సరికొత్తగా మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ట్యాబ్లెట్లు
న్యూయార్క్: యాపిల్ కంపెనీ ఐపాడ్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ కంపెనీ పునర్వ్యస్థీకరించిన సర్ఫేస్ ట్యాబ్లెట్‌లను మార్కెట్లోకి తెచ్చింది. కొత్తగా పలు ఫీచర్లతో సర్ఫేస్ 2, సర్ఫేస్ ప్రో 2లను అందిస్తున్నామని వీటి ధరలు 449 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ప్రాసెసింగ్ పవర్, బ్యాటరీ లైఫ్‌లతో సహా పలు అంశాల్లో చెప్పుకోదగ్గ అప్‌డేట్స్‌తో వీటిని అందిస్తున్నామని వివరించింది. వచ్చే నెల 22 నుంచి అమెరికా, కెనడా, ఫ్రాన్స్, తదితర దేశాల్లో విక్రయాలు ప్రారంభిస్తామని, ఆ తర్వాత ఇతర దేశాల్లో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ ట్యాబ్లెట్‌లో 10 గంటల వీడియో ప్లే బాక్, ఫుల్ సైజ్ యూఎస్‌బీ పోర్ట్, 3.5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 32 జీబీ, 64 జీబీ మెమెరీల్లో ఈ ట్యాబ్లెట్‌లు లభిస్తాయి.