నిజామాబాద్ అర్బన్ : ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయి. కిం ది స్థాయిలో నిధుల దుర్వినియోగం జోరుగా సాగుతోంది. దీనికి ఈ వ్యవహారమే తార్కా ణం. ఫైలేరియా నివారణ కోసం వైద్య, ఆరోగ్య శాఖ ఏటా మాత్రలను పంపిణీ చేస్తుంది. మాత్రల కొనుగోలు కోసం ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది.
ఇందులో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వచ్చిన నిధులను సద్వినియోగం చేయకుండా తామే పంచేసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా ఇదే తతంగం కొనసాగింది. సగం నిధులను తప్పుడు బిల్లులతో మిం గేశారు. ఈ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఇదీ సంగతి
ఈనెల 14,15,16 తేదీలలో జిల్లావ్యాప్తంగా బోదకాలు వ్యాధి నివారణ కోసం వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మాత్రలను పంపిణీ చేశారు. ఇం దుకోసం ప్రభుత్వం జిల్లాకు 23,75,500 రూ పాయలను మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలోని 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రుల పరిధిలోని 23,04,500 మందికి మాత్రలు పంపిణీ చేయాలి.
మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో 9,500 మంది వైద్య సిబ్బంది, 940 మంది సూపర్‌వైజర్లు, 16 మంది ప్రత్యేక అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందులో విధులు నిర్వహించినందుకుగాను అంగన్‌వాడీ కార్యకర్తలకు రోజుకు 100 రూపాయల చొప్పున చెల్లించాలి. కానీ, ఇప్పటి వర కూ వారికి అందాల్సిన రూ. 5,42,400 అందలేదు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌కు రూ.23 వేలను ఖర్చు చేసినట్లు చూపారు. కానీ, ఈ టీమ్ అసలు ఏర్పాటే కాలేదు.
వీరు రాత్రిపూట దోమల లార్వా నివారణ కోసం పని చేయాల్సి ఉంటుం ది. ఈ ప్రక్రియ మాత్రం అమలు కాలేదు. రూ.80 వేల ను ప్రచార కోసం కేటాయించగా, ఖర్చుచేసినట్లు నివేదికలో చూపారు. వాస్తవానికి బ్యానర్లు, పోస్లర్టు, బుక్‌లెట్లు హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచే సరఫరా చేశారు. వీటిని మలేరియా శాఖ ఆయా కేంద్రాలకు పంపిణీ చేసింది. 75 బ్యానర్లు, ఐదు వేల ప్లకార్డులు ముద్రించామని, దీనికే రూ. 80 వేలు ఖర్చయ్యాయని పేర్కొన్నారు.
రవాణా పేరిట కూడా
జిల్లా కేంద్రం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బో దకాలు నివారణ మందులను చేరవేయడానికి రూ. 30 వేల రూపాయలను ఖర్చు చేశారు. వాస్తవానికి జిల్లాకేంద్రంలో సమావేశం నిర్వహించి, సమావేశానికి వచ్చి న మెడికల్ ఆఫీసర్లకు, సిబ్బందికి మందులను అందజేశారు. వీరే ఆరోగ్యకేంద్రాలకు మందులను తీసుకెళ్లారు. మాత్రలు వేసుకున్న తరువాత ఏదైనా ప్రమాదం జరిగితే, ఆస్పత్రికి తరలించడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సిబ్బందికి శిక్షణ ఇస్తారు.
దీనికి రూ. 30 వేలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమాలను మాత్రం నిర్వహించలేదు. మెడికల్ ఆఫీసర్లు, పారామెడికల్ సిబ్బంది కి ఒక్కో రోజు శిక్షణ కోసం రూ. 85 వేలు ఖర్చు చేసిన ట్లు చూపారు. పలువురు గైర్హాజరైనా గౌరవ వేతనం అందించినట్లు నివేదికలో చేర్చినట్లు తెలిసింది. ఇంటింటికి తిరుగుతూ మాత్రల పంపిణీ చేపట్టవల్సి ఉండగా, జిల్లా కేంద్రంతోపాటు మరికొన్ని చోట్ల పాఠశాల, కళాశాల విద్యార్థులకే పంపిణీ చేసి, నివేదికలు రూపొందిం చినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఓ ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు సమాచారం. మలేరియా శాఖలోని ఇద్ద రు ఉద్యోగులు తప్పుడు బిల్లులు తీసుకరావడంలో సహకరించారని తెలిసింది.
పంచుకున్నారు!
Published Tue, Dec 30 2014 11:59 PM | Last Updated on Tue, Oct 2 2018 3:46 PM
Advertisement
Advertisement