ఢిల్లీ: రూ.10 వాటర్ బాటిల్ రూ.100కి అమ్మడం ఏంటి? అని ప్రశ్నిస్తూ ఓ ఐటీ ఉద్యోగి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల ఐటీ ఉద్యోగి పల్లబ్‌దే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌లో రూ.10 వాటర్ బాటిల్‌ను రూ.100కి అమ్ముతున్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటాను అడిగారు.
How is @zomato allowed to sell Rs. 10 water bottles for Rs. 100 at concert venues where no one is allowed to bring their own bottles?@VijayGopal_ pic.twitter.com/clQWDcIb7m
— Pallab De (@indyan) December 17, 2024
‘తాము పాల్గొన్న ఈవెంట్‌లో వాటర్ బాటిల్స్ నిషేదం.ఈవెంట్ నిర్వహించే వాళ్లే వాటర్ బాటిళ్లనూ అమ్ముతున్నారు. దాహం వేస్తుంది కదా అని రూ.10 వాటర్ బాటిళ్లను రెండింటిని కొనుగోలు చేశా. రూ.20 ఇచ్చా. కానీ సదరు వాటర్ బాటిల్ అమ్మే వ్యక్తి నా నుంచి రూ.200 వసూలు చేశారు.
‘ఎవరూ తమ సొంత వాటర్ బాటిళ్లను తీసుకురావడానికి అనుమతించని ఈవెంట్‌లో రూ.10 వాటర్ బాటిల్‌ను రూ.100కి విక్రయించడానికి జొమాటోకి అనుమతి ఎలా వచ్చింది? అని అడుగుతూ రెండు వాటర్ బాటిళ్ల ఫొటోల్ని ట్వీట్‌లో జత చేశాడు.
పల్లబ్ ట్వీట్‌పై జొమాటో స్పందించింది. తాము, ఆ వాటర్ బాటిల్స్‌ను అమ్మలేదని, టికెటింగ్ పార్ట్‌నర్‌గా ఉన్నట్లు తెలిపింది. అయినప్పటికీ కస్టమర్‌కు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment