
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. జిల్లాలోని బసంత నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవునిపల్లి శివారులోని క్వారీలో గురువారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ చేసిన 321 ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, 170 కేజీల అమ్మెనియా, 50 లీటర్ల కిరోసిన్, కాంప్రెషర్ ట్రాక్టర్‌ను పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
క్వారీ యజమానులు రాయిశెట్టి శ్రీనివాస్, చిట్యాల అశోక్, కాంప్రెషర్ యజమాని సంచులు సధాకర్, డ్రైవర్ దేవేందర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.