రామసముద్రం మండలం ఆర్‌నడింపల్లి సమీపంలో ఓ వ్యక్తిని గుట్టుచప్పుడు కాకుండా హత్యచేసి పూడ్చిపెట్టారు.
రామసముద్రం (చిత్తూరు జిల్లా) : రామసముద్రం మండలం ఆర్‌నడింపల్లి సమీపంలో ఓ వ్యక్తిని గుట్టుచప్పుడు కాకుండా హత్యచేసి పూడ్చిపెట్టారు. ఈ సంఘటన రెండు నెలల తర్వాత శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బెంగుళూరులోని తాడ అగ్రహారానికి చెందిన తిరుమలప్ప(25) అనే యువకుడు 2 నెలల నుంచి కనపడటంలేదు.
దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా పట్టుబడిన నిందితులను అరెస్ట్ చేసి తమదైన శైలిలో ప్రశ్నించగా హత్య చేసిన విషయం వెల్లడించిన నిందితులు.. పోలీసులను తిరుమలప్పను పూడ్చి పెట్టిన స్థలానికి తీసుకువెళ్లారు. వారి సమక్షంలోనే మృతదేహాన్ని వెలికి తీశారు.