ఆహారపు అలవాట్లను మార్చుకుంటే చాలు.. భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకోవడమే కాకుండా.. మన ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుచుకోవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీల్లోని దాదాపు 43 వేల ప్రాంతాల ప్రజల ఆహారపు అలవాట్లను పరిశీలించిన తరువాత తాము ఈ నిర్ణయానికి వచ్చామని, ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా నీటి వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని తద్వారా భవిష్యత్తులో భూతాపోన్నతి కారణంగా వచ్చే వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.
యూరోపియన్ దేశాల్లో పశు ఉత్పత్తులు (పాలు, మాంసం, గుడ్లు) ఎక్కువగా ఉంటాయని వీటిని తయారు చేసేందుకు నీరు ఎక్కువగా వాడాల్సి ఉంటుందని.. వీటి స్థానంలో మాంసం, పశు ఆధారిత కొవ్వులతోపాటు, చక్కెర, నూనెలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి వీటితో నీటిని ఆదా చేయవచ్చునని వివరించారు. తినే ఆహారంలో ఉండే మాంసం, ఇతర పశు ఉత్పత్తులను బట్టి నీటి ఆదా అనేది 11 శాతం నుంచి 55 శాతం వరకూ ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. ఒక రోజుకు అవసరమైన ప్రొటీన్లు, కొవ్వులను పరిగణలోకి తీసకుని చేసిన ఈ అధ్యయనం ద్వారా తేలిందేమిటంటే.. కాయగూరలు ఎక్కువగా ఉన్న ఆహారం భూమి నాలుగు కాలాలపాటు పచ్చగా ఉండేందుకు పనికొస్తుందీ అని!
Comments
Please login to add a commentAdd a comment