స్మార్ట్‌ఫోన్‌తో స్మార్ట్‌గా..
టొరంటో: మందబుద్ధితో బాధపడుతున్న వారిలో మానసిక స్థైర్యం పెంపొందడానికి స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, యూట్యూబ్‌లాంటి ఉపకరణాలు ఉపయోగపడుతున్నాయని ఒక పరిశోధనలో తేలింది. మందబుద్ధి ఉండి జీవితంలో విజయం సాధించినవారి అనుభవాలను చిత్రీకరించి, వాటిని బోధించడం ద్వారా మిగతావారిలో స్వీయ నియంత్రణ కలుగుతోందని కెనడాలోని మాంట్రియల్ కాంక్రోడియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ‘ఈ ప్రయోగం కోసం 8 మంది మందబుద్ధిగల వారిపై పరిశోధనలు చేశాం. ఈ ప్రయోగ ఫలితాలను చిన్న చిన్న వీడియోలుగా తీసి ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి చూపించాం. వీటిని చూసినవారిలో స్ఫూర్తి కలిగింది. వారి జీవితంపై సంతృప్తి కలిగింది’ అని కాంక్రోడియా వర్సిటీ ప్రొఫెసర్ ఎన్ లూయిస్ డేవిడ్సన్ వివరించారు.