మేం తక్కువా!
వాషింగ్టన్: అమెరికాలో ఏడాది వయసున్న చిన్నారులు సైతం నిత్యం ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని అల్పాదాయ, మైనారిటీ వర్గాలకు చెందిన 350 మంది చిన్నారుల (6 నెలలు-4 ఏళ్లు)పై సాగిన ఈ అధ్యయనంలో ఆదాయానికి సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి మధ్య అంతరం తగ్గిపోతున్నట్లు స్పష్టమైంది. ఏడాది వయసున్న పిల్లలు, చిన్నారులకు అత్యంత ఇష్టమైనవి ట్యాబ్లెట్లేనని.. దాన్ని వారు రోజుకు సగటున 20 నిమిషాలకు పైగానే వినియోగిస్తున్నారని తేలింది. ఫిలడల్ఫియాలో ఓ ఆస్పత్రికి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు.
సర్వే ప్రకారం.. 83 శాతం మందికి ట్యాబ్లెట్లు, 77 శాతం స్మార్ట్‌పోన్లు ఉన్నాయి. చిన్నారుల్లో మూడొంతుల మందికి సొంత మొబైల్ ఉంది. ఏడాది లోపు చిన్నారుల్లో పదిమందిలో నలుగురు, రెండేళ్ల వయసున్న చిన్నారుల్లో 77 శాతం ఎవరి సాయం లేకుండానే మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ యాప్స్ వాడుతున్నారు.