చిత్తూరు (క్రైమ్),న్యూస్‌లైన్ : రైస్‌పుల్లింగ్ పాతరతో బంగారం తయారు చేయవచ్చని ఆశ చూపి దగా చేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిందితులు రామసముద్రం మండలం పెద్దకురప్పల్లెకు చెందిన రత్నప్ప అలియాస్ రఘు (42), రామసముద్రం గ్రామానికి చెందిన వాసన్న, పుంగనూరులోని బీడీ కాలనీకి చెందిన నాగేంద్ర అలియాస్ సురేష్(42),బండ్లపల్లెకు చెందిన చిన్నరెడ్డెప్ప (46), కర్ణాటకలోని కోలారుకు చెందిన బాలప్ప (34)ను అరెస్ట్ చెసి వారి వద్ద నుంచి రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ సుధాకర్ రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. 20 రోజుల క్రితం నగరంలోని పొన్నియమ్మ గుడివీధికి చెందిన నిఖిల్‌కు కొందరు పరిచయమయ్యారు. రైస్‌పుల్లింగ్ (పాతర) ఉందని, దాంతో బంగారాన్ని గుర్తించవచ్చని చెప్పారు. అందుకుగాను రూ. 5 లక్షలు చెల్లించాలని చెప్పారు. ఆ తరువాత ఈ నెల 10వ తేదీ వారు నిఖిల్‌కు ఫోన్ చేసి రైస్ పుల్లింగ్ పాతర, బంగారు నాణేలు సిద్ధంగా ఉన్నాయని, డబ్బులు తీసుకుని స్థానిక పీవీకేఎన్ కళాశాల వద్దకు రావాలని సూచించారు.
ఆ మేరకు అత డు రూ. 5 లక్షలు తీసుకొని అక్కడికి వెళ్లాడు. అక్కడే ఉన్న ఇద్దరికి డబ్బు అందించాడు. దాంతో ఆ ఇద్దరు రైస్‌పుల్లింగ్ పాతరను తీసుకురావాలని వెం టనే ఎవరికో ఫోన్ చేశారు. వెంటనే ఓ కారులో ముగ్గురు వచ్చారు. కారు ఆగగానే వారితోపాటు నిందితులు అక్కడి నుంచి ఉడాయించారు. తరువాత వారి ఫోన్ పనిచేయలేదు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఒకటో పట్ట ణ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు.
రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్
Published Sat, Sep 14 2013 3:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement