
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగీ నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరక్టర్లు, ఇతర ఉన‍్నతాధికారులు రేపు ఉదయం హైకోర్టులో హాజరు కావాలంటూ ఆదేశించింది. డెంగీ వచ్చి మనుషులు చనిపోతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీపై ప్రజల్లో కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment