లాదుర్గం: పింఛన్‌దారులకు పాత రూ.500 నోట్లను పంపిణీ చేస్తూ దొరికిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం పోస్టాఫీసులో చోటుచేసుకుంది. ఈ పోస్టాఫీస్‌కు కొత్త రూ.2000 నోట్లు 30 లక్షలు, రూ.100 నోట్లు 10 లక్షల వరకు వచ్చినట్లు తెలిసింది. ఫైనాన్‌సలు, వ్యాపారుల వద్ద పాత నోట్లు తీసుకొని వంద నోట్లు, కొత్త 2,000 నోట్లు లక్షల్లో పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నారుు. ఆసరా పింఛన్‌దారులకు ప్రభుత్వం నవంబరులో వారి ఖాతాలో డబ్బులు వేసింది. అప్పటి నుంచి ఎవరికి పింఛన్ డబ్బులు అందజేయలేదు. అరుుతే, వారం రోజుల నుంచి పోస్టాఫీసులో పాత రూ. 500 నోట్లను పింఛన్‌దారులకు పంపిణీ చేస్తున్నారు.
ఈ ఐదు వందల నోట్లను ఆర్డీ కింద కడితే అదే అధికారులు తీసుకోవడం లేదు. పైగా బయట చెల్లుబాటు కావడం లేదు. విషయం తెలుసుకొని ‘సాక్షి’ విలేకరి వెళ్లి ఫొటోలు తీయడంతో వెంటనే పింఛన్ల పంపిణీని నిలిపివేశారు. పింఛన్‌దార్లు కోరితేనే..: ఈ విషయంపై పోస్ట్‌మాస్టర్ రాజశేఖర్‌ను ‘సాక్షి’ విలేకరి వివరణ కోరగా పింఛన్‌దారులు ఇవ్వమంటే పాత ఐదు వందల నోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. తమకు రూ.30 లక్షల రెండు వేల నోట్లు వచ్చాయని, వాటిని సేవింగ్ ఖాతా ఉన్న వారికి ఇచ్చామన్నారు. వంద రూపాయల నోట్లు రాలేదని, అందుకే పింఛన్‌దారులకు పింఛన్ డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. పాత ఐదు వందల నోట్లు ఇప్పుడెక్కడివని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వలేదు.