Bodakalu
-
బోదకాలు... బాధలు
సాక్షి, హైదరాబాద్: బోదకాలు బాధితులకు ఆసరా లభించడంలేదు. వారికి ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున ‘ఆసరా’పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా ఇంకా ఆచరణకు నోచుకోలేదు. ఏప్రిల్ నుంచి ఈ పింఛన్లను అమలు చేయాలని, మేలో రెండు నెలల మొత్తాన్ని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. మే నెల పూర్తి కావస్తున్నా ఇంకా వారికి పింఛన్లు చెల్లించలేదు. మండల అధికారులను అడిగితే ఇంకా వివరాలు రాలేదని, ఎప్పటి నుంచి పింఛన్లు చెల్లించేది చెప్పలేమని అంటున్నారు. బోదకాలు సమస్యతో ఏ పనీ చేయలేని దుస్థితిలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు. కూలీ పనులకు కూడా వీరిని ఎవరూ పిలవరు. పేద కుటుంబాల్లోని బోదకాలు బాధితులు సాధారణ జీవనం గడపడం గగనమైంది. రోజూ మందులు వాడేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రతినెలా వందల రూపాయల ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో బోదకాలు బాధితులకు ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున పింఛన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల జాబితాను గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించాలని వైద్య, ఆరోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,084 మందికి బోదకాలు బాధితుల పింఛన్ ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. గ్రేడ్లతో మెలిక... బోదకాలు బాధితులకు ఆసరా పింఛన్ ఇచ్చే విషయంలో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం చెప్పినట్లుగా కాకుండా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేవిధంగా అధికారులు నిబంధనలు రూపొందించారు. ప్రభుత్వం ముందుగా సేకరించిన సమాచారం ప్రకారం 46,476 వేల మంది బోదకాలు బాధితులున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. అధికారుల నిర్వాకంతో చాలామంది బాధితులు పింఛన్లకు దూరమయ్యారు. ఆసరా పింఛన్ల ప్రకటన తర్వాత లబ్ధిదారుల గుర్తింపు కోసం అధికారులు గ్రేడ్ల నిబంధన తెచ్చారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారికి మాత్రమే పింఛన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. బోద కాలు వ్యాధి తీవ్రత దృష్ట్యా గ్రేడ్ 3, గ్రేడ్ 2 దశలో ఉన్నవారికి ఎక్కువ ఇబ్బంది ఉంటుందని, వీరిని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించడంతో వారి సంఖ్య 13,084కు తగ్గింది. -
బాధకాలు
ఫైలేరియా నివారణపై చర్యలు శూన్యం డిప్యూటేషన్ సిబ్బందితో కార్యకలాపాలు బాధితుల గోడు పట్టని అధికార యంత్రాంగం జిల్లాలో 7 వేలకు పైగా పైలేరియూ బాధితులు బోదకాలు బాధ పెడుతున్నారుు.. నడువరాదు.. కింద కూరోరాదు.. పని చేసుకోరాదు.. మంచానికి పరిమితం కావాల్సిందే.. ఇదీ ఓ మహమ్మారి వంటిది.. దీనిని నిర్మూలించడం సాధ్యం కాదు.. అవగాహన ఒక్కటే మార్గం.. ఇది క్యూలెక్స్ దోమకాటు వల్ల వస్తుంది.. జిల్లాలో ఇప్పటికే 7వేలకు పైగా కేసులు నమోదయ్యూరుు.. డిప్యూటీ సీఎం జిల్లాకు చెందిన వారే అరుునా.. మొన్నటివరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాష్ట్ర స్థాయి అధికారిగా ఉన్నా దీనిపై దృష్టి పెట్టలేదు.. ఇప్పటికైనా దృష్టిసారించి నివారణ చర్యలు చేపట్టాలి.. జిల్లావ్యాప్తంగా బోధకాలు బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. సుమారు 7 వేల పైచిలుకు మంది ఫైలేరియా బాధితులు జిల్లాలో ఉన్నట్లు సీనియర్ ఎంటమాలజిస్టు రమణమూర్తి తెలిపారు. వ్యాధి నివారణకు మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎండీఏ) ద్వారా క్యాంపులు నిర్వహించాల్సి ఉంది. డీఈసీ(డైఈథైల్ కార్బోమిజైన్ సిట్రెట్) మందులు ముందస్తుగా వాడితే వ్యాధి వ్యాప్తిని నిరోధించవ చ్చు. వీటిని 2-70 ఏళ్లలోపు వారు, గర్భిణులు, తీవ్ర అస్వస్థత ఉన్నవారు ఉపయోగించొద్దు. 4- 5 ఏళ్లలోపు వారు ఒక్క మాత్ర, 6-14 ఏళ్ల లోపు రెండు మాత్రలు, 16 ఏళ్ల వయస్సు పైబడిన వారు మూడు మాత్రలు వాడాలి. అరుుతే పెద్దసంఖ్యలో బాధితులున్నా ఎండీఏకు జిల్లా ఎంపిక కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఫలితంగా ఫైలేరియూ నివారణకు ప్రభుత్వం నుంచి జరగాల్సిన కృషి జిల్లాలో జరగడం లేదు. ఫైలేరియూ(బోధకాలు).. ఇదో మహమ్మారి వ్యాధి. కాలికి బండ కట్టుకుని నడుస్తున్న బాధ. జ్వరం వస్తే ముద్ద ముదిరితే నిర్మూలన కష్టం. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. వేల సంఖ్యలో బోధకాలు బాధితులు ఉండడం దీన్ని రూఢీ చేస్తోంది. ఎండీఏ కార్యక్రమం ద్వారా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. చికిత్స విధానం ఇలా.. బాధితుల వయస్సును బట్టి 12 రోజులు ఆరోగ్య కార్యకర్తలు డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలిస్తారు. ప్రాథమిక దశలోనే వేసుకోవాలి. వాపు పెరిగాక ఫలితం ఉండదు. వాచిన భాగాలను నీటితో శుభ్రం చేసి పొడి బట్టతో తుడిచి యాంటిబయూటిక్ ఆరుుంట్మెంట్ రాయూలి. కాళ్ల సంబంధిత వ్యాయూమం చేయూలి. జ్వరంతో ఉన్న వ్యాధిగ్రస్తులు వ్యాయూమం చేయొద్దు. గుండె జబ్బులుంటే డాక్టర్‌ను సంప్రదించి వ్యాయూమం చేయూలి. వ్యాధి వ్యాప్తి ఇలా.. మురుగు కాల్వల్లో పెరిగే ఆడ క్యూలెక్స్ దోమ కాటుతో ఫైలేరియా వస్తుంది. రెండున్నరేళ్లలో ఎప్పుడైనా వ్యాధి లక్షణాలు బహిర్గతం కావొచ్చు. శరీరంపై వాపు వస్తే వైద్యులను సంప్రదించాలి. డిప్యూటేషన్ సిబ్బందితో నిర్వహణ ఫైలేరియా క్యాంపుల నిర్వహణ కోసం 13 మందికిగాను ముగ్గురినే నియమించారు. ఈ విభాగం డ్రైవర్‌ను డీహెచ్ సాంబశివరావు తీసుకెళ్లారు. చెన్నారావుపేటకు చెందిన సిబ్బందితోపాటు ఇద్దరు ‘104’ ల్యాబ్ టెక్నీషియన్లు రె ండేళ్లుగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. అలాగే వొడితెల, ఆత్మకూరు, పర్వతగిరి, వెంకటాపూర్‌కు చెందిన హెల్త్సూపర్వైజర్లు రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. వరంగల్‌లో ఏప్రిల్ 2011లో ఫైలేరియా విభాగం కార్యక్రమాలు మొదలయ్యాయి. 2014, డిసెంబర్ 2 -5 వరకు దంతాలపల్లి, ఐనవోలు, కొడకండ్ల గ్రామాల్లో నిర్వహించిన క్యాంపుల్లో 58 పాజిటివ్ కేసులు నమోదయ్యూరుు. నరకం అనుభవిస్తున్నా.. ఇరవై ఏళ్ల నుంచి బోదకాలుతో నరకం అనుభవిస్తున్నా. నెల రోజులకోసారి జ్వరం వస్తే అన్నం తినకుండా ఐదు రోజుల పాటు మంచంలోనే ఉంటా. ప్రభుత్వ వైద్యులు ఎలాంటి వైద్యం అందించడం లేదు. ప్రైవేటు వైద్యులను ఆశ్రయించి జ్వరం వచ్చినప్పుడు మందులు వేసుకుంటా. ప్రభుత్వం మంచి చికిత్స అందించి మా బాధలు తీర్చాలి. - జక్కుల రాములు -
పంచుకున్నారు!
నిజామాబాద్ అర్బన్ : ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయి. కిం ది స్థాయిలో నిధుల దుర్వినియోగం జోరుగా సాగుతోంది. దీనికి ఈ వ్యవహారమే తార్కా ణం. ఫైలేరియా నివారణ కోసం వైద్య, ఆరోగ్య శాఖ ఏటా మాత్రలను పంపిణీ చేస్తుంది. మాత్రల కొనుగోలు కోసం ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. ఇందులో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వచ్చిన నిధులను సద్వినియోగం చేయకుండా తామే పంచేసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా ఇదే తతంగం కొనసాగింది. సగం నిధులను తప్పుడు బిల్లులతో మిం గేశారు. ఈ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇదీ సంగతి ఈనెల 14,15,16 తేదీలలో జిల్లావ్యాప్తంగా బోదకాలు వ్యాధి నివారణ కోసం వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మాత్రలను పంపిణీ చేశారు. ఇం దుకోసం ప్రభుత్వం జిల్లాకు 23,75,500 రూ పాయలను మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలోని 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రుల పరిధిలోని 23,04,500 మందికి మాత్రలు పంపిణీ చేయాలి. మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో 9,500 మంది వైద్య సిబ్బంది, 940 మంది సూపర్వైజర్లు, 16 మంది ప్రత్యేక అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందులో విధులు నిర్వహించినందుకుగాను అంగన్వాడీ కార్యకర్తలకు రోజుకు 100 రూపాయల చొప్పున చెల్లించాలి. కానీ, ఇప్పటి వర కూ వారికి అందాల్సిన రూ. 5,42,400 అందలేదు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌కు రూ.23 వేలను ఖర్చు చేసినట్లు చూపారు. కానీ, ఈ టీమ్ అసలు ఏర్పాటే కాలేదు. వీరు రాత్రిపూట దోమల లార్వా నివారణ కోసం పని చేయాల్సి ఉంటుం ది. ఈ ప్రక్రియ మాత్రం అమలు కాలేదు. రూ.80 వేల ను ప్రచార కోసం కేటాయించగా, ఖర్చుచేసినట్లు నివేదికలో చూపారు. వాస్తవానికి బ్యానర్లు, పోస్లర్టు, బుక్లెట్లు హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచే సరఫరా చేశారు. వీటిని మలేరియా శాఖ ఆయా కేంద్రాలకు పంపిణీ చేసింది. 75 బ్యానర్లు, ఐదు వేల ప్లకార్డులు ముద్రించామని, దీనికే రూ. 80 వేలు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. రవాణా పేరిట కూడా జిల్లా కేంద్రం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బో దకాలు నివారణ మందులను చేరవేయడానికి రూ. 30 వేల రూపాయలను ఖర్చు చేశారు. వాస్తవానికి జిల్లాకేంద్రంలో సమావేశం నిర్వహించి, సమావేశానికి వచ్చి న మెడికల్ ఆఫీసర్లకు, సిబ్బందికి మందులను అందజేశారు. వీరే ఆరోగ్యకేంద్రాలకు మందులను తీసుకెళ్లారు. మాత్రలు వేసుకున్న తరువాత ఏదైనా ప్రమాదం జరిగితే, ఆస్పత్రికి తరలించడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సిబ్బందికి శిక్షణ ఇస్తారు. దీనికి రూ. 30 వేలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమాలను మాత్రం నిర్వహించలేదు. మెడికల్ ఆఫీసర్లు, పారామెడికల్ సిబ్బంది కి ఒక్కో రోజు శిక్షణ కోసం రూ. 85 వేలు ఖర్చు చేసిన ట్లు చూపారు. పలువురు గైర్హాజరైనా గౌరవ వేతనం అందించినట్లు నివేదికలో చేర్చినట్లు తెలిసింది. ఇంటింటికి తిరుగుతూ మాత్రల పంపిణీ చేపట్టవల్సి ఉండగా, జిల్లా కేంద్రంతోపాటు మరికొన్ని చోట్ల పాఠశాల, కళాశాల విద్యార్థులకే పంపిణీ చేసి, నివేదికలు రూపొందిం చినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఓ ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు సమాచారం. మలేరియా శాఖలోని ఇద్ద రు ఉద్యోగులు తప్పుడు బిల్లులు తీసుకరావడంలో సహకరించారని తెలిసింది.