Australian researchers
-
తరచూ పారాసిటమాల్ తీసుకున్నా ప్రయోజనం సున్నా!
చాలా మంది వెన్నునొప్పికీ, నడుమునొప్పికి లాంటి నొప్పులకు పారాసిటమాల్ (అసిటమైనోఫెన్) తీసుకుంటూ ఉంటారు. హానిలేని మందుగా చాలామంది వైద్యులూ దీన్ని ఫస్ట్‌లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా ఇస్తూ ఉంటారు. నిజానికి తరచూ పారాసిటమాల్ వాడటం కూడా అంత మంచిది కాదంటున్నారు ఆస్ట్రేలియా అధ్యయనవేత్తలు. దాదాపు 1500 మంది వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. నడుము, వెన్నునొప్పితో బాధపడుతూ ఉన్న ఆ గ్రూపులోని కొందరికి పారాసిటమాల్ ఇచ్చారు. ఇంకొందరికి కూడా పారాసిటమాల్ మాత్ర ఇచ్చారు కానీ నిజానికి అందులో ఏ మందూ లేదు. అంటే అసిటమైనోఫెన్ మందులేకుండా జాగ్రత్త తీసుకున్నారన్నమాట. పదిహేడు రోజుల తర్వాత పరీక్షించి చూడగా... నిజానికి మందు తీసుకున్నవారిలోనూ, మందుతీసుకోకుండా కేవలం ‘ప్లాసెబో’ఎఫెక్ట్‌తో ఉపశమనం పొందినవారిలోనూ పెద్దగా తేడా ఏదీ లేదని అధ్యయనవేత్తలు గుర్తించారు. అందుకే నడుము, వెన్ను నొప్పి వచ్చినప్పుడు పైపూత మందులు లేదా ఫిజియో వ్యాయామాలే మంచివంటున్నారు నిపుణులు. ఈ అధ్యయన ఫలితాలు ‘ల్యాన్సెట్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
మనుషులు వదిలే గ్యాస్ ద్వారా కరోనా వ్యాప్తి
కాన్బెర్రా: కళ్లు, ముక్కు, నోరు ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. దీన్ని నియంత్రించేందుకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం చేస్తూనే ఉన్నాం. కానీ మనుషులు వదిలే గ్యాస్(అవసాన వాయువులు) వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. అయితే దుస్తులు ధరించి లేనప్పుడే ఈ ముప్పు ఎక్కువగా ఉందంటున్నారు. (మే, జూన్‌లోనే 84 శాతం మరణాలు) అవసాన వాయువుల వల్ల వైరస్ సోకే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ వదలకండని ఆస్ట్రేలియా వైద్యుడు ఆండ్రీ టాగ్ సూచిస్తున్నారు. కానీ బహిరంగ ప్రదేశాల్లో దీన్ని గుర్తుపట్టి భౌతిక దూరం పాటించడం కష్టమేనంటున్నారు జనాలు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 70 లక్షలు దాటగా.. 4 లక్షల మరణాలు సంభవించాయి. దేశంలో కేసుల సంఖ్య 2,76583కు చేరుకోగా 1,35,206 మంది కోలుకున్నారు. 7745 మంది మరణించారు (ఆ 9 దేశాలు కరోనాను జయించాయి) -
కరోనా: 48 గంటల్లో వైరస్ క్రిములు ఖతం!
మెల్బోర్న్: కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న ప్రపంచ దేశాలకు ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు శుభవార్త చెప్పారు. అందుబాటులో ఉన్న యాంటి-పారాస్టిక్ డ్రగ్ ‘ఐవర్‌మెక్టిన్’తో కోవిడ్-19 ను ఎదుర్కోవచ్చని తెలిపారు. ఈమేరకు మోనాష్ యూనివర్సిటీ బయోమెడిసిన్ డిస్కవరీ ఇన్స్టిట్యూట్ (బీడీఐ), డోహెర్టీ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. హెచ్ఐవీ, జికా వైరస్, డెంగ్యూ, ఇన్‌ఫ్లూయెంజా వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఐవర్‌మెక్టిన్‌కు బాధితుని శరీరంలో నుంచి కరోనా వైరస్ క్రిములను పారదోలే శక్తి ఉందని స్టడీకి నేతృత్వం వహించిన డాక్టర్ కైలీ వాగ్‌స్టాఫ్ చెప్పారు. (చదవండి: భారత్ సహాయాన్ని కోరిన ట్రంప్) ఆయన మాట్లాడుతూ.. ‘ఐవర్‌మెక్టిన్ అనే ఔషధం ఎఫ్‌డీఏ అనుమతి పొందిన డ్రగ్. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న ఔషదం. ఎంతో సురక్షితమైన డ్రగ్ కూడా. పలు వైరల్ ఫీవర్లపై ఐవర్‌మెక్టిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనితో మానవ శరీరంలో సెల్ సంస్కృతిలో పెరుగుతున్న కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవచ్చని మా పరిశోధనలో తేలింది. ఈ మెడిసిన్ సింగిల్ డోస్ ద్వారా బాధితుని శరీరంలోని వైరల్ ఆర్ఎన్ఏను 48 గంటల్లో తొలగించవచ్చు. అంటే ఒక్క డోస్‌తో 24 గంటల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టనుంది. కాబట్టి, అందుబాటులో ఉన్న ఈమెడిసిన్తో చికిత్స చేస్తే మంచిది’అని వాగ్‌స్టాఫ్ పేర్కొన్నారు. అయితే, ల్యాబ్ దశలో విజయవంతం అయిన తమ పరీక్షలను మనుషులపై క్లినియల్ ట్రయల్స్ చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. తమ అధ్యయన వివరాలు యాంటి వైరల్ రిసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయని తెలిపారు. (చదవండి: 5జీతో కరోనా దుర్మార్గ ప్రచారం: బ్రిటన్) (చదవండి: అమెరికాలో మూడు లక్షలు) -
వెజ్ డిన్నర్... స్కూల్లో విన్నర్!
పరిపరిశోధన మీ పిల్లలకు రాత్రి భోజనంలో ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు పుష్కలంగా తినిపిస్తున్నారా? అలా తినిపిస్తే మర్నాడు ఆ పిల్లలు స్కూల్లో అత్యంత చురుగ్గా ఉంటారట. మీ పిల్లలు డిన్నర్లో మాంసాహారం ఎక్కువగా ఉండే ఆహారంతో పాటు, చక్కెరపాళ్లు ఉండే శీతల పానీయాలు తీసుకున్నారా? మర్నాడు స్కూల్లో మందకొడిగా ఉంటారట. అందుకే పిల్లలకు రాత్రి భోజనంలో ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా పెట్టేలా చూడాలంటూ తల్లిదండ్రులకు ఆస్ట్రేలియన్ పరిశోధకులు హితవు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని న్యూ క్యాజిల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 8 నుంచి 15 ఏళ్ల వయసు గల కొంతమంది పిల్లలను ఎంపిక చేసుకున్నారు. వారిలోని కొందరికి రాత్రి భోజనంలో తప్పనిసరిగా ఆకుకూరలు, పండ్లు వంటి శాకాహారం ఇచ్చారు. ఆ మర్నాడు నిర్వహించిన లాంగ్వేజ్ పరీక్షలు, లెక్కల పరీక్షల్లో పిల్లల సామర్థ్యాన్ని పరిశీలించారు. రాత్రి భోజనంలో ఆకుకూరలను ఆహారంగా తీసుకునే పిల్లలు... ఆ మర్నాడు చాలా చురుగ్గా ఉంటారని తేలింది. గతంలో ఈ తరహా అధ్యయనాన్ని బ్రేక్‌ఫాస్ట్ విషయంలో నిర్వహించారట. అయితే క్రితం రాత్రి తీసుకున్న భోజనం... ఆ మర్నాటి చురుకుదనంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయంపై ఇదే సరికొత్త అధ్యయనం. ఆకుకూరలు, పండ్లలోని పాలీఫీనాల్స్, యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఈ ప్రభావం కనిపిస్తుందని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. -
ప్రమోషన్‌తో లావెక్కుతారట!
పరిపరి శోధన ప్రమోషన్ వస్తే పరపతి, పలుకుబడి, అధికారం పెరుగుతాయని అందరికీ తెలిసిందే. అయితే, ప్రమోషన్ వస్తే చాలామంది లావెక్కుతారట! పదోన్నతి వల్ల లభించే అధికారం వల్ల స్వయంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఒత్తిడికి గురై, దానిని అధిగమించడానికి అతిగా తినడమే దీనికి కారణమని ఆస్ట్రేలియన్ పరిశోధకులు చెబుతున్నారు. వివిధ పదవుల్లో పనిచేస్తున్న 450 మందిపై విస్తృతంగా అధ్యయనం చేసి వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా నైపుణ్యాలతో నిమిత్తంలేని నిర్ణయాలు తీసుకునే పదవుల్లో పెకైగబాకిన వారు, స్వయం నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో విపరీతమైన ఒత్తిడికి గురై, లావెక్కుతున్నట్లు గుర్తించారు. నైపుణ్యాన్ని పెంచుకునే ఆస్కారం ఉన్న పదవుల్లో పదోన్నతులు సాధించిన వారిలో ఇలాంటి మార్పేమీ కనిపించలేదని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన అడిలాయిడ్ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. -
యువత ఆత్మహత్యల నివారణకు యాప్
సిడ్నీ: చిన్నకారణాలు, ఒత్తిడి అధిగిమించలేక ఆత్మహత్య చేసుకుంటున్న యువకుల సంఖ్య పెరిగిపోతోంది. ఆత్మహత్యలను అరికట్టేందుకు ఆస్ట్రేలియా పరిశోధకులు యాప్‌ను రూపొందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర, స్థానిక సంస్థల సహాకారంతో యువకుల ఆత్మహత్యలను నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారు. 'యాపిల్ ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యాప్‌ను డిజైన్ చేస్తున్నాం. ఐ ట్యూన్స్, గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్ ద్వారా యువతలో ఆత్మస్థయిర్యం నింపేలా శిక్షణ ఇస్తాం. యాప్ అనుసంధానంతో వైద్యులు, సామాజిక పెద్దలు, స్కూల్ లీడర్స్, మార్గనిర్దేశకులు.. సంధానకర్తలుగా వ్యవహరిస్తారు. యువకుల్లో ఆత్మహత్య ఆలోచనలు వచ్చిన వెంటనే సంధానకర్తలు గ్రహిస్తారు. యువకుల ఆత్మహత్యలను నివారించి వారికి సాయం చేయడంలో యాప్, సంధానకర్తలు కీలకంగా వ్యవహరిస్తారు' అని క్వీన్స్లాండ్ స్కూల్ ఆఫ్ మెడిసన్ యూనివర్సిటీ పరిశోధకుడు మరీ టూంబ్స్ చెప్పారు. -
అతి చిన్న న్యూట్రాన్ నక్షత్రం
మెల్బోర్న్: అంతరిక్షంలోని సుదూర ప్రాంతంలో నక్షత్రాలు, పాలపుంతల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాల్లో పరిభ్రమిస్తున్న అతి చిన్న న్యూట్రాన్ నక్షత్రాన్ని ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. ఇప్పటి వరకూ గుర్తించిన న్యూట్రాన్ నక్షత్రాల్లో ఇదే అతి చిన్నదని వారు చెపుతున్నారు. ఇంతకు ముందు గుర్తించిన దానికంటే ఇది పది లక్షల రెట్లు కచ్చితమైనదిగా వారు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ పరిశోధకులు జీన్పెర్రీ మెక్క్వార్ట్ ఈ అంశంపై అధ్యయనం జరిపారు. ‘‘అంతరిక్షంలోని ఇతర వస్తువులతో పోలిస్తే న్యూట్రాన్ నక్షత్రాలు అతి చిన్నవి. న్యూట్రాన్ నక్షత్రాల్లో కొన్నింటిని పల్సర్లుగా పిలుస్తారు. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అటువంటి పల్సర్ ‘బీ0834ప్లస్06ఆర్’ నక్షత్రంపై పరిశోధనలు నిర్వహించాం. నక్షత్రాలు, పాలపుంతల మధ్య ప్రాంతంలోని పల్సర్ల సిగ్నళ్ల ఆధారంగా ఈ న్యూట్రాన్ నక్షత్రాన్ని గుర్తించాం’’ అని మెక్క్వార్ట్ వెల్లడించారు. అతి భారీ లెన్స్‌లను వినియోగించి ఈ పరిశోధనలు కొనసాగించామని తెలిపారు. -
`అనాస్ట్రోజోల్` తో బ్రెస్ట్ కేన్సర్ నివారణ
సిడ్నీ: మహిళలలో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ కేన్సర్ కు ఔషధాన్ని కనుగొన్నట్టు ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు. ఈ ఔషధంలో బ్రెస్ట్ కేన్సర్ ను నివారించే గుణం ఉందంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిశోధనలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన ప్రొపెసర్ క్రిస్టోబెల్ సాండర్స్ నేతృత్వంలో పరిశోధకుల బృందం ఈ ఔషధాన్ని తయారుచేసింది. ఈ ఔషధం పేరు `అనాస్ట్రోజోల్'`. దీంతో బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్న చాలామంది మహిళలకు ఈ ఔషధం ఉపయోగరమని పేర్కొంది. ఈ ఔషధంలో కొన్ని దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) ఉన్నా.. అదనపు ప్రయోజనాలు మాత్రం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధన విభాగం తెలిపింది. బ్రెస్ట్ కేన్సర్ బాధిత కుటుంబాలనుంచి వచ్చిన వందలాది మంది మహిళలు పరిశోధనలో పాల్గొన్నారు. పరిశోధన ప్రకారం.. ఈ అనాస్ట్రోజోల్ ఔషధాన్ని తీసుకున్న మహిళకు ఐదుసంవత్సరాలలో మళ్లీ కేన్సర్ వచ్చే అవకాశం 50 శాతం వరకూ తగ్గుతుందని వెల్లడించింది. ఈ ఔషధంతో భవిష్యత్తులో తరాల మహిళలకు కూడా ప్రయోజనకారిగా ఉంటుందని క్రిస్టోబెల్ సాండర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.