స్మార్ట్‌ఫోన్లలో ‘కిల్’ ఆప్షన్!
విలువైన స్మార్ట్‌ఫోన్‌నో, ట్యాబ్లెట్‌నో కొనుక్కున్నాం.. కానీ, అది దొంగల పాలైతే ఎంత బాధగా ఉంటుంది!? ఇలాంటి పరిస్థితిని నివారించడానికి అసలు స్మార్ట్‌ఫోన్లలో ‘కిల్’ ఆప్షన్‌ను ఏర్పాటు చేయాలని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర నేతలు తీర్మానించేశారు. దానిద్వారా చోరీకి గురైన ఫోన్ పూర్తిగా పనికిరాకుండా పోయేలా ఏర్పాటు చేయాలని ఫోన్ల తయారీ కంపెనీలకు ఆదేశించారు. కాలిఫోర్నియాలో జరుగుతున్న మొత్తం దొంగతనాల్లో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల వాటానే సగం. దానితోపాటు ఆ రాష్ట్రంలోని ఓక్లాండ్‌లోనైతే అది నాలుగింట మూడొంతులకు పైగానే. దీంతో ఫోన్ల చోరీలను నియంత్రించడానికి కొత్త చట్టం చేయనున్నట్లు శాన్‌ఫ్రాన్సిస్కో సెనేటర్ మార్క్ లెనో చెప్పారు. మరోవైపు.. స్మార్ట్‌ఫోన్లలో ‘కిల్’ ఆప్షన్‌ను ఏర్పాటు చేస్తే... హ్యాకర్లు వాటిని హ్యాక్ చేసి, పనికిరాకుండా చేసే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.