సాక్షి,బెంగళూరు: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కార్పోరేట్ కంపెనీలు ముందుకు వస్తుండటం మంచి పరిణామమని సమాచార శాఖ మంత్రి సంతోష్‌లాడ్ అభిప్రాయపడ్డారు. కార్పోరేట్ సోషియల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్) చర్యల్లో భాగంగా డ్రీమ్‌జీకే, టీజీఎస్-ఈ కామ్ కంపెనీలు గురువారం ‘ప్రభుత్వ పాఠశాల-డిజిటల్ పాఠాలు’ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ధార్వాడలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సంతోష్‌లాడ్ పాల్గొని మాట్లాడారు.
విద్యార్థులందరికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వం వల్లే మాత్రమే సాధ్యం కాదన్నారు. కార్పోరేట్ సంస్థలు కూడా ముందుకు రావాల్సి ఉందన్నారు. అయితే రాష్ట్రంలో చాలా కంపెనీలు తమ వంతు సాయంగా నాణ్యమైన విద్య అభివృద్ధి కోసం సహకారం అందిస్తుండటం ఆహ్వానించదగిన పరిమాణమన్నారు. గత రెండుమూడేళ్ల నుంచి ఈ సంప్రదాయం పెరగడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికసదుపాయలు పెంచడమే కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విద్యార్థులు బోధనా తరగతులు నిర్వహించడానికి వీలవుతుందన్నారు. అన ంతరం సంస్థ ప్రతినిధులు మన్‌దీప్ కౌర్, సచిన్‌నాయక్ మాట్లాడుతూ...
ఈఏడాది ధార్వాడలోని 50 పాఠశాలలకు 50 ప్రొజెక్టర్లు, స్క్రీన్‌లతో పాటు ఎంపిక చేసిన విద్యార్థులకు 500 ల్యాప్‌టాప్‌లు, 500 టాబ్లెట్‌లను అందజేయనున్నామన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా కార్పోరేట్ పాఠశాల స్థాయి విద్యాబోధనను అందుకోవడానికి వీలవుతుందని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విన్‌కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
‘కార్పొరేట్’ సహకారం మంచి పరిణామం
Published Fri, Sep 6 2013 2:29 AM | Last Updated on Sat, Sep 22 2018 8:07 PM
Advertisement
Advertisement