
హెచ్‌పీ.. వాయిస్ ట్యాబ్లెట్స్
హ్యులెట్-ప్యాకార్డ్ కంపెనీ గురువారం రెండు వాయిస్-కాలింగ్ ట్యాబ్లెట్‌లు-స్లేట్6(ధర రూ.23,700), స్లేట్7(ధర రూ.17,300)లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ: హ్యులెట్-ప్యాకార్డ్ కంపెనీ గురువారం రెండు వాయిస్-కాలింగ్ ట్యాబ్లెట్‌లు-స్లేట్6(ధర రూ.23,700), స్లేట్7(ధర రూ.17,300)లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటితో పాటు యువత లక్ష్యంగా మూడు నోట్‌బుక్‌లను మరో ట్యాబ్‌ను కూడా అందిస్తోంది. ఇక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి ప్రముఖ బాలీవుడ్ నటీమణి దీపికా పదుకొనేతో ఒప్పందం కుదుర్చుకున్నామని హ్యులెట్-ప్యాకార్డ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ , జనరల్ మేనేజర్ (ప్రింటింగ్ అండ్ పర్సనల్ సిస్టమ్స్) రాజీవ్ శ్రీవాత్సవ తెలిపారు.
ఆండ్రాయిడ్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే హెచ్‌పీ స్లేట్ వాయిస్ ట్యాబ్‌ల్లో క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీ కనెక్టివిటీ, డ్యుయల్ సిమ్, డ్యుయల్ ఫ్రంట్ ఫైరింగ స్టీరియో స్పీకర్లు, ఫ్రంట్, రియర్ కెమెరాలు, 16 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీ, 32 జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు.
మూడు నోట్‌బుక్‌లు
10 అంగుళాల విండోస్ 8.1 ఫుల్ హెచ్‌డీ ట్యాబ్- ఓమ్నీ 10ను కూడా విడుదల చేశామని, దీని ధరను త్వరలో వెల్లడిస్తామని శ్రీవాత్సవ పేర్కొంది. దీంతో పాటు హెచ్‌పీ ఎన్వీ17 లీప్ మోషన్ స్పెషల్ ఎడిషన్(ఎస్‌ఈ)(ధర రూ.1.18 లక్షలు), హెచ్‌పీ పెవిలియన్ 15 టచ్‌స్మార్ట్‌నోట్‌బుక్(ధర రూ.51,825), హెచ్‌పీ 15 నోట్‌బుక్(ధర రూ.29,995)లను కూడా గురువారం మార్కెట్లోకి విడుదల చేశామని వివరించారు. అత్యంత ఆధునిక టెక్నాలజీ, అధిక బ్యాటరీ లైఫ్, మల్టీ టాస్కింగ్, వేగవంతమైన పనితీరు ఉన్న డివైస్‌లకే వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారని, గురువారం విడుదల చేసిన డివైస్‌లన్నింటికి ఇలాంటి లక్షణాలున్నాయని వివరించారు.