నగరంలోని కుషాయిగూడ ప్రాంతంలో బుధవారం ఓ మ్యూజిక్ సెంటర్‌పై దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నీలి చిత్రాల సీడీలను స్వాధీనం చేసుకున్నారు.
కుషాయిగూడ (హైదరాబాద్): నగరంలోని కుషాయిగూడ ప్రాంతంలో బుధవారం ఓ మ్యూజిక్ సెంటర్‌పై దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నీలి చిత్రాల సీడీలను స్వాధీనం చేసుకున్నారు. నాగార్జుననగర్ కాలనీకి చెందిన ఎం.పరుశురాం(24) కమలానగర్ అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో మ్యూజిక్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.
ఇక్కడ నీలి చిత్రాల సీడీలను విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం దాడులు జరిపి 40 సీడీలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు పరశురాంను అరెస్ట్ చేసి కుషాయిగూడ పోలీసులకు అప్పచెప్పారు. దీపిపై పోలీసులు కేసు నమోదు చేశారు.