కాన్‌బెర్రా: కళ్లు, ముక్కు, నోరు ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. దీన్ని నియంత్రించేందుకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం చేస్తూనే ఉన్నాం. కానీ మనుషులు వదిలే గ్యాస్(అవసాన వాయువులు) వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. అయితే దుస్తులు ధరించి లేనప్పుడే ఈ ముప్పు ఎక్కువగా ఉందంటున్నారు. (మే, జూన్‌లోనే 84 శాతం మరణాలు)
అవసాన వాయువుల వల్ల వైరస్ సోకే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ వదలకండని ఆస్ట్రేలియా వైద్యుడు ఆండ్రీ టాగ్ సూచిస్తున్నారు. కానీ బహిరంగ ప్రదేశాల్లో దీన్ని గుర్తుపట్టి భౌతిక దూరం పాటించడం కష్టమేనంటున్నారు జనాలు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 70 లక్షలు దాటగా.. 4 లక్షల మరణాలు సంభవించాయి. దేశంలో కేసుల సంఖ్య 2,76583కు చేరుకోగా 1,35,206 మంది కోలుకున్నారు. 7745 మంది మరణించారు (ఆ 9 దేశాలు కరోనాను జయించాయి)
Comments
Please login to add a commentAdd a comment