సిడ్నీ: మహిళలలో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ కేన్సర్ కు ఔషధాన్ని కనుగొన్నట్టు ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు. ఈ ఔషధంలో బ్రెస్ట్ కేన్సర్ ను నివారించే గుణం ఉందంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిశోధనలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన ప్రొపెసర్ క్రిస్టోబెల్ సాండర్స్ నేతృత్వంలో పరిశోధకుల బృందం ఈ ఔషధాన్ని తయారుచేసింది. ఈ ఔషధం పేరు `అనాస్ట్రోజోల్'`.
దీంతో బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్న చాలామంది మహిళలకు ఈ ఔషధం ఉపయోగరమని పేర్కొంది. ఈ ఔషధంలో కొన్ని దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) ఉన్నా.. అదనపు ప్రయోజనాలు మాత్రం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధన విభాగం తెలిపింది. బ్రెస్ట్ కేన్సర్ బాధిత కుటుంబాలనుంచి వచ్చిన వందలాది మంది మహిళలు పరిశోధనలో పాల్గొన్నారు. పరిశోధన ప్రకారం.. ఈ అనాస్ట్రోజోల్ ఔషధాన్ని తీసుకున్న మహిళకు ఐదుసంవత్సరాలలో మళ్లీ కేన్సర్ వచ్చే అవకాశం 50 శాతం వరకూ తగ్గుతుందని వెల్లడించింది. ఈ ఔషధంతో భవిష్యత్తులో తరాల మహిళలకు కూడా ప్రయోజనకారిగా ఉంటుందని క్రిస్టోబెల్ సాండర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.
`అనాస్ట్రోజోల్` తో బ్రెస్ట్ కేన్సర్ నివారణ
Published Fri, Dec 13 2013 7:38 PM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement