heroin caught
-
200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
చండీగఢ్: అంతర్జాతీయ మార్కెట్లో రూ. 200 కోట్ల విలువ చేసే 40 కేజీల హెరాయిన్‌ను పంజాబ్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు కలసి సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. భారత్–పాక్ సరిహద్దు దగ్గర్లోని అమృత్‌సర్‌లో ఉన్న పంజ్‌గ్రైన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు అమృత్సర్ (రూరల్) సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఘరిందా ప్రాంతానికి చెందిన అక్రమ రవాణాదారు నిర్మల్ సింగ్ పాకిస్తాన్ నుంచి రానున్న హెరాయిన్‌ను తీసుకుంటాడని పోలీసులకు సమాచారం అందింది. భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఈ అక్రమరవాణా జరగనుందని గుర్తించిన పోలీసులు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరు బలగాలు కలసి అక్రమరవాణా పనిపట్టారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన 40.810 కేజీల హెరాయిన్(39 పాకెట్లు), 180 గ్రాముల ఓపియం, రెండు ప్లాస్టిక్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పాకిస్తాన్లో తయారు చేసినట్లు గుర్తించారు. నిర్మల్ సింగ్‌ను పట్టుకునేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదైనట్లు తెలిపారు. -
రూ. 2500 కోట్ల హెరాయిన్ పట్టివేత
-
రూ. 2,700 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
అమృత్సర్ (పంజాబ్): పాక్ నుంచి అక్రమంగా వాణిజ్య మార్గం ద్వారా భారత్‌కు తీసుకొస్తున్న 532 కిలోల హెరాయిన్‌ను సరిహద్దులోని అట్టారి చెక్ పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 2,700 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా పాకిస్తాన్ నుంచి అట్టారి చేరుకున్న ట్రక్కులోని హెరాయిన్, మరో 52 కిలోల అనుమానాస్పద డ్రగ్స్‌ను వందలాది రాతి ఉప్పు బస్తాల కింద దాచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు దేశంలోనే కస్టమ్స్ విభాగానికి ఇది భారీ విజయమని వెల్లడించారు. కశ్మీర్‌కు చెందిన హెరాయిన్ స్మగ్లింగ్ సూత్రధారి తారిఖ్ అన్వర్ని అరెస్ట్ చేసిన అధికారులు రాతి ఉప్పును దిగుమతి చేసుకుంటున్న అమృత్‌సర్‌కు చెందిన వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని దీపక్‌కుమార్ వెల్లడించారు. -
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని మంగళవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి భారీగా ఎల్ఎస్డీ, హెరాయిన్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా డ్రగ్స్ ఎక్కడ నుంచి సరఫరా చేస్తున్నారనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ.75 కోట్ల హెరాయిన్ పట్టివేత
ఫెరోజ్‌పూర్: ఫెరోజ్పూర్లో సరిహద్దు భద్రతా దళం అధికారులు(బీఎస్ఎఫ్) 15 కేజీల హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బందికి, పాకిస్తానీ స్మగ్లర్లకు మధ్య కాల్పులు జరిగినట్లు ఓ బీఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు. దీంతో స్మగ్లర్లు హెరాయిన్‌ని వదిలి పారిపోయినట్లు సమాచారం. పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 75 కోట్లు ఉంటుందని అధికారులు వివరించారు.