హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని మంగళవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి భారీగా ఎల్‌ఎస్‌డీ, హెరాయిన్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా డ్రగ్స్ ఎక్కడ నుంచి సరఫరా చేస్తున్నారనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.