
అరుణ్ కుమార్
చెన్నై : మత్తుకు అలవాటు పడి మెడికల్ షాపులను దోచుకుంటున్న వ్యక్తిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నైకి చెందిన పింకీ అలియాస్ అరుణ్ కుమార్(21) మత్తుకు అలవాటు పడ్డాడు. మందు, గంజాయి కొనటానికి డబ్బులేని సమయంలో మెడికల్ షాపులనుంచి టాబ్లెట్లు దొంగతనం చేయటం మొదలుపెట్టాడు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడే ఖరీదైన మందులను మాత్రమే దొంగిలించేవాడు. తను దొంగతనం చేయబోయే షాపులలో ఆ టాబ్లెట్లు ఉన్నాయా లేదా అని విచారించుకునేవాడు. బాక్సుల మీద ఉన్న పేర్లను గుర్తుపట్టి వాటిని తీసుకెళ్లేవాడు. ( ఛీ! ఇదేం పాడు బుద్ధి సుందర్రాజు )
అనంతరం 8-10 టాబ్లెట్లను నీళ్లతో కలిపి ఓ మిశ్రమంలా తయారుచేసేవాడు. ఆ తర్వాత దాన్ని శరీరంలోకి ఎక్కించుకునేవాడు. దీంతో దాదాపు నాలుగు గంటలపాటు మత్తులో ఉండేవాడు. ఓ మెడికల్ షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరిపి అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఇది వరకే పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. చదవండి : ‘నువ్వు ఆడా.. మగా? నీ గొంతు కుక్కలా ఉంది’
Comments
Please login to add a commentAdd a comment