టాబ్లెట్స్ పై పెరుగుతున్న యువత మోజు: సర్వే
టాబ్లెట్స్ పై పెరుగుతున్న యువత మోజు: సర్వే
Published Tue, Dec 10 2013 5:52 PM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
డెస్క్ టాప్, ల్యాప్ టాప్స్ కనుమరుగయ్యే పరిస్థితి ఇప్పట్లో లేదని అని సైబర్ మీడియా రీసర్చ్ ఇండియా వెల్లడించింది. మార్కెట్ లోకి ఎన్నో మొబైల్ కంప్యూటర్ వచ్చినా.. డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ల ప్రాముఖ్యత తగ్గలేదని సర్వేలో వెల్లడైంది. ఇటీవల 'టాబ్లెట్స్ యూసేజ్ అండ్ ఆడాప్షన్ ట్రెండ్స్ 2013' అనే అంశంపై సైబర్ మీడియా రీసెర్స్ ఇండియా 20 భారతీయ నగరాల్లో సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో అత్యధికంగా వినియోగదారులు టాబ్లెట్స్ కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్, వినోదాత్మక సమాచారాన్ని పొందేందుకు, ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంట తీసుకు వెళ్లడానికి టాబ్లెట్స్ సౌకర్యంగా ఉన్నాయని సీఎంఆర్ సర్వేలో వెల్లడైంది. అయితే 78 శాతం మంది టాబ్లెట్స్ కన్నా.. డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లనే యువత ఇష్టపడుతున్నారని సర్వే సమాచారం.
సెప్టెంబర్-నవంబర్ 2013లో మొత్తం 3600 మందిలో 13 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు టాబ్లెట్ వినియోగదారులు 2400, వినియోగించని వారిని 1200 మందిని ఎంచుకుని సర్వే నిర్వహించారు. ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ కు 87 శాతం మొగ్గు చూపగా, 10 శాతం మంది ఆపిల్ ఐపాడ్ ను వినియోగానికి యువత ఇష్టపడుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. టాబ్లెట్స్ వినియోగించని వారు కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా చాటింగ్, మెసెజ్, ఈమెయిల్ వినియోగానికే టాబ్లెట్స్ వినియోగిస్తున్నారని సీఎంఆర్ ఇండియా తెలిపింది.
Advertisement
Advertisement