సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాదక ద్రవ్యాలపై పక్కా సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద జరిపిన దాడిలో రోహిత్, విక్కీ అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఎల్‌సీడీ డ్రగ్స్, సిరంజ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ డ్రగ్స్‌ను గోవా నుంచి నగరానికి సరఫరా చేశారు.
న్యూ ఇయర్ వేడుకలు వస్తున్న నేపథ్యంలో నగరానికి భారీగా డ్రగ్స్‌ను తెచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2013 నుంచి నిందితులు డ్రగ్స్‌ను చలామణి చేస్తున్నారు. గోవాలో తక్కువ మెత్తానికి ఎల్‌సీడీ స్టాంప్స్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో వినియోగదారులకు భారీ మొత్తానికి అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరాపై మరింత సమాచారం కోసం రోహిత్, విక్కీలను పోలీసులు విచారిస్తున్నారు.
(డ్రగ్స్‌తో పట్టుబడిన రోహిత్, విక్కీ)
(పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, సెల్‌ఫోన్లు)
Comments
Please login to add a commentAdd a comment