క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ జయశంకర్ వివరాల ప్రకారం.. వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు నామాలగుండు బీదలబస్తీలోని ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఉత్తరమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ బీ. శ్రవణ్‌కుమార్ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇంటిపై దాడిచేసి నిర్వాహకుడు పీ. నవీన్ (21)తో పాటు వారాసి గూడ, బౌద్దనగర్, సీతాఫల్‌మండిలకు చెందిన ఆర్.వినాయక్ అలియాస్ బజ్జు (22), పీ.సాయిప్రతాప్ (20), డీ.ఆకాశ్ (19), సయ్యద్‌వాజిద్ (28), జీ.ప్రసాద్ (23)లను అదుపులోకి తీసుకుని వారినుంచి రూ.5050 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. వీరిలో నలుగురు బీటెక్ విద్యార్థులు కావడం గమనార్హం. సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ జయశంకర్ తెలిపారు.
(చిలకలగూడ)