హై-ఫై సిటీ | High-Fi City | Sakshi
Sakshi News home page

హై-ఫై సిటీ

Published Sat, Oct 11 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

హై-ఫై సిటీ

హై-ఫై సిటీ

  • హైటెక్ సిటీ, మాదాపూర్ పరిధిలో నిరంతరాయంగా సేవలు
  • స్మార్ట్‌సిటీ దిశగా తొలి అడుగుమహా నగరంలో విస్తరిస్తున్న
  • డిజిటల్ సాంకేతిక విప్లవం
  • ‘హై’దరాబాద్... పేరులోనే కాదు...‘హై’టెక్ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ‘ఈ’ క్రమంలో మరో ముందడుగు వేసింది. సిటిజనం ఇకపై ఫోన్లు... ట్యాబ్‌లలో ఇంటర్నెట్ కనెక్షన్ కోసం మాటిమాటికీ రీచార్జి చేసుకునే అవసరం లేకుండా చూస్తోంది. నట్టింట్లో కూర్చొని ఉచితంగా నెట్టింట్లో విహరించే సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది.
     
    సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ సిటీ సాంకేతిక ప్రపంచంలో మరో అడుగు ముందుకేసింది. మెట్రోపొలిస్ సదస్సు సాక్షిగా మహానగరాన్ని ‘వై-ఫై సిటీ’గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం సాకారమవుతోంది. శుక్రవారం నుంచి హైటెక్ సిటీ, మదాపూర్ పరిధిలోని సుమారు 8 కిలోమీటర్ల పరిధిలోని వివిధ కేంద్రాల్లో వైఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్, ఇతర వైఫై ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగిస్తున్న వారికి ఇంటర్నెట్, ఇతర టెక్నాలజీ ఉచితంగా, సులభంగా అందనున్నాయి. ప్రతి ఒక్కరూ నిత్యం 750 ఎంబీ(మెగాబైట్స్) నిడివిగల వైఫై సేవలను వినియోగించుకోవచ్చు. మరో ఆరు నెలల్లో గ్రేటర్ వ్యాప్తంగా వైఫై సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
     
    వైఫై మార్గాలివే

    సైబర్ టవర్స్-మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్-కొత్తగూడ జంక్షన్, సైబర్ టవర్స్-రహేజా మైండ్‌స్పేస్ సర్కిల్ పరిధిలో సుమారు 50 వేల మంది నిత్యం వైఫై సేవలను వినియోగించుకునే సౌకర్యం కలిగింది.
     
    ఇలా వినియోగించుకోవాలి

    మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆప్షన్‌పై క్లిక్ చేసి, మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్‌మిట్ చేయాలి.
         
    ఆ తరవాత మీ మొబైల్‌కు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఎస్‌ఎంఎస్ రూపంలో అందుతాయి.
         
    రెండో బాక్సులో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ టైప్‌చేసి లాగిన్ కావాలి. అపుడు నిరంతరాయంగా వైఫై సేవలు అందుతాయి.

    ఫై అంటే..

    వైఫై అంటే.. వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్ (డబ్ల్యూఎల్‌ఏఎన్). ఇది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ (ఐఈఈఈ) 802.11 స్టాండర్డ్స్‌పై ఆధారపడి ఉంటుంది. పోష్ ఇంగ్లిష్‌లో డబ్ల్యూఎల్‌ఏఎన్‌ను కుదించి ‘వైఫై’ అని పిలుస్తున్నారు. అంటే ైవెర్లైస్ ఫెడిలిటీ అన్నమాట. ఒక్క వైఫై టవర్ సిగ్నల్స్ ఇండోర్‌లో 20 మీటర్లు (66 అడుగులు), ఔట్‌డోర్‌లో 100 మీటర్లు (330 అడుగులు) వరకు అందుతాయి. వైఫైతో కంప్యూటర్లు, వీడియో గేమ్స్ పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, కొన్ని రకాల డిజిటల్ కెమెరాలు, ట్యాబ్లెట్స్, డిజిటల్ ఆడియో ప్లేయర్లు వంటివెన్నో కనెక్టయి ఉంటాయి.
     
    సిగ్నల్స్ ఇలా..

    తీగెల అవసరం లేకుండా నిర్ణీత పరిధిలో హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందడమే వైఫై విశిష్టత. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న తర్వాత వైఫై రౌటర్ పరికరాన్ని అమర్చుతారు. ఈ పరికరం బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అందే ఇంటర్నెట్‌ను నిర్ణీత పరిధిలో వైఫై సౌకర్యం కలిగి ఉన్న ఫోన్లు, కంప్యూటర్ల వంటివాటికి ఇంటర్నెట్ సిగ్నల్‌ను అందిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం బ్లూటూత్ ద్వారా ఫొటోలు, పాటలు పంపినట్లే వై-ఫై ఇంటర్నెట్ సేవలను అందిస్తుందన్నమాట.
     
    బెంగళూరే ఆదర్శం..

    బెంగళూరు నగరాన్ని ఆదర్శంగా తీసుకొని హైదరాబాద్‌లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దేశంలోనే తొలి వైఫై నగరంగా బెంగళూరు ప్రసిద్ధికెక్కింది. అక్కడి సానుకూల, ప్రతికూల అంశాలను పరిగణనలోకి తీసుకొని నగరంలో వైఫై సేవలను దశల వారీగా విస్తరించనున్నారు. 2014 జనవరిలో బెంగళూరులోని మహాత్మా గాంధీ రోడ్‌లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వైఫై సేవలను ప్రారంభించింది. 512 కేబీపీఎస్ వేగంతో రోజులో 3 గంటల పాటు 50 ఎంబీ డేటాను ఉచితంగా పొందుతున్నారు అక్కడి సిటీజన్లు.
     
    ప్రయోజనాలివీ..
    ఆన్‌లైన్‌లో అనుసంధానించినసుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచ్చు.
         
    వైఫైతో ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది.ఇంటర్నెట్, ఫోన్ల పనితీరు ఎన్నో రేట్లు మెరుగవుతుంది.
         
    నగరంలోని పర్యాటక స్థలాలు, సాంస్కృతిక నిలయాల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవచ్చు.  
         
    వైఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటేచాలు.. మొబైల్ డేటా నెట్‌వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజింగ్ చేసే వీలుంటుంది. గల్లీల్లో నిలబడి కూడా ఈ-మెయిల్స్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌లో చాటింగ్ చేయొచ్చు.
         
    4జీతో కేబుల్ కనెక్షన్లతో అవసరముండదు. ఆన్‌లైన్ ద్వారా టీవీలో అన్ని చానళ్లు వీక్షించే వీలుంటుంది.
         
    వైఫై ద్వారా ఒకే కనెక్షన్‌పై ఒకటి కన్నా ఎక్కువ మంది మాట్లాడుకునే యాక్సెస్ లభిస్తుంది.
         
    మొబైల్ ఫోన్‌లో మనం మాట్లాడే వ్యక్తులను చూసే వీలుంటుంది. దీనివల్ల ఒకరికొకరు దగ్గరగా ఉండి మాట్లాడుతున్నామనే అనుభూతి కలుగుతుంది.
         
    {పపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు.
         
    వైఫైతో ప్రభుత్వ, ప్రైవేటు సేవలే కాకుండా కొన్ని రకాల యాప్స్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఉదాహరణకు పార్కింగ్ యాప్, గార్బెజ్ యాప్ వంటివి. ఈ యాప్ సేవలతో నగరం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement