బాలాసనంలో శరీరం మొత్తం ముందుకు సాగి, చంటి పిల్లలు బోర్లా పడుకున్నప్పుడు కనిపించే భంగిమలో ఉంటారు. దీనిని శశాంకాసనం అనికూడా ఉంటారు. ఈ ఆసనంలో వెన్నెముక సాగి, మోకాళ్లు బలపడతాయి. పోత్తికడుపులోని అవయవాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుం నొప్పి సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి తగ్గి, శరీరం మొత్తం విశ్రాంతి పొందుతుంది.
ముందుగా మ్యాట్‌పైన కాలి మడమల మీద హిప్ భాగం ఉండేలా వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ తల, పోట్ట భాగాన్ని ముందుకు మెకాళ్ల మీదుగా పూర్తిగా వంచాలి. చేతులను నేలపై తలకిరువైపులా వెడల్పుగా ‘వి’ ఆకారంలో ఉంచాలి. ఈ పోజిషన్‌లో 30 సెకన్లపాటు ఆగి, విశ్రాంతి ΄పోందాలి. తర్వాత తిరిగి వజ్రాసనంలోకి రావాలి. ఇలా సుమారు 10 సార్లు చేయాలి.
ఫలితాలు: రోజువారీ పనుల ద్వారా కలిగే ఒత్తిడి, చిరాకులాంటి సమస్యలు దూరం అవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పేగులు, కాలేయం, మూత్రపిండాలకు బలం చేకూరుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకల సమస్యతో బాధపడేవారు, హైబీపి ఉన్నవారు నిపుణుల సూచనలు తీసుకోవాలి.
– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్
Comments
Please login to add a commentAdd a comment