టోల్‌ప్లాజా వద్ద భద్రత చర్యలకు శ్రీకారం | Safe actions starts at Toll Plaza | Sakshi
Sakshi News home page

టోల్‌ప్లాజా వద్ద భద్రత చర్యలకు శ్రీకారం

Published Thu, Sep 1 2016 11:16 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

టోల్‌ప్లాజా వద్ద భద్రత చర్యలకు శ్రీకారం - Sakshi

టోల్‌ప్లాజా వద్ద భద్రత చర్యలకు శ్రీకారం

మేడ్చల్‌: మండల పరిధిలోని సుతారిగూడ టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందడంతో హెచ్‌ఎండీఏ అధికారులు నివారణ చర్యలకు ఉపక్రమించారు. టోల్‌ప్లాజా ఉన్నట్లు దూరం నుంచే రాత్రి సమయంలో తెలిసేవిధంగా రోడ్డుపై రేడియం లైట్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. 100 మీటర్ల ముందు నుంచి వేగాన్ని నిరోధించేందుకు స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేసేందుకు గురువారం హెచ్‌ఎండీఏ సిబ్బంది కొలతలు తీసుకొని పనులు ప్రారంభించారు. మంగళవారం జరిగిన ప్రమాదానికి రింగురోడ్డుపై దారిమళ్లింపు, టోల్‌ప్లాజా ఉన్నట్లు సూచిక బోర్డులు లేకపోవడం, వేగ నిరోధకాలు లేకపోవడమే కారణమని తెలిసిం‍దే. దీంతో హెచ్‌ఎండీఏ అధికారులు ఇకపై ప్రమాదాలు చోటుచేసుకోకుండా నివారణ చర్యలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement