Ramasamudram
-
భారీ వర్షంతో స్తంభించిన రాకపోకలు
రామసముద్రం : మండల పరిధి రామసముద్రంలోని చెంబకూరు ప్రాంతంలో బుధవారం భారీ వర్షం కురవడంతో రాకపోకలు స్తంభించాయి. గంట పాటు కురుసిన వర్షంతో చెరువులు, కాలువలు నిండిపోయాయి. పంట పొలాలపై వరదనీరు ప్రవహించడంతో రైతులు నష్టపోయారు. మనేవారిపల్లె గ్రామానికి వెళ్లే రోడ్డు, పంట పొలాలు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించాయి. నడింపల్లె వడ్డివానిచెరువు గండి పడడంతో ఎస్ఐ రవీంద్రబాబు సహకారంతో గ్రామస్తులు గండిని పూడ్చారు. పై గడ్డ ప్రాంతంలో శ్రీనివాసపురం–రామసముద్రం రోడ్డుపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూగవాడి ఉన్న గౌనివాని కాలువ వరద నీటితో ప్రవహించింది. ఇంత పెద్ద ఎత్తున వర్షం కురవడం ఇదే మొదటి సారిని ప్రజలు తెలిపారు. అలాగే నారిగానిపల్లె పంచాయతీ పూలగుంట్ల గ్రామంలో లక్ష్మన్నకు చెందిన ఆరు గొర్రెలు కాలువ దాటే సమయంలో వరదనీటికి కొట్టుకుపోయాయి. గొర్రెల కాపరులు వరదనీటిలో కొట్టుకెళ్తుండగా గ్రామస్తులు రక్షించారు. ఈ భారీ వర్షంతో టమాట, కాలీఫ్లవర్, కొత్తిమీర తదితర పంటలు దెబ్బతిన్నాయి. వడ్డిపల్లె, నడింపల్లె చెరువులను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. సంపతికోట ఏటిలో తప్పిన ప్రమాదం పెద్దతిప్పసముద్రం : మండలంలోని సంపతికోట ఏటిలో గురువారం మళ్లీ నీటి ప్రవాహం వరదలా ఉప్పొంగింది. సంపతికోట నుంచి గుడిపల్లికి పాల ఆటో వెళ్తూ ఏటిలో అదుపు తప్పి బోల్తా పడింది. పాలన్నీ నీటి పాలయ్యాయి. అయితే అక్కడే ఉన్న ఓ మినీ లారీ సాయంతో ఆటోను ఒడ్డు వైపు లాగడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో ఇదే ఏటిలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చిక్కుకుని ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటనలో ఇంజనీరింగ్ చదివే ఓ యువతి నీటిలో కొట్టుకుపోయి అర్ధాంతరంగా తనువు చాలించిన విషయం తెలిసిందే. ఎగవనున్న కర్టాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండి మిగులు వరదలా ప్రవహిస్తుండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంపతికోటకు చేరుకుని వరద ఉద్ధృతిని పరిశీలించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. -
హత్య చేస్తామని బెదిరిస్తున్నారు
గ్రామానికి రక్షణ కల్పించండి పోలీసులకు ఐదు గ్రామాల ప్రజల ఫిర్యాదు రామసముద్రం: అడ్డకొండలో జరిగిన ఆదినారాయణ హత్య కేసు విషయమై కొందరు తమను హత్య చేస్తామని బెదిరిస్తున్నారని పెద్దకురప్పల్లె పంచాయతీకి చెందిన నారేవారిపల్లె, మనేవారిపల్లె, తప్పసానిపల్లె, బ్రాహ్మణపల్లె, మొటుకు గ్రామాల ప్రజలు వాపోయారు. వారు సోమవారం పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ నారేవారిపల్లెకు చెందిన వెంకట్రమణ కుమారుడు ఆదినారాయణ గత నెల 20వ తేదీన నుంచి కనిపించలేదన్నారు. అడ్డకొండలో కాలిపోయిన శవంను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. పుంగనూరు రూరల్ సీఐ రవీంద్ర, ఎస్ఐ సోమశేఖర్ పరిశీలించారని పేర్కొన్నారు. శవాన్ని చూసిన గ్రామస్తులు మృతుడు ఆదినారాయణగా గుర్తించారని చెప్పారు. ఆదినారాయణ భార్య రత్నమ్మ, కుమారుడు అనిల్, ఎం.శ్రీనివాసులు, ఎం.రాజేష్, పి.రవికుమార్ ఆదినారాయణతో పాటు టమాట పంటకు నీరు పెట్టేందుకు వెళ్లారని, ఈ క్రమంలో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య పథకం ప్రకారం ఆదినారాయణను హత్య చేసిందని తెలిపారు. ఈ కేసు విషయమై అదే గ్రామానికి చెందిన ఎం.లక్ష్మీపతి తమ్ముడు జనార్దన, రామచంద్ర, వాసు, వారి భార్యలు గ్రామస్తులను భయపెడుతున్నారని వాపోయారు. ఊరిలో ఎవరైనా ఆదినారాయణ హత్య కేసులో నోరు తెరిస్తే నాలుకలు కోస్తానని లక్ష్మీపతి బెదిరిస్తుŠాన్నడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి పోలీసులు రక్షణ కల్పించాలని గ్రామస్తులు వేడుకున్నారు. ఆందోళన చేసిన వారిలో హరినాథ్, గుణశేఖర్, శ్రీనివాసులునాయుడు, ఎంపీటీసీ రెడ్డెప్పనాయుడు, రామాంజుల తదితర ఐదు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
తిరుపతి జూ ఆపరేషన్
– ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దు – తెల్ల దుస్తులు ధరించకూడదు – పోలీస్, అటవీ సిబ్బంది రాత్రి గస్తీ – మదనపల్లె సబ్ కలెక్టర్ కతికాబాత్రా రామసముద్రం: రామసముద్రం మండలంలో సంచరిస్తున్న గజరాజును పట్టేందుకు తిరుపతి జూ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ గజరాజు’ను సోమవారం ఉదయం 6 గంటలకే ప్రారంభించనున్నట్లు మదనపల్లె సబ్ కలెక్టర్ కతికాబాత్రా తెలిపారు. ఆదివారం రాత్రి ఆమె రామసముద్రంలో గజరాజు దాడిలో మతి చెందిన టి.రామప్ప(70) మతదేహాన్ని పరిశీలించారు. సోమవారం ఉదయం రూ.5 లక్షలు పరిహారం చెక్కును కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. ఏనుగు గ్రామాలు, పొలాల్లో హల్చల్ చేస్తుండడంతో గ్రామాల్లో ప్రజలెవ్వరు బయటకు రాకూడదన్నారు. చిన్న పిల్లలు, వద్ధులు, మహిళలు గజరాజు ఉన్న చోటకు రావద్దని హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా బయట తిరిగే వ్యక్తులెవ్వరు తెల్లుదుస్తులు ధరించవద్దని సూచించారు. సోమవారం ఉదయం 6 గంటలకే తిరుపతి జూ శాఖ ఆధ్వర్యంలో ఇంజక్షన్లు వేసి గజరాజును పట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రామసముద్రం సబ్‌స్టేషన్ వద్ద చింతతోపులో మకాం వేసిన గజరాజు కదలికలను పసిగట్టేందుకు వి.కోట, పలమనేరు, పుంగనూరు నుంచి అటవీశాఖ సిబ్బంది, పుంగనూరు, రామసముద్రం, చౌడేపల్లె ప్రాంతాల నుంచి పోలీసు బలగాలు రాత్రి గస్తీ చేయాలని ఆదేశించారు. రాత్రివేళ ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. గజరాజు ఉన్న ప్రదేశంలో రాత్రి టపాకాయలు పేల్చుతూ మంటలు వేసుకుని కాపలా కాయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో చక్రపాణి, ఎస్ఐ సోమశేఖర్, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. -
హత్య చేసి పూడ్చిపెట్టారు..
రామసముద్రం (చిత్తూరు జిల్లా) : రామసముద్రం మండలం ఆర్‌నడింపల్లి సమీపంలో ఓ వ్యక్తిని గుట్టుచప్పుడు కాకుండా హత్యచేసి పూడ్చిపెట్టారు. ఈ సంఘటన రెండు నెలల తర్వాత శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బెంగుళూరులోని తాడ అగ్రహారానికి చెందిన తిరుమలప్ప(25) అనే యువకుడు 2 నెలల నుంచి కనపడటంలేదు. దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా పట్టుబడిన నిందితులను అరెస్ట్ చేసి తమదైన శైలిలో ప్రశ్నించగా హత్య చేసిన విషయం వెల్లడించిన నిందితులు.. పోలీసులను తిరుమలప్పను పూడ్చి పెట్టిన స్థలానికి తీసుకువెళ్లారు. వారి సమక్షంలోనే మృతదేహాన్ని వెలికి తీశారు. -
డెంగ్యూతో ఐదేళ్ల చిన్నారి మృతి
చిత్తూరు (రామసముద్రం) : డెంగ్యూ వ్యాధితో ఐదేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మనేవారిపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మనేవారిపల్లి గ్రామానికి చెందిన శివమణి(5) అనే బాలుడు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు బాలుడికి రామసముద్రం, మదనపల్లిలోని ఆసుపత్రుల్లో వైద్యం చేయించగా అక్కడి వైద్యులు తిరుపతికి తీసుకెళ్లమని సూచించారు. వైద్య పరీక్షల అనంతరం బాలుడికి డెంగ్యూ సోకిందని తిరుపతి వైద్యులు తేల్చారు. తిరుపతిలో చికిత్సపొందుతూ శనివారం అర్ధరాత్రి బాలుడు మృతిచెందాడు. దీంతో బాలుడి ఇంట్లో విషాదం అలుముకుంది. -
రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్
చిత్తూరు (క్రైమ్),న్యూస్‌లైన్ : రైస్‌పుల్లింగ్ పాతరతో బంగారం తయారు చేయవచ్చని ఆశ చూపి దగా చేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిందితులు రామసముద్రం మండలం పెద్దకురప్పల్లెకు చెందిన రత్నప్ప అలియాస్ రఘు (42), రామసముద్రం గ్రామానికి చెందిన వాసన్న, పుంగనూరులోని బీడీ కాలనీకి చెందిన నాగేంద్ర అలియాస్ సురేష్(42),బండ్లపల్లెకు చెందిన చిన్నరెడ్డెప్ప (46), కర్ణాటకలోని కోలారుకు చెందిన బాలప్ప (34)ను అరెస్ట్ చెసి వారి వద్ద నుంచి రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ సుధాకర్ రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. 20 రోజుల క్రితం నగరంలోని పొన్నియమ్మ గుడివీధికి చెందిన నిఖిల్‌కు కొందరు పరిచయమయ్యారు. రైస్‌పుల్లింగ్ (పాతర) ఉందని, దాంతో బంగారాన్ని గుర్తించవచ్చని చెప్పారు. అందుకుగాను రూ. 5 లక్షలు చెల్లించాలని చెప్పారు. ఆ తరువాత ఈ నెల 10వ తేదీ వారు నిఖిల్‌కు ఫోన్ చేసి రైస్ పుల్లింగ్ పాతర, బంగారు నాణేలు సిద్ధంగా ఉన్నాయని, డబ్బులు తీసుకుని స్థానిక పీవీకేఎన్ కళాశాల వద్దకు రావాలని సూచించారు. ఆ మేరకు అత డు రూ. 5 లక్షలు తీసుకొని అక్కడికి వెళ్లాడు. అక్కడే ఉన్న ఇద్దరికి డబ్బు అందించాడు. దాంతో ఆ ఇద్దరు రైస్‌పుల్లింగ్ పాతరను తీసుకురావాలని వెం టనే ఎవరికో ఫోన్ చేశారు. వెంటనే ఓ కారులో ముగ్గురు వచ్చారు. కారు ఆగగానే వారితోపాటు నిందితులు అక్కడి నుంచి ఉడాయించారు. తరువాత వారి ఫోన్ పనిచేయలేదు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఒకటో పట్ట ణ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు.