ప్రమోషన్‌తో లావెక్కుతారట!
పరిపరి శోధన
ప్రమోషన్ వస్తే పరపతి, పలుకుబడి, అధికారం పెరుగుతాయని అందరికీ తెలిసిందే. అయితే, ప్రమోషన్ వస్తే చాలామంది లావెక్కుతారట! పదోన్నతి వల్ల లభించే అధికారం వల్ల స్వయంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఒత్తిడికి గురై, దానిని అధిగమించడానికి అతిగా తినడమే దీనికి కారణమని ఆస్ట్రేలియన్ పరిశోధకులు చెబుతున్నారు. వివిధ పదవుల్లో పనిచేస్తున్న 450 మందిపై విస్తృతంగా అధ్యయనం చేసి వారు ఈ నిర్ధారణకు వచ్చారు.
ముఖ్యంగా నైపుణ్యాలతో నిమిత్తంలేని నిర్ణయాలు తీసుకునే పదవుల్లో పెకైగబాకిన వారు, స్వయం నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో విపరీతమైన ఒత్తిడికి గురై, లావెక్కుతున్నట్లు గుర్తించారు. నైపుణ్యాన్ని పెంచుకునే ఆస్కారం ఉన్న పదవుల్లో పదోన్నతులు సాధించిన వారిలో ఇలాంటి మార్పేమీ కనిపించలేదని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన అడిలాయిడ్ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.