Preventive measures
-
ప్రివెంటివ్ కేర్ మరింత బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రివెంటివ్ కేర్‌పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇప్పటికే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారణకు చర్యలు చేపడుతున్నారు. ప్రివెంటివ్ కేర్‌ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్(బీపీయూహెచ్)లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 334 యూనిట్లు నిర్మించాల్సి ఉండగా, తొలి దశలో 166 యూనిట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు భవన నిర్మాణానికి రూ.50 లక్షలు, వైద్య పరికరాల కోసం రూ.30 లక్షలు చొప్పున రూ.80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్మాణాలన్నీ చేపడుతున్నారు. ఇప్పటి వరకూ 141 యూనిట్ల భవన నిర్మాణాలకు టెండర్లు ఖరారు కాగా, 94 చోట్ల పనులు కొనసాగుతున్నాయి. మండల స్థాయి సర్వేలెన్స్ యూనిట్లుగా.. పీహెచ్సీ ప్రాంగణాల్లో నిర్మిస్తున్న బీపీయూహెచ్‌లు మండల స్థాయి సర్వేలెన్స్ యూనిట్లుగా వ్యవహరిస్తాయి. వీటిల్లో హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(హెచ్ఎంఐఎస్) యూనిట్‌తోపాటు పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సెమీఆటో అలైజర్, సెల్ కౌంటర్, ట్రూనాట్, అల్ట్రాసౌండ్, హెచ్‌బీ1సీ పరికరాలు ల్యాబ్‌లలో ఉంటాయి. కరోనా వైరస్, డయేరియా, విష జ్వరాలు, ఇతర వ్యాధులు వ్యాపించినప్పుడు ఈ యూనిట్ల ద్వారా సర్వేలెన్స్ ఉంచుతారు. ఎపిడమాలజిస్ట్‌లతోపాటు విజిలెన్స్ సెల్ కూడా అందుబాటులోకి వస్తాయి. యూనిట్లన్నింటినీ జిల్లా, బోధనాస్పత్రుల్లోని ల్యాబ్‌లకు అనుసంధానం చేస్తారు. -
కోవిడ్ పరీక్షల్లో.. మరింత దూకుడు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 పరీక్షలను వీలైనంత ఎక్కువగా క్రమంగా పెంచాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పరీక్షలు చేసే విషయంలో ఎక్కడా వెనకడుగు వేయరాదని, రోజు రోజుకూ పరీక్షల సంఖ్య పెరుగుతూ పోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా పరీక్షల సంఖ్యను బాగా పెంచినందుకు అధికారులను అభినందించారు. కోవిడ్–19 నివారణ చర్యలు, పరీక్షలు జరుగుతున్న తీరు తెన్నులపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు పేర్కొన్న అంశాలు, సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి. టెస్ట్‌లు బాగా జరుగుతున్నాయి.. ♦ కోవిడ్ లక్షణాలున్న వారికి త్వరతగతిన టెస్ట్‌లు జరిగేలా చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో చేసిన ర్యాండమ్ పరీక్షల్లో సుమారు 30కిపైగా కిట్లలో పాజిటివ్ వచ్చాయని, వాటి నిర్ధారణ కోసం పీసీఆర్ టెస్టులకు పంపామని చెప్పారు. ♦ టెలిమెడిసిన్ ద్వారా వైద్య సలహా తీసుకున్న వారికి మందులు కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సింగపూర్, చైనాల్లో మరోసారి వైరస్ వ్యాప్తి ప్రారంభమైందన్నారు. అత్యవసర కేసుల్లో వెంటనే స్పందించాలి ♦ తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలి. 104కు కాల్ చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలి. డెలివరీ, ఇతరత్రా ఎమర్జెన్సీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలి. ♦ ఎక్కడా వెనకడుగు వేయకుండా టెస్ట్‌ల సంఖ్యను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలి. ♦ నాడు–నేడు ద్వారా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు ఊపందుకునేలా చూడాలి. ప్రతిపాదిత కొత్త మెడికల్ కాలేజీలకు వెంటనే స్థలాలను గుర్తించాలి. ♦ ఎవరికి ఏ సమస్య ఉన్నా 1902కు కాల్ చేయాలి. అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా పంటలు, ధరల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలి. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది. గ్రామాల్లోని రైతులు ఏమైనా ఇబ్బందులుంటే అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను సంప్రదించాలి. ♦ 100 రూపాయలకు వివిధ రకాల పండ్లు ఇవ్వటాన్ని కొనసాగించాలి. ఇది శాశ్వత ప్రాతిపదికన ముందుకు సాగేలా చూడాలి. తప్పుడు కథనాలపై చర్చ ♦ గుంటూరు జిల్లా ఈపూరు మండలానికి చెందిన బొల్లా వీరాంజనేయలు రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెంలో కర్బూజా పంటను పొలంలో వదిలేశారని.. కడప నుంచి తెప్పించిన అరటి విజయవాడలో రైతు బజార్లకు చేరక కుళ్లిపోతోందని ఓ పత్రికలో (సాక్షి కాదు) వచ్చిన కథకాలపై చర్చ జరిగింది. ♦ఈ రెండు కథనాలూ.. తప్పుడు సమాచారం అని అధికారులు సీఎంకు నివేదించారు. కర్బూజా పంట పండించిన రైతు కుటుంబంతో మాట్లాడామని చెప్పారు. ఇప్పటికే రెండు కోతలు కోసి పంటను తీసుకున్నామని, గిట్టుబాటు రేటు కూడా తీసుకున్నామని చెప్పారన్నారు. మూడో కోతలో నాసిరకం కాయలుండటంతో వదిలేశామని, వాటిని తరలిస్తే రవాణా ఖర్చులు కూడా రావని ఆ కుటుంబం తెలిపిందని అధికారులు వివరించారు. ♦ కడప నుంచి విజయవాడకు తెప్పించిన అరటి గెలలను స్థానిక మార్కెట్లకు పంపించామని చెప్పారు. ఎక్కడా అరటి గెలలను వదిలేయలేదని స్పష్టం చేశారు. ♦ అధికారికంగా సమాచారం ఇవ్వకపోయినా ఇష్టం వచ్చినట్టు కేసులు, మరణాల సంఖ్యను చూపిస్తున్నారనే విషయంపై సమావేశంలో చర్చ జరిగింది. కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అధికారులు వివరించారు. ♦ సమీక్షా సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కుటుంబసభ్యుల వివరాలు జియో మ్యాపింగ్
-
ఏపీ విధానాలు అనుసరణీయం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామాల్లో కోవిడ్–19 వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పద్ధతులు అవలంబిస్తోందని, ఇవి అనుసరణీయమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఏపీలో పంచాయతీల్లో చురుకైన చర్యలు చేపడుతున్నారని, జిల్లా – గ్రామీణ స్థాయిలలో నిత్యం బహిరంగ ప్రదేశాల పరిశుభ్రత, అనాధలు, వలసకార్మికుల కోసం ఆశ్రయాలు, క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు, పేదలకు రక్షణ సామగ్రి, ఆర్థిక సహాయం, ఉచిత రేషన్, అవగాహన పెంపు వంటి కార్యక్రమాలు అవలంబిస్తున్నాయని చెప్పింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగాలు, పంచాయతీలు చురుకైన చర్యలు తీసుకుంటున్నాయని, దిగ్బందం, సామాజిక దూరం నిబంధనలను కచ్చితంగా పాటించేలా సన్నిహితంగా పర్యవేక్షిస్తోందని వివరించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, పంచాయతీలతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్టు తెలిపింది. (అధిక కేసులున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి) 1.43 కోట్ల కుటుంబాల సర్వే.. భారత వైద్య పరిశోధన మండలి సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కోవిడ్–19 పీడితుల గుర్తింపు నిమిత్తం రాష్ట్ర ప్రభు త్వం ఇంటింటి సర్వే చేపట్టింది. మూడోవిడత పూర్తయ్యేసరికి 1.47 కోట్ల కుటుంబాలకు గాను 1.43 కోట్ల కుటుంబాలపై సర్వే ముగియగా ఇప్పటిదాకా 32,349 మందిని ఆస్పత్రుల్లో చేర్చారు. 9,107 మందికి పరీక్షలు నిర్వ హించాలని వైద్యులు సిఫారసు చేశారు. ప్రభుత్వం ప్రజలకు 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయనుంది. ఇతర రాష్ట్రాల్లో ఇలా.. ఇదే ప్రకటనలో ఇతర రాష్ట్రాల పరిధిలో పంచాయతీల్లో చేపట్టిన అనుసరణీయ ఉత్తమ ఆచరణ పద్ధతులను కూడా ప్రస్తావించింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని సిద్దార్థనగర్ జిల్లాలోని పంచాయతీల్లో పోస్ట్‌మ్యాన్ సూక్ష్మ ఏటీఎం ద్వారా నగదు అందుబాటులో ఉంచడం, మీరట్ డివిజన్లో నిరుపేద కుటుంబాలకు రూ.1,000 వంతున ఆర్థిక సహాయం, వలస కార్మికులకు రేషన్, ఆహార ప్యాకెట్లు, పారిశుధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి అందజేయడం వంటి చర్యలు. కేరళలో సామాజిక వంట శాలలు, కుటుంబశ్రీ లబ్ధిదారులు తయారు చేసిన 18 లక్షల మాస్కుల పంపిణీ, ఇతర సూక్ష్మ సంస్థల ద్వారా ప్యూరిఫైడ్ వాటర్, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ప్రజల్లో అవగాహనకు కృషి. దాద్రా–నాగర్ హవేలీలో పరిశుభ్రతతోపాటు నిత్యం అవగాహన కార్యక్రమాల నిర్వహణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటైజర్లు, మాస్కుల ఉచిత పంపిణీ. -
స్వియనియంత్రణే ప్రాణాలను కాపాడుతుంది
-
ముందుగానే స్పందిస్తే మరణాలు తగ్గించొచ్చు
న్యూయార్క్: కరోనా వైరస్ వంటి అంటువ్యాధుల సమయంలో ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం వల్ల మరణాల సంఖ్య తగ్గేందుకు అవకాశం ఉందని అమెరికా పరిశోధకులు అంటున్నారు. 1918–19 సంవత్సరాల్లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో అమెరికాలోని కొన్ని నగరాల్లో ముందుగానే అప్రమత్తమై చేపట్టిన నిర్బంధ, నివారణ చర్యల కారణంగా మరణాలు తగ్గినట్లు లయోలా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ బారినపడి 5 కోట్ల మంది చనిపోగా అమెరికాలో 6.75 లక్షల మంది బలయ్యారు. శాన్ఫ్రాన్సిస్కో, సెయింట్ లూయిస్, కన్సాస్ సిటీ, మిల్వాకీ నగరాలు చేపట్టిన.. పాఠశాలల మూసివేత, సభలు, సమావేశాలపై నిషేధం, కఠినమైన ఐసోలేషన్ విధానాలు, పరిశుభ్రత పాటించడం, తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చేయడం వంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు. ‘ఈ చర్యలు వ్యాధి తీవ్రతను 30 నుంచి 50 శాతం వరకు తగ్గించాయి. ఆలస్యంగా స్పందించిన/ ముందు జాగ్రత్తలు తక్కువగా తీసుకున్న నగరాలతో పోలిస్తే ఇవి మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఈ నగరాల్లో మరణాల రేటు గరిష్ట స్థాయిని చేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టింది. మొత్తం మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ పరిశోధన ఫలితాలు తాజాగా అమెరికన్ సొసైటీ ఆఫ్ సైటోపాథాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ‘ఇలాంటి కఠినచర్యలతో ఎలాంటి ఫలితం ఉండదని అప్పట్లో జనం అనుకునేవారు. కానీ, అది తప్పు అని మా అధ్యయనంలో తేలింది’అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘1918లో అమెరికాలో పేదరికం, పోషకాహార లోపం, అపరిశుభ్రత, జనం ఎక్కువగా గుమికూడటం ఎక్కువగా ఉండేవి. అప్పటి పరిస్థితులతో పోల్చుకుంటే ప్రపంచం నేడు చాలా మారింది. అయినప్పటికీ, వందేళ్ల క్రితం తీసుకున్న నివారణ చర్యలు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణకూ అనుసరణీయాలే’అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేదు వాషింగ్టన్: కరోనా ముప్పు వృద్ధులకే అధికమన్న వాదనలో నిజం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆరోగ్యం.. అనారోగ్యం అన్నవే కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కరోనా బారినపడే అవకాశాలు తక్కువని తేల్చిచెప్పింది. సహజంగా వృద్ధుల్లో అరోగ్యవంతులు అంతంతమాత్రమే కాబట్టి అలాంటి వారే బలయ్యే ప్రమాదం ఉందంది. -
డెంగీ నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగీ నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు రేపు ఉదయం హైకోర్టులో హాజరు కావాలంటూ ఆదేశించింది. డెంగీ వచ్చి మనుషులు చనిపోతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీపై ప్రజల్లో కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది. -
737 మాక్స్ విమానాలకు సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్
న్యూయార్క్: ప్రపంచదేశాలన్నీ 737 మాక్స్ విమానాల సర్వీసులను నిలిపివేస్తుండటంతో బోయింగ్ కంపెనీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ విమానాల్లో ఏర్పాటుచేసిన ఎంసీఏఎస్ స్టాల్ ప్రివెన్షన్ వ్యవస్థను పది రోజుల్లోగా అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించింది. ఈ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌కు కేవలం 2 గంటల సమయం చాలని బోయింగ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో స్టాల్ ప్రివెన్షన్ వ్యవస్థ విఫలం కావడంతో లయన్ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 మాక్స్8 విమానం కూలిపోయిందనీ, ఈ దుర్ఘటనలో 189 మంది చనిపోయారని వెల్లడించారు. ఒక్కో బోయింగ్ మాక్స్ విమానంలో సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌కు దాదాపు రూ.14 కోట్లు(2 మిలియన్ డాలర్లు) కోట్లు ఖర్చవుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 371 బోయింగ్ 737 మాక్స్ విమానాలు సేవలు అందిస్తున్నాయనీ, వీటి అప్‌గ్రేడ్‌కు బిలియన్ డాలర్లు(రూ.6,895 కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేశారు. -
ఏ కారణం వల్ల ఆ సమస్యతో పుడతారు?
నేను ప్రెగ్నెంట్. నా వయసు 27. మొన్న ఒకరోజు మా దూరపు బంధువుల ఇంటికి వెళ్లాను. ఆ ఇంట్లో ఆటిజం ఉన్న ఒక అమ్మాయిని చూశాను. చాలా బాధగా అనిపించింది. ఆమెని చూసినప్పటి నుంచి సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. నాకు పుట్టబోయే శిశువుకి ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందేమోనని చాలా భయంగా ఉంది. ఏ కారణాల వల్ల పిల్లలు ఆటిజం సమస్యతో పుడతారు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చా? – యన్.శాలిని, కాజీపేట ఆటిజం సమస్య ఉన్న పిల్లల్లో మానసిక ఎదుగుదలలో లోపాలు, వినికిడి లోపాలు, పనితీరులో లోపాలు, మాట్లాడటంలో లోపాలు తలెత్తుతాయి. అంతేకాకుండా వారిలో బుద్ధిమాంద్యం, మతిమరుపు వంటి అనేక లక్షణాలు ఉండవచ్చు. జన్యుపరమైన కారణాలు, తల్లి గర్భంతో ఉన్నప్పుడు, రుబెల్లా, టాక్సోప్లాస్మా వంటి వైరల్, బ్యాక్టీరియా, ప్రొటోజోవల్ ఇన్ఫెక్షన్లకు గురవ్వడం, తల్లిలో మానసిక ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, పొగతాగడం, మద్యం సేవించటం వంటి వాటి వల్ల, కొన్నిరకాల మందుల వల్ల ఎక్కువగా ఫిట్స్‌కు వాడే మందుల వల్ల, గర్భంలో ఉన్నప్పుడు శిశువు మెదడుకి సరిగా రక్తప్రసరణ లేకపోవడం వల్ల, ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల, కాన్పు సమయంలో ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల పిల్లల్లో ఆటిజం సమస్య రావచ్చు. ఈ సమస్య అసలు రాకుండా నివారించలేము. కాకపోతే గర్భం రాకముందే రుబెల్లీ పరీక్ష చేయించుకోవడం, అవసరమైతే రుబెల్లా వ్యాక్సిన్ తీసుకోవడం, గర్భం సమయంలో మితమైన పౌష్టికాహారం తీసుకోవటం, మానసిక ఒత్తిడిలేకుండా ఉండటం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, సౌకర్యాలు ఉన్న హాస్పిటల్లో నిపుణుల చేతిలో కాన్పుకావటం వంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆటిజం వచ్చే అవకాశం కొద్దిగా తగ్గుతుంది. వేరే వాళ్ల పిల్లలకి ఆటిజం ఉంటే మన పిల్లలకి రావాలని ఏం లేదు కదా. దానికోసం ఇప్పటి నుంచే బాధపడి మానసిక ఒత్తిడి పెంచుకోవద్దు. మనం ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తే అన్నీ పాజిటివ్‌గా జరుగుతాయి. అయ్యేవాటిని ఎవరూ ఆపలేము. తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతంగా ఉంటే నిద్ర బాగా పడుతుంది. నా వయసు 35. ఈ మధ్య నేను బాగా బరువు పెరిగాను. ఏదైనా పని చేయాలంటే ఇబ్బందిగా ఉంటోంది. వైద్యం గురించి తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు ‘ఆస్టియోపొరాసిస్ కావచ్చు. ఒకసారి చెక్ చేయించుకో’ అని చెప్పారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? నివారణ చర్యలు ఏమిటి? ఇప్పుడు నేను తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి దయచేసి చెప్పగలరు? – కె.తులసి, పాడేరు మీరు బరువు పెరగటం వల్ల, ఆయాసపడటం, పనులు చేసుకోవటానికి ఇబ్బందిపడటం వంటి సమస్యలను ఎదర్కొంటున్నారు. అంతేగానీ మీ సమస్యకు ఆస్టియోపొరాసిస్కు సంబంధం లేదు. మీరు బరువు తగ్గటానికి వాకింగ్‌తో పాటు చిన్న చిన్న వ్యాయామాలు, మితమైన డైటింగ్ వంటివి చెయ్యవచ్చు. ఎముకలలో సాంద్రత తగ్గటం, గుజ్జు తగ్గి ఎముకలు పెలుసుగా మారటాన్ని ఆస్టియోపొరాసిస్ అంటారు. సాధారణంగా ఎముకలలో పాత కణాలు పోయి, కొత్త కణాలు తయారు అవుతూ ఉండి, ఎముకలు పటిష్టంగా ఉంటాయి. శరీరంలో కాల్షియం తక్కువ ఉన్నప్పుడు వయసు పెరిగే కొద్ది.. మరిన్ని ఇతర కారణాల వల్ల ఎముకల గుజ్జు తొందరగా కరిగిపోయి, ఎముకలు బలహీనంగా మారి చిన్నగా కిందపడినా సరే ఎముకలు విరుగుతూ ఉంటాయి. దీనిని నివారించడానికి నడకతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు, యోగా వంటివి చేస్తూ ఎక్కువ బరువు పెరగకుండా చూసుకుంటూ ఉండాలి. ఇక ఆహారంలో క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు క్యాల్షియం, విటమిన్ డి, మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం మంచిది. అవసరాన్ని బట్టి ఎముకలలో గుజ్జు పెరగడానికి కూడా మందులు వాడుకోవచ్చు. నా వయసు 29. నేను rheumatoid arthritis(r.a) సమస్యతో బాధ పడుతున్నాను. ఈ సమస్య ఉన్నవాళ్లు గర్భం దాల్చవచ్చా? గర్భం దాలిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు.– జి.ప్రభ, కొత్తవలస rheumatoid arthritis (RA)అంటే కీళ్ల వ్యాధి అంటారు. ఇది జన్యుపరమైన సమస్యల వల్ల కొందరిలో రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచెయ్యక యాంటిబాడీస్ జాయింట్స్ (కీళ్ల)పైనే దాడి చేసి వాటిని దెబ్బతీస్తాయి. తద్వారా జాయింట్స్‌లో వాపులు, నొప్పులు, జ్వరం, అలసట, నడవడానికి ఇబ్బంది వంటి అనేక లక్షణాలు ఉంటాయి. వీళ్లకి చికిత్సలో భాగంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి, నొప్పులు, వాపులు తగ్గటానికి, జబ్బు ఇంకా పాకకుండా ఉండటానికి అనేక రకాల మందులు కాంబినేషన్లలో దీర్ఘకాలం వాడటం జరుగుతుంది. ఖఅ ఉన్నవాళ్లు గర్భందాల్చటంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. కొందరికి దీని వల్ల గర్భందాల్చటానికి ఇబ్బంది ఉండవచ్చు. గర్భం దాల్చిన తర్వాత 60శాతం మందిలో ఖఅ లక్షణాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గర్భం సమయంలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది కాబట్టి. 20 శాతం మందిలో లక్షణాలు యథావిధిగా ఉంటాయి. 20 శాతం మందిలో లక్షణాలు తీవ్రం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖఅకి వాడే చాలా మందుల వల్ల అబార్షన్, బిడ్డలో అవయవలోపాలు, బరువు తక్కువ పుట్టడం, నెలలు నిండకుండా కాన్పులు అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి గర్భందాల్చక ముందే డాక్టర్ని సంప్రదించి వారి సలహా మేరకు వాడే మందులను మార్చుకుని, లక్షణాలను బట్టి తక్కువ మోతాదులో తీసుకోవడం, అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మందులను వాడుకుంటూ గర్భం దాల్చిన తర్వాత డాక్టర్ పర్యవేక్షణలో అవసరమైన పరీక్షలు చెయ్యించుకుంటూ 9 నెలల పాటు చాలా వరకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. గర్భిణికి కూడా బరువు పెరిగే కొద్ది ఖఅ వల్ల ఒళ్లునొప్పులు, నీరసం, జాయింట్ (కీళ్లనొప్పులు) వంటి అనేక ఇబ్బందులు ఉండవచ్చు. కీళ్లవాపుల వల్ల సాధారణ కాన్పుకి ఇబ్బంది ఉండవచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుకుంటూ ఎక్కువ బరువు పెరగకుండా మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ మెల్లగా నడక, చిన్న చిన్న వ్యాయామాలు, ప్రాణాయామం, ధ్యానం వంటివి చెయ్యడం వల్ల శరీరం, కండరాలు, ఎముకలు, జాయింట్స్ ఇంకా ఎక్కువ బిగిసిపోకుండా ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్నగర్హైదరాబాద్ -
కేన్సర్‌పై వైద్యులకు సరికొత్త కోర్సు
న్యూఢిల్లీ: కేన్సర్లను వైద్యులు ముందుగానే గుర్తించి, నివారణ చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆన్లైన్లో అంకాలజీ ట్యుటోరియల్ సిరీస్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రారంభించింది. టాటా మెమొరియల్ సెంటర్ రూపొందించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల సహకారంతో దేశవ్యాప్తంగా అమలుచేయనున్నారు. ఈ ఆన్లైన్ కోర్సులోని వీడియోలు https://www.omnicuris.com/ academics/ advanced& clinical& oncology వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. -
బోరుమంటున్నాయి..!
► నగరంలోని బోర్ల నిండా బురద నీళ్లే ► కానరాని నీటి ఎద్దడి నివారణ చర్యలు ► పట్టించుకోని అధికారులు, పాలకులు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నగరంలో బోర్లు బోరుమంటున్నాయి. ఓ వైపు అధికారులు ప్రగతి మంత్రం జపిస్తున్నా తాగునీటి వనరులు మాత్రం వేసవిలో నగర జీవిని వెక్కిరిస్తూనే ఉ న్నాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కరపత్రాలు మొదలుకుని చేతి పంపుల వరకు అన్నింటిపైనా పసుపు రం గు పూస్తున్నారు. ప్రచారంలో ఇంత శ్రద్ధ చూపిస్తున్న పాలకులు అవే బోర్లు పాడైపోతే మాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలో చాలా చోట్ల బోర్ల నుంచి బుదర నీరే వస్తోంది. ఒక్క బక్కెట్టు నీరు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి. రెల్లవీధి, దంగల వీధి, బల గ, ఆదివారం పేట, గుజరాతీపేటలతో పాటు పలు కాలనీల్లోని బోర్లు ఇలాంటి నీరే ఇస్తున్నాయి. గణాంకాల కోసం నగరంలో ఇన్ని బోర్లు వేశామ ని అధికార పక్ష నేతలు చెప్పుకుంటున్నా, అవి ప్రజలకు ఉపయోగపడడం లేదు. వేసవి కాలం రావడంతో ఎప్పటికప్పుడు కరెంటు కోతలు, మున్సిపల్ కుళాయిలు సరిగా రాకపోవడంతో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ ఆపత్కాలంలో బోర్లే దిక్కుగా మారుతున్నాయి. అయితే బోర్లు కూడా బురద నీరే ఇ స్తుండడంతో ఇక తామేం చేయాలని స్థానికులు ప్ర శ్నిస్తున్నారు. ఈ కాలనీలో నివసించేవారంతా నిరుపేదలు. సొంత మోటార్లు, బావులు లేని వారు. వీరికి నగర పాలక సంస్థ కుళాయి నీరే ఆధారం. వాడుక నీటి కోసం బోర్లపై ఆధారపడతారు. 2016లో తీసిన బోర్ల నుంచి కూడా బురద నీరే వస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. చేతి పంపు నుంచి బురద నీరు వస్తోంది. ఈ విషయాన్ని నాయకులు, అధికారులకు చాలాసా ర్లు చెప్పాం. అయినా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు చొరవ చూపి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది. ---కొర్లాపు వేణు, దంగళవీధి, శ్రీకాకుళం. ఈ మధ్యకాలంలో కుళాయిల నీరు రాకపోతే స్నానాలు, తాగునీటికి తీవ్రంగా ఇబ్బంది ప డ్డాం. కనీసం మా ప్రాంతంలో బావులు కూడా లేవు. చేతిపంపు నీళ్లే ఆధారమయ్యాయి.--- పి.సంతోష్, దంగళవీధి, శ్రీకాకుళం నీళ్లు బురదగా వస్తుండడంతో బకెట్లలో వాటిని నిల్వ చేసుకుని బురదంతా కిందకు దిగాక వడబోసుకుని వాడుతున్నాం. ఇలా ఎంత కాలం వడపోసుకుని వాడుకోగలం. నగరంలో ఉన్నా ఏంటి ఈ దుస్థితి. అధికారులు చొరవ చూపి సమస్య పరిష్కరించాలి. --- ఎం.ఆదినారాయణ, రెల్లవీధి, శ్రీకాకుళం మా దృష్టికి రాలేదు చేతి పంపుల నుంచి బురద నీళ్లు వస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎక్కడెక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నాయో ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే మా ఇంజినీర్లను పంపించి అక్కడ సమస్యను తెలుసుకుంటాం.తక్షణమే పరిష్కారానికి చర్యలు చేపడతాం. ---పి.ఎ శోభ, నగరపాలక కమిషనర్, శ్రీకాకుళం -
టోల్‌ప్లాజా వద్ద భద్రత చర్యలకు శ్రీకారం
మేడ్చల్: మండల పరిధిలోని సుతారిగూడ టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందడంతో హెచ్ఎండీఏ అధికారులు నివారణ చర్యలకు ఉపక్రమించారు. టోల్‌ప్లాజా ఉన్నట్లు దూరం నుంచే రాత్రి సమయంలో తెలిసేవిధంగా రోడ్డుపై రేడియం లైట్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. 100 మీటర్ల ముందు నుంచి వేగాన్ని నిరోధించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేందుకు గురువారం హెచ్ఎండీఏ సిబ్బంది కొలతలు తీసుకొని పనులు ప్రారంభించారు. మంగళవారం జరిగిన ప్రమాదానికి రింగురోడ్డుపై దారిమళ్లింపు, టోల్‌ప్లాజా ఉన్నట్లు సూచిక బోర్డులు లేకపోవడం, వేగ నిరోధకాలు లేకపోవడమే కారణమని తెలిసిందే. దీంతో హెచ్ఎండీఏ అధికారులు ఇకపై ప్రమాదాలు చోటుచేసుకోకుండా నివారణ చర్యలు చేపట్టింది. -
నగరంలోని డేంజర్ స్పాట్స్
♦ సిటీలో 46 ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు ♦ రెండేళ్ళ గణాంకాల బేరీజుతో నిర్ధారణ ♦ 18 ట్రాఫిక్ ఠాణాల పరిధిలోనే ఇవన్నీ ♦ నివారణ చర్యలు ప్రారంభించిన ట్రాఫిక్ కాప్స్ సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చిన్నారి రమ్యతో పాటు ఆమె కుటుంబంలో మరో ఇద్దరు ప్రాణాలు తీసిన ప్రాంతం బ్లాక్ స్పాటే. ఆ ప్రాంతంలో పది రోజుల వ్యవధిలో దీంతో పాటు మరో రెండు యాక్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. అయితే వాటిలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు బ్లాక్‌స్పాట్స్‌పై దృష్టి పెట్టారు. తరచు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నగరంలోని 25 ట్రాఫిక్ ఠాణాల పరిధిలో నిర్వహించిన స్టడీలో 46 నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతున్న బ్లాక్‌స్పాట్స్(డేంజర్ స్పాట్స్) ఉన్నట్లు గుర్తించారు. రెండేళ్ళ గణాంకాలతో స్టడీ... సిటీలో బ్లాక్‌స్పాట్స్‌గా పరిగణించే ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు శాంతిభద్రతల విభాగం అధికారుల సహాయం తీసుకున్నారు. గడిచిన రెండేళ్ళ వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల జాబితాలను సేకరించి అధ్యయనం చేశారు. ఒకే ప్రాంతం, స్టెచ్లో రెండు కంటే ఎక్కువ యాక్సిడెంట్స్ చోటు చేసుకున్న ప్రాంతాలను గుర్తించారు. వీటిలో యాదృచ్ఛికంగా జరిగిన వాటిని మినహాయించారు. ఇంజినీరింగ్ సహా ఇతర లోపాల వల్ల చోటు చేసుకున్న ప్రమాదాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆయా ప్రాంతాలను గుర్తించారు. 18 ఠాణాల పరిధిలో ‘జోన్స్’... నగర ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 25 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటిలో కేవలం ఏడింటి పరిధిలో మాత్రమే బ్లాక్‌స్పాట్స్ లేవని తేలింది. మిగిలిన 18 ట్రాఫిక్ ఠాణాల పరిధిలోనూ తరచుగా ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటిలోనూ మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో నాలుగేసి, పదింటి పరిధిలో మూడేసి చొప్పున యాక్సిడెంట్స్ స్పాట్స్ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్లో (ఐఆర్ఆర్) విస్తరించిన ఉన్న ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు పరిధుల్లోనే బ్లాక్‌స్పాట్స్ ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడానికి కారణాలనూ స్థానిక అధికారుల సాయంతో అధ్యయనం చేశారు. అంతా కలిసి పని చేయాలని: ‘రోడ్డు భద్రత కోణంలో హైదరాబాద్‌ను సేఫ్ సిటీగా మార్చడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం కేవలం ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం అధికారులే కాకుండా మిగిలిన విభాగాలతోనూ కలిసి పని చేయాలని నిర్ణయించాం. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడానికే బ్లాక్స్పాట్స్తో పాటు కారణాలను అధ్యయనం చేశాం. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల బాధ్యతగా చిన్న చిన్న మార్పులు చేపట్టడంతో పాటు విధుల్లో ఉండే సిబ్బంది సంఖ్యను పెంచుతున్నాం. ఇంజినీరింగ్ సహా ఇతర లోపాలను గుర్తించిన చోట్ల వాటిని సరిచేయాలని కోరుతూ ఆయా విభాగాలకు నివేదికలు అందిస్తున్నాం. ఉన్నతాధికారులతో జరిగే ఉమ్మడి సమావేశాల్లో సిఫార్సుల అమలు స్థితిగతుల్ని పరిశీలించే ఏర్పాట్లు జరిగాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, అవసరమైన అనుమతులు లేకుండా తవ్వకాలు, మరమ్మతులు చేపట్టవద్దని ఇప్పటికే స్పష్టం చేశాం’ – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
హైకోర్టు మొట్టికాయలతో వీడిన మొద్దునిద్ర
రైతుల ఆత్మహత్యల నివారణకు ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు జిల్లా స్థాయిలో ప్రత్యక సెల్ ఫిర్యాదుల విభాగం నెం. 8886613778 జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో విభాగాలు ఏడీ, డీఎస్పీ, ఆర్డీవోలతో త్రిసభ్య కమిటీ రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ హైకోర్టు గట్టిగా మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వంలో కదిలిక వచ్చింది. ఎట్టకేలకు నివారణ చర్యలు చేపట్టింది. రైతుల్లో మనోస్థైరాన్ని నింపేలా ప్రత్యేక విభాగాన్ని, కమిటీలను ఏర్పాటుచేసింది. విశాఖపట్నం: వరుసగా గత ఐదేళ్లుగా విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులు... ఏయేటికాయేడు చేతికందివచ్చిన పంటలు నేలపాలవుతూ అప్పుల సుడిగుండంలో అన్నదాతలు విలవిల్లాడి పోతున్నారు. గడిచిన ఏడాదిన్నరలో రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇన్నాళ్లు పట్టించుకోవడం మానేసింది. దీనిపై కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయడంతో ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు స్పందించింది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను అనేక సూచనలు చేయడంతో ఆ దిశగా ప్రభుత్వం ఉపశమన చర్యలకు శ్రీకారంచుట్టింది. ఇందుకోసం జిల్లా, డివిజన్ స్థాయిలో బుధవారం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయిలో వ్యవసాయ శాఖ డిప్యూటీ డెరైక్టర్ రాజుబాబు నేతృత్వంలో ఈ సెల్ పనిచేస్తుంది. ఈ విభాగానికి 88866 13778 నెంబర్‌తో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. జిల్లాలో పదివ్యవసాయ సబ్ డివిజన్లు ఉండగా. ప్రతీ సబ్ డివిజన్ పరిధిలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీలు పర్యవేక్షిస్తుంటాయి. వీఆర్వోలు, వ్యవసాయాధికారులు గ్రామస్థాయిలో రైతుల ఆర్ధిక స్థితి గతులు.. మానసిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. ఎవరైనా స్థైర్యం కోల్పోయే స్థితిలో ఉంటే వెంటనే ఈసెల్‌కు సమాచారం ఇస్తే ప్రత్యేక కౌన్సెలర్ ద్వారా ఈ విభాగం నేరుగా ఆ గ్రామానికి వెళ్లి సంబంధిత రైతు కుటుంబంతో భేటీ అయి వారిలో మనోస్థైర్యం నింపేందుకు యత్నిస్తారు. అవసరమైతే నిపుణులతో వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. వారికి ఏవిధమైన సమస్యలున్నాయి.. వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆ రైతు బయట పడతాడు వంటి అంశాలపై అధ్యయనం చేసి సబ్‌డివిజన్ స్థాయిలో కమిటీ జిల్లాకు నివేదిస్తుంది. దాన్ని ప్రభుత్వానికి పంపి ఆ రైతుకు సాంత్వన చేకూర్చేలా చర్యలు చేపడతారు. ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే ఎందుకు ఆ అఘాయిత్యానికి ఒడిగట్టాల్సి వచ్చిందో పరిశీలనచేసేందుకు ఏడీ, డీఎస్పీ, ఆర్డీవోల నేతృత్వంలో త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశారు. వీరిచ్చే నివేదికను జిల్లా స్థాయిలో కలెక్టర్, వ్యవసాయ శాఖ జేడీ, ఎస్పీల నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సుచేస్తుంది. తదనుగుణంగా ఆ రైతు కుటుంబానికి అందాల్సిన ఆర్థిక సహకారాన్ని అందజేస్తారు. ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చు మీ గ్రామంలో ఏ రైతైనా.. వ్యవసాయ పరంగానే కాకుండా వివిధ కారణాలతో మనో స్థైర్యం వీడినట్టుగా గుర్తిస్తే వెంటనే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన విభాగానికి ఫోన్ చేస్తే వెంటనే ప్రత్యేక బృందాన్ని ఆ గ్రామానికి పంపిస్తాం.. ఆ రైతుకు కౌన్సెలింగ్ చేస్తాం.. ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడతాం. - వి.సత్యనారాయణ, జాయింట్ డెరైక్టర్, వ్యవసాయశాఖ -
బాబోయ్.. డెంగీ!
నివారణ చర్యలు శూన్యం ఆస్పత్రికెళితే జేబుకు చిల్లే బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్స్ పేరుతో దోపిడీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం విజయవాడ : మహాత్మాగాంధీ రోడ్డులోని పీఅండ్‌టీ కాలనీకి చెందిన నారాయణమ్మకు జ్వరం వచ్చింది. తొలుత స్థానికంగా ఉన్న ఒక వైద్యునికి చూపించగా, వైరల్ జ్వరమని మందులిచ్చారు. రెండు రోజులకు పరిస్థితి విషమించగా ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నిర్ధారణ పరీక్షలు చేసి డెంగీగా గుర్తించారు. అప్పటికే ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేక పోయారు. గత నెల మూడున మృతిచెందింది. ఇదే కాలనీలో పది మంది వరకు డెంగీ బారిన పడ్డారు. శ్రీనగర్ కాలనీకి చెందిన చావా అనిల్‌కుమార్ (23) ఈ నెల 6న డెంగీతో మృత్యువాత పడ్డాడు. అతని కుటుంబం వీధిన పడింది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతి చెందటంతో కుటుంబానికి దిక్కులేకుండా పోయింది. మురుగు, దుర్గంధంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని బీఎస్ఎన్ఎల్ అధికారులు, నగర పాలక సంస్థ వారిని వేడుకున్నా స్పందించకపోవడంతో నగరంలోని మధురానగర్, సింగ్‌నగర్, రామవరప్పాడు ప్రాంతాల్లో నిండు ప్రాణాలు బలయ్యాయి. డెంగీ మరింత వ్యాప్తి చెందుతోంది. జిల్లాలో వెయ్యి వరకు కేసులు జిల్లాలో ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా డెంగీ బారిన పడ్డారు. డెంగీ అనుమానిత జ్వరంతో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో 983 మంది ప్రభుత్వాస్పత్రుల్లో చేరగా, వారికి ఎలీసా టెస్ట్ నిర్వహించి 160 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. వారిలో 28 మంది విజయవాడకు చెందిన వారే కావటం గమనార్హం. ప్రైవేటు ఆస్పత్రిలో ఇంతకు మూడు రెట్ల మంది చికిత్స పొందారు. ఆ లెక్కన డెంగీ బాధితుల సంఖ్య వెయ్యికి పైగానే ఉంటుందని చెపుతున్నారు. జిల్లాలో నాగాయలంక, చల్లపల్లి, తోట్లవల్లూరు. పెడన ప్రాంతాల నుంచి అత్యధికంగా డెంగీ బాధితులు నగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు చెపుతున్నారు. ప్రభుత్వ చర్యలు శూన్యం జిల్లాలో డెంగీ జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. సమీక్షలు జరపడం మినహా క్షేత్ర స్థాయిలో చేపట్టిన చర్యలు లేవనే చెప్పాలి. అందుకు చల్లపల్లి, కోడూరు, నాగాయలంక, తోట్లవల్లూరు ప్రాంతాల్లో ఇంకా జ్వరం కేసులు నమోదవడమే నిదర్శనం. కనీసం డెంగీ నిర్ధారణ కిట్లు సైతం ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి శాంపిల్స్ తీసుకు రావాల్సిన దుస్థితి నెలకొంది. ప్లేట్లెట్స్ దొరకని వైనం... జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల బ్లడ్ బ్యాంకుల్లో కాంపోనెంట్స్‌కు అనుమతులు లేకపోవడంతో ప్లేట్లెట్స్ కోసం ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. డెంగీ జ్వరం తీవ్రత ఉన్న సమయంలో ప్లేట్లెట్స్ కౌంట్ 30 వేల కన్నా తగ్గితే కృత్రిమంగా ఎక్కించాల్సి ఉంటుంది. అందుకు ఒక్కో బ్యాగ్‌కు బ్లడ్ బ్యాంకుల్లో రూ.1200 నుంచి 1500 వరకు డబ్బు గుంజుతున్నారు. సింగిల్ డోనర్ నుంచి ప్లేట్లెట్స్ వేరు చేస్తే రూ.12 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో రోగికి ఇద్దరి నుంచి ప్లేట్లెట్స్ ఎక్కిస్తే రూ.30 వేల వరకూ ఖర్చవుతుంది. పదివేల కన్నా ప్లేట్లెట్స్ తక్కువగా ఉండి, రక్తస్రావం అయ్యే పరిస్థితులు తలెత్తినప్పుడు త్వరగా కోలుకునేందుకు సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్‌ను ఎక్కిస్తుంటారు. అనుమతి పొందిన బ్లడ్‌బ్యాంకుల వారు మాత్రమే ఈ పద్ధతిలో ప్లేట్లెట్స్ వేరు చేయాల్సి ఉంది. ఆస్పత్రికెళితే జేబుకు చిల్లే... జ్వరం వచ్చి ఆస్పత్రిలో చేరితే వేలాది రూపాయలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అన్ని వ్యాధుల కంటే ఇప్పుడు జ్వరమే ప్రమాదకరంగా మారింది. జ్వరంతో ఆస్పత్రిలో చేరితే రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేసిన వారు ఉన్నారు. డెంగీగా నిర్ధారించినవారికి వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో ఐసీయూ సౌకర్యం లేక పోవడంతో రోగులు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. -
'కరువు నివారణ చర్యలు చేపట్టండి'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ కరువు నివారణకు ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక ఏదీ లేదని, తక్షణం రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించాలని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని కోరారు. గ త ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వానికి కరువు నివేదిక పంపలేదని, ఈ ఏడాదీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కరువును పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, కేవలం 14నెలల కాలంలో ఏకంగా 1150 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆ లేఖలో ప్రస్తావించారు. దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే మొదటి స్థానం వచ్చిన ఆశ్చర్యం లేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కరువు నివారణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, అవసరమైన కార్యాచరణను వెంటనే రూపొందించాలని కోరారు. -
బాధకాలు
ఫైలేరియా నివారణపై చర్యలు శూన్యం డిప్యూటేషన్ సిబ్బందితో కార్యకలాపాలు బాధితుల గోడు పట్టని అధికార యంత్రాంగం జిల్లాలో 7 వేలకు పైగా పైలేరియూ బాధితులు బోదకాలు బాధ పెడుతున్నారుు.. నడువరాదు.. కింద కూరోరాదు.. పని చేసుకోరాదు.. మంచానికి పరిమితం కావాల్సిందే.. ఇదీ ఓ మహమ్మారి వంటిది.. దీనిని నిర్మూలించడం సాధ్యం కాదు.. అవగాహన ఒక్కటే మార్గం.. ఇది క్యూలెక్స్ దోమకాటు వల్ల వస్తుంది.. జిల్లాలో ఇప్పటికే 7వేలకు పైగా కేసులు నమోదయ్యూరుు.. డిప్యూటీ సీఎం జిల్లాకు చెందిన వారే అరుునా.. మొన్నటివరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాష్ట్ర స్థాయి అధికారిగా ఉన్నా దీనిపై దృష్టి పెట్టలేదు.. ఇప్పటికైనా దృష్టిసారించి నివారణ చర్యలు చేపట్టాలి.. జిల్లావ్యాప్తంగా బోధకాలు బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. సుమారు 7 వేల పైచిలుకు మంది ఫైలేరియా బాధితులు జిల్లాలో ఉన్నట్లు సీనియర్ ఎంటమాలజిస్టు రమణమూర్తి తెలిపారు. వ్యాధి నివారణకు మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎండీఏ) ద్వారా క్యాంపులు నిర్వహించాల్సి ఉంది. డీఈసీ(డైఈథైల్ కార్బోమిజైన్ సిట్రెట్) మందులు ముందస్తుగా వాడితే వ్యాధి వ్యాప్తిని నిరోధించవ చ్చు. వీటిని 2-70 ఏళ్లలోపు వారు, గర్భిణులు, తీవ్ర అస్వస్థత ఉన్నవారు ఉపయోగించొద్దు. 4- 5 ఏళ్లలోపు వారు ఒక్క మాత్ర, 6-14 ఏళ్ల లోపు రెండు మాత్రలు, 16 ఏళ్ల వయస్సు పైబడిన వారు మూడు మాత్రలు వాడాలి. అరుుతే పెద్దసంఖ్యలో బాధితులున్నా ఎండీఏకు జిల్లా ఎంపిక కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఫలితంగా ఫైలేరియూ నివారణకు ప్రభుత్వం నుంచి జరగాల్సిన కృషి జిల్లాలో జరగడం లేదు. ఫైలేరియూ(బోధకాలు).. ఇదో మహమ్మారి వ్యాధి. కాలికి బండ కట్టుకుని నడుస్తున్న బాధ. జ్వరం వస్తే ముద్ద ముదిరితే నిర్మూలన కష్టం. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. వేల సంఖ్యలో బోధకాలు బాధితులు ఉండడం దీన్ని రూఢీ చేస్తోంది. ఎండీఏ కార్యక్రమం ద్వారా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. చికిత్స విధానం ఇలా.. బాధితుల వయస్సును బట్టి 12 రోజులు ఆరోగ్య కార్యకర్తలు డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలిస్తారు. ప్రాథమిక దశలోనే వేసుకోవాలి. వాపు పెరిగాక ఫలితం ఉండదు. వాచిన భాగాలను నీటితో శుభ్రం చేసి పొడి బట్టతో తుడిచి యాంటిబయూటిక్ ఆరుుంట్మెంట్ రాయూలి. కాళ్ల సంబంధిత వ్యాయూమం చేయూలి. జ్వరంతో ఉన్న వ్యాధిగ్రస్తులు వ్యాయూమం చేయొద్దు. గుండె జబ్బులుంటే డాక్టర్‌ను సంప్రదించి వ్యాయూమం చేయూలి. వ్యాధి వ్యాప్తి ఇలా.. మురుగు కాల్వల్లో పెరిగే ఆడ క్యూలెక్స్ దోమ కాటుతో ఫైలేరియా వస్తుంది. రెండున్నరేళ్లలో ఎప్పుడైనా వ్యాధి లక్షణాలు బహిర్గతం కావొచ్చు. శరీరంపై వాపు వస్తే వైద్యులను సంప్రదించాలి. డిప్యూటేషన్ సిబ్బందితో నిర్వహణ ఫైలేరియా క్యాంపుల నిర్వహణ కోసం 13 మందికిగాను ముగ్గురినే నియమించారు. ఈ విభాగం డ్రైవర్‌ను డీహెచ్ సాంబశివరావు తీసుకెళ్లారు. చెన్నారావుపేటకు చెందిన సిబ్బందితోపాటు ఇద్దరు ‘104’ ల్యాబ్ టెక్నీషియన్లు రె ండేళ్లుగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. అలాగే వొడితెల, ఆత్మకూరు, పర్వతగిరి, వెంకటాపూర్‌కు చెందిన హెల్త్సూపర్వైజర్లు రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. వరంగల్‌లో ఏప్రిల్ 2011లో ఫైలేరియా విభాగం కార్యక్రమాలు మొదలయ్యాయి. 2014, డిసెంబర్ 2 -5 వరకు దంతాలపల్లి, ఐనవోలు, కొడకండ్ల గ్రామాల్లో నిర్వహించిన క్యాంపుల్లో 58 పాజిటివ్ కేసులు నమోదయ్యూరుు. నరకం అనుభవిస్తున్నా.. ఇరవై ఏళ్ల నుంచి బోదకాలుతో నరకం అనుభవిస్తున్నా. నెల రోజులకోసారి జ్వరం వస్తే అన్నం తినకుండా ఐదు రోజుల పాటు మంచంలోనే ఉంటా. ప్రభుత్వ వైద్యులు ఎలాంటి వైద్యం అందించడం లేదు. ప్రైవేటు వైద్యులను ఆశ్రయించి జ్వరం వచ్చినప్పుడు మందులు వేసుకుంటా. ప్రభుత్వం మంచి చికిత్స అందించి మా బాధలు తీర్చాలి. - జక్కుల రాములు