బాధకాలు | Filaria on preventive measures to nill | Sakshi
Sakshi News home page

బాధకాలు

Published Wed, Jan 28 2015 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

బాధకాలు

బాధకాలు

ఫైలేరియా నివారణపై చర్యలు శూన్యం
డిప్యూటేషన్ సిబ్బందితో కార్యకలాపాలు
బాధితుల గోడు పట్టని  అధికార యంత్రాంగం
 

 జిల్లాలో 7 వేలకు పైగా పైలేరియూ బాధితులు
 
బోదకాలు బాధ పెడుతున్నారుు.. నడువరాదు.. కింద కూరోరాదు.. పని చేసుకోరాదు.. మంచానికి పరిమితం కావాల్సిందే.. ఇదీ ఓ మహమ్మారి వంటిది.. దీనిని నిర్మూలించడం సాధ్యం కాదు.. అవగాహన ఒక్కటే మార్గం.. ఇది క్యూలెక్స్ దోమకాటు వల్ల వస్తుంది.. జిల్లాలో ఇప్పటికే 7వేలకు పైగా కేసులు నమోదయ్యూరుు.. డిప్యూటీ సీఎం జిల్లాకు చెందిన వారే అరుునా.. మొన్నటివరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాష్ట్ర స్థాయి అధికారిగా ఉన్నా దీనిపై దృష్టి పెట్టలేదు.. ఇప్పటికైనా దృష్టిసారించి నివారణ చర్యలు చేపట్టాలి..
 
జిల్లావ్యాప్తంగా బోధకాలు బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. సుమారు 7 వేల పైచిలుకు మంది ఫైలేరియా బాధితులు జిల్లాలో ఉన్నట్లు సీనియర్ ఎంటమాలజిస్టు రమణమూర్తి తెలిపారు. వ్యాధి నివారణకు మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎండీఏ) ద్వారా క్యాంపులు నిర్వహించాల్సి ఉంది. డీఈసీ(డైఈథైల్ కార్బోమిజైన్ సిట్రెట్) మందులు ముందస్తుగా వాడితే వ్యాధి వ్యాప్తిని నిరోధించవ చ్చు. వీటిని 2-70 ఏళ్లలోపు వారు, గర్భిణులు, తీవ్ర అస్వస్థత ఉన్నవారు ఉపయోగించొద్దు. 4- 5 ఏళ్లలోపు వారు ఒక్క మాత్ర, 6-14 ఏళ్ల లోపు రెండు మాత్రలు, 16 ఏళ్ల వయస్సు పైబడిన వారు మూడు మాత్రలు వాడాలి. అరుుతే పెద్దసంఖ్యలో బాధితులున్నా ఎండీఏకు జిల్లా ఎంపిక కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఫలితంగా ఫైలేరియూ నివారణకు ప్రభుత్వం నుంచి జరగాల్సిన కృషి జిల్లాలో జరగడం లేదు.
 
ఫైలేరియూ(బోధకాలు).. ఇదో మహమ్మారి వ్యాధి. కాలికి బండ కట్టుకుని నడుస్తున్న బాధ. జ్వరం వస్తే ముద్ద ముదిరితే నిర్మూలన కష్టం. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. వేల సంఖ్యలో బోధకాలు బాధితులు ఉండడం దీన్ని రూఢీ చేస్తోంది. ఎండీఏ కార్యక్రమం ద్వారా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
 
చికిత్స విధానం ఇలా..

 బాధితుల వయస్సును బట్టి 12 రోజులు ఆరోగ్య కార్యకర్తలు డీఈసీ, ఆల్‌బెండజోల్ మాత్రలిస్తారు. ప్రాథమిక దశలోనే వేసుకోవాలి. వాపు పెరిగాక ఫలితం ఉండదు. వాచిన భాగాలను నీటితో శుభ్రం చేసి పొడి బట్టతో తుడిచి యాంటిబయూటిక్ ఆరుుంట్‌మెంట్ రాయూలి. కాళ్ల సంబంధిత వ్యాయూమం చేయూలి. జ్వరంతో ఉన్న వ్యాధిగ్రస్తులు వ్యాయూమం చేయొద్దు. గుండె జబ్బులుంటే డాక్టర్‌ను సంప్రదించి వ్యాయూమం చేయూలి.
 
 
వ్యాధి వ్యాప్తి ఇలా..

 
మురుగు కాల్వల్లో పెరిగే ఆడ క్యూలెక్స్ దోమ కాటుతో ఫైలేరియా వస్తుంది. రెండున్నరేళ్లలో ఎప్పుడైనా వ్యాధి లక్షణాలు బహిర్గతం కావొచ్చు. శరీరంపై వాపు వస్తే వైద్యులను సంప్రదించాలి.  
 
డిప్యూటేషన్ సిబ్బందితో నిర్వహణ

 
ఫైలేరియా క్యాంపుల నిర్వహణ కోసం 13 మందికిగాను ముగ్గురినే నియమించారు. ఈ విభాగం డ్రైవర్‌ను డీహెచ్ సాంబశివరావు తీసుకెళ్లారు. చెన్నారావుపేటకు చెందిన సిబ్బందితోపాటు ఇద్దరు ‘104’ ల్యాబ్ టెక్నీషియన్లు రె ండేళ్లుగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. అలాగే వొడితెల, ఆత్మకూరు, పర్వతగిరి, వెంకటాపూర్‌కు చెందిన హెల్త్‌సూపర్‌వైజర్లు రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. వరంగల్‌లో ఏప్రిల్ 2011లో ఫైలేరియా విభాగం కార్యక్రమాలు మొదలయ్యాయి. 2014, డిసెంబర్ 2 -5 వరకు దంతాలపల్లి, ఐనవోలు, కొడకండ్ల గ్రామాల్లో నిర్వహించిన క్యాంపుల్లో 58 పాజిటివ్ కేసులు నమోదయ్యూరుు.  
 
నరకం అనుభవిస్తున్నా..
 
ఇరవై ఏళ్ల నుంచి బోదకాలుతో నరకం అనుభవిస్తున్నా. నెల రోజులకోసారి జ్వరం వస్తే అన్నం తినకుండా ఐదు రోజుల పాటు మంచంలోనే ఉంటా. ప్రభుత్వ వైద్యులు ఎలాంటి  వైద్యం అందించడం లేదు. ప్రైవేటు వైద్యులను  ఆశ్రయించి జ్వరం వచ్చినప్పుడు మందులు వేసుకుంటా.   ప్రభుత్వం మంచి చికిత్స అందించి మా బాధలు తీర్చాలి.
 - జక్కుల రాములు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement