యువత ఆత్మహత్యల నివారణకు యాప్
సిడ్నీ: చిన్నకారణాలు, ఒత్తిడి అధిగిమించలేక ఆత్మహత్య చేసుకుంటున్న యువకుల సంఖ్య పెరిగిపోతోంది. ఆత్మహత్యలను అరికట్టేందుకు ఆస్ట్రేలియా పరిశోధకులు యాప్ను రూపొందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర, స్థానిక సంస్థల సహాకారంతో యువకుల ఆత్మహత్యలను నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
'యాపిల్ ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ యాప్ను డిజైన్ చేస్తున్నాం. ఐ ట్యూన్స్, గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్ ద్వారా యువతలో ఆత్మస్థయిర్యం నింపేలా శిక్షణ ఇస్తాం. యాప్ అనుసంధానంతో వైద్యులు, సామాజిక పెద్దలు, స్కూల్ లీడర్స్, మార్గనిర్దేశకులు.. సంధానకర్తలుగా వ్యవహరిస్తారు. యువకుల్లో ఆత్మహత్య ఆలోచనలు వచ్చిన వెంటనే సంధానకర్తలు గ్రహిస్తారు. యువకుల ఆత్మహత్యలను నివారించి వారికి సాయం చేయడంలో యాప్, సంధానకర్తలు కీలకంగా వ్యవహరిస్తారు' అని క్వీన్స్లాండ్ స్కూల్ ఆఫ్ మెడిసన్ యూనివర్సిటీ పరిశోధకుడు మరీ టూంబ్స్ చెప్పారు.