dengue fever
-
జ్వర భద్రం
డెంగీ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇంతకుముందులా కాకుండా ‘మిక్స్డ్ ఇన్ఫెక్షన్ల’తో జనాల ఆరోగ్యాన్ని నిలువునా పీలి్చపిప్పిచేస్తోంది. రెండు, మూడు రకాల వైరస్లు సోకుతుండటం ప్రమాదకరంగా మారుతోంది. జ్వరంతోపాటు తీవ్ర నీరసం, ఒళ్లంతా నొప్పులతో.. కనీసం బెడ్‌పై నుంచి లేచి నడవలేనంతగా బాధపెడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే తగిన వైద్యం అందక.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ‘నిలువు దోపిడీ’ సమరి్పంచుకోలేక.. శారీరకంగానే కాదు, మానసికంగానూ జనం అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. విషజ్వరాలతో పరిస్థితి దారుణంగా మారుతున్నా, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కళ్లముందే కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం జ్వరాలతో మంచాన పడింది. డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జనం విష జ్వరాలతో అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులు చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. పెరుగుతున్న డెంగీ తీవ్రత రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జ్వర సర్వే జరుగుతోంది. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 6,051 డెంగీ కేసులు, 164 చికున్‌గున్యా కేసులు, 197 మలేరియా కేసులు నమోదయ్యాయి. కానీ లెక్కలోకి రాని కేసులు భారీ స్థాయిలో ఉన్నాయనే అంచనా. ముఖ్యంగా డెంగీ దడ పుట్టిస్తోంది. జూలై, ఆగస్టు రెండు నెలల్లోనే ఏకంగా 3,317 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లో అత్యధికంగా 1,267 కేసులు, నల్లగొండ జిల్లాలో 276 కేసులు, ఖమ్మం జిల్లాలో 181 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ విష జ్వరాల కేసులు పెరిగినా.. అధికారికంగా నమోదవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు లేకపోవడం, టెస్టింగ్ కిట్ల కొరత ఇబ్బందికరంగా మారింది. రూ.50 వేల నుంచి రూ.2 లక్షలదాకా వసూళ్లు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే వేలకు వేలు వసూలు చేస్తున్నాయని డెంగీ, ఇతర విష జ్వరాల బాధితులు వాపోతున్నా రు. ముఖ్యంగా డెంగీ వచ్చి ఆస్పత్రిలో చేరితే చాలు.. పరిస్థితిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు చికిత్సల కోసం వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కదిక్కడంలో వైద్యశాఖ యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. డెంగీ, ఇతర విష జ్వరాల నియంత్రణ, బాధితులకు చికిత్స అందించడంపై దృష్టిపెట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేస్తూ, పరిస్థితిని చక్కదిద్దడంపై ఫోకస్ చేస్తున్నా.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి రికార్డు స్థాయిలో రోగులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి రాష్ట్రంలోనే అత్యధికంగా 2,680 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. హైదరాబాద్‌లోని ఉస్మానియాకు 2,566 మంది, గాం«దీకి 2,192 మంది, వరంగల్ ఎంజీఎంకు 2,385 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. ఓపీ నమోదైంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది.ప్లేట్లెట్స్ టెస్టు కోసం బయటికి.. నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తోంది. ఆస్పత్రిలో మూడు రోజులుగా వైద్యం తీసుకుంటున్నా. నా భర్తకు కూడా జ్వరమే. ఆస్పత్రిలో ప్లేట్లెట్ టెస్ట్ చేసే సదుపాయం లేదని టెస్టుల కోసం బయటికి పంపించారు. – కె.లక్ష్మీతిరుపతమ్మ, సత్తుపల్లి మందులు సరిగా ఇవ్వడం లేదు నేను నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే.. వైద్యులు పారాసెటమాల్ 650 ఎంజీ మాత్రలు రాశారు. కానీ సిబ్బంది 500 ఎంజీ మాత్రలు, అదీ రెండు రోజులకు సరిపడానే ఇచ్చారు. 650 ఎంజీ మాత్రలు బయట కొనుక్కోవాలని చెప్పారు. – మశమ్మ, నాగర్కర్నూల్మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతో తీవ్ర ప్రభావంసీరో టైప్–1, 2 డెంగీ వేరియంట్లతో ఆరోగ్యం సీరియస్.. కోవిడ్ వచ్చి తగ్గినవారిలో నీరసం మరింత ఎక్కువఅడిషనల్ డీఎంఈ రాజారావు వెల్లడి ‘‘ఏ వైరల్ జ్వరం అయినా వీక్నెస్ ఉంటుంది. కోవిడ్ వచి్చపోయిన వారిలో నీరసం మరింత ఎక్కువగా ఉంటోంది. వైరల్ జ్వరం వచ్చిన వారు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. లేకుంటే సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. డెంగీలో సీరో టైప్–2 అనేది మన వద్ద ఎక్కువగా వ్యాపిస్తోంది. మిగతా డెంగీ వేరియంట్ల కంటే దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదే మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తీవ్రత మరింత పెరుగుతుంది. ఎవరికైనా సీరో టైప్–1 డెంగీ ఒకసారి వచి్చ, రెండోసారి సీరో టైప్–2 వస్తే.. మొదటిదాని యాంటీబాడీస్, రెండో టైప్ ఇన్ఫెక్షన్ క్రాస్ రియాక్షన్ వల్ల ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్ అవుతుంది. ఇక డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం కంటే.. ప్లాస్మా లీకేజీ చాలా ప్రమాదకరం. రక్తంలోని నీరు రక్తనాళాల నుంచి లీక్ అవడమే ప్లాస్మా లీకేజీ. దీనివల్ల పల్స్, బీపీ పడిపోవడం, తర్వాత తీవ్ర కడుపునొప్పి, వాంతులు రావడం, చెమటలు పట్టడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, అవయవాలు విఫలమయ్యే కూడా వెళ్తుంది. అయితే వంద మందికి డెంగీ వస్తే.. అందులో ఐదుగురికి మాత్రమే ప్లాస్మా లీకేజీ వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం సాధారణ లక్షణమే. చాలా మందిలో వాటంతట అవే పెరుగుతాయి. ఒకవేళ రక్తస్రావం జరుగుతున్నా, 20 వేలకన్నా తక్కువకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయినా.. ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. ప్లేట్లెట్ టెస్టులను పెథాలజిస్ట్ చూసి నిర్ధారించాలి. మిషన్‌లో లెక్కిస్తే.. ఉన్నదానికంటే తక్కువగా చూపించే చాన్స్ ఉంటుంది. – ప్రొఫెసర్ ఎం.రాజారావు, అడిషనల్ డీఎంఈఏ ఆస్పత్రిలో చూసినా అవే సమస్యలు.. ⇒ మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు పీహెచ్సీలలో మందుల కొరత ఉంది. అన్ని రకాల యాంటీ బయాటిక్స్ అందుబాటులో లేవు. జలుబు సిరప్, కంటి చుక్కల మందులు, క్లేవమ్ వంటి మందులు కూడా లేవు. ఇంజక్షన్లు అందుబాటులో లేవు. వైద్యులు ఐదారు రకాల మందులు రాస్తే వాటిలో రెండు, మూడు రకాలు మాత్రమే ఉంటున్నాయి. మిగతావి బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ⇒ నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో జ్వరం, ఇతర జబ్బులకు కేవలం రెండు రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. ⇒నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉంది. వారం రోజులకు మందులు రాస్తే.. మూడు రోజుల మందులే ఇస్తున్నారు. కొన్ని రకాల మందులు లేకపోవడంతో బయట కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ⇒బోధన్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరగడంతో వరండాలో బెడ్స్ వేసి వైద్యం అందిస్తున్నారు.డెంగీతో ఇద్దరి మృతిపాపన్నపేట(మెదక్)/సిద్దిపేట అర్బన్: వేర్వేరు జిల్లాల్లో డెంగీతో బాధపడుతూ ఇద్దరు మృతి చెందారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చీకోడ్‌కు చెందిన వడ్ల రాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు హర్షిత్చారి (11)కి వారం రోజుల క్రితం డెంగీ సోక గా.. కుటుంబ సభ్యులు మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చేర్పించారు. అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ డబ్బులు కట్టలేక, నిలోఫర్‌కు తరలించగా.. హర్షిత్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లికి చెందిన సుతారి కనకలక్ష్మి జ్వరంతో బాధ పడుతుండటంతో సిద్దిపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినా తగ్గకపోవడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడా నయం కాకపోవడంతో నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.ప్రైవేట్ ఆస్పత్రులపై ఉక్కుపాదం మోపుతాం ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహఅడ్డగోలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు బాధితులు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఆఫీసు కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయొచ్చు ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహసాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచి్చందని.. అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఈ అంశంపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు టాస్‌్కఫోర్స్ పనిచేస్తోందని.. ఇప్పటికే చాలా ప్రైవేట్ ఆస్పత్రులను పరిశీలించిందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై శనివారం సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. డెంగీని గుర్తించేప్పుడు టెస్టు రిపోర్టులు సరిగా ఉంటున్నాయా లేదా పరిశీలిస్తామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో చర్యలు ప్రారంభం అవుతాయన్నారు. ఆస్పత్రులు డెంగీ పరీక్షలు చేసిన, నిర్ధారణ అయిన వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయండి: ప్రైవేట్ ఆస్పత్రులు అవసరం ఉన్నా, లేకున్నా టెస్టులు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ఈ పరిస్థితిని నియంత్రించాలంటే క్లినికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో కంట్రోల్ రూం నడుస్తోందని.. విషజ్వరాల బాధితులు తమ సమస్యలపై దానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ‘‘సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులంతా ఆస్పత్రుల పర్యటనకు వెళ్లాలని ఆదేశించాం. జిల్లాలో కలెక్టర్, వైద్యాధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి.. పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించాం. మందుల కొరత ఉండకూడదని చెప్పాం..’’ అని మంత్రి వెల్లడించారు. కోఠి ఆస్పత్రిలోని వెక్టార్ బార్న్ డిసీజెస్ విభాగం కంట్రోల్ రూం నంబర్ 94404 90716 -
జ్వరం.. కొత్త లక్షణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లా ప్రజలను వింత జ్వరాలు వేధిస్తున్నాయి. జ్వరం ఒకటి రెండు రోజుల్లోనే తగ్గుతున్నా ఆ తరువాత కీళ్ల వాపులు, శరీరంపై ర్యాష్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. గతంలో జ్వరం వస్తే మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉండేది. కానీ ప్రస్తుతం జ్వరం ఒక్కరోజు మాత్రమే ఉంటోంది. 103 నుంచి 104 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. కానీ దుష్ఫలితాలు పది నుంచి 15 రోజుల పాటు వెంటాడుతూనే ఉన్నాయి.మలేరియా, డెంగీ అనుమానిత కేసులువిజయవాడ నగరంలోని మొగల్రాజపురం, మారుతీనగర్, గుణదల, పాతబస్తీలోని చిట్టినగర్, కేఎల్‌రావు నగర్ వంటి ప్రాంతాల్లో డెంగీ, మలేరియా అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. కొందరిలో డెంగీ ఎన్ఎస్1 పరీక్షలో పాజిటివ్ వస్తూ, ప్లేట్లెట్స్ కూడా తగ్గుతున్నాయి. అలాంటి వారిలో డెంగీ ఎలీజా పరీక్ష చేస్తే నెగిటివ్ వస్తోంది. గత నెలలో గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు సోకగా, పదిహేను రోజులుగా నగరంలో కూడా జ్వర బాధితులు పెరుగుతున్నారు. దోమకాటుతో పాటు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా కూడా జ్వరాలు పెరుగుతున్నాయి.దోమల నివారణ ప్రచార ఆర్భాటమేవిజయవాడ నగరంలో వ్యాధులు సోకకుండా దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారమే కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు జరగడం లేదు. ఏదైనా అనుమానిత కేసు వచ్చిన ప్రాంతంలో వైద్య ఆరోగ్యశాఖ, నగర పాలక సంస్థ సిబ్బంది వెళ్లి చుట్టు పక్కల ఇళ్లలో యాంటీ లార్వా ఆపరేషన్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాలు సైతం యాప్‌లో ఫొటోలు అప్లోడ్ చేసేందుకు రెండు, మూడు ప్రాంతాల్లో పర్యటించి సరిపెడుతున్నారు. దోమల నియంత్రణ క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు. దీంతో నగర ప్రజలు దోమకాటు వ్యాధులకు గురవుతున్నారు. అధికారుల ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు.కనిపిస్తున్న లక్షణాలు ఇవీ.. ⇒ తొలుత జ్వరం వచ్చి ఒకటి రెండు రోజుల్లోనే తగ్గిపోతుంది.⇒ ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు ప్రారంభమవుతున్నాయి.⇒ క్రమేణా కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులు వస్తున్నాయి. ⇒ ఇలాంటి వారిలో కొందరు రెండు మూడు రోజులు మంచం మీద నుంచి కిందకు దిగి నడవలేని పరిస్థితి తలెత్తుతోంది.⇒ కొందరిలో కాళ్ల వాపులు సైతం ఎక్కువగా వస్తున్నాయి.⇒ వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.⇒ ఈ లక్షణాలు పది రోజుల నుంచి 15 రోజులు పాటు ఉంటూ ప్రజలను బాధిస్తున్నాయి.⇒ కొంత మందిలో జ్వరం తక్కువగా ఉండి గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలు వేధిస్తున్నాయి.⇒ ఇలాంటి వారు తీవ్రంగా నీరసించి పోతున్నారు. రెండు మూడు రోజులకు దగ్గు కూడా ప్రారంభమవుతుంది. వారం నుంచి పది రోజుల పాటు దగ్గు ఇబ్బంది పెడుతోంది.జ్వరాలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి..ప్రస్తుతం ప్రబలిన జ్వరాలు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒక రోజు జ్వరం వచ్చి తగ్గిపోతుంది. ఆ తర్వాత చాలా మందిలో కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, కాళ్ల వాపులు వస్తున్నాయి. కొందరైతే, రెండు, మూడు రోజులు మంచంపై నుంచి దిగలేని పరిస్థితి ఏర్పడుతోంది. పది నుంచి పదిహేను రోజుల పాటు నొప్పులు ఉంటున్నాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నారు. డెంగీ ఎన్ఎస్1 పాజిటివ్ వచ్చి, ప్లేట్లెట్స్ తగ్గినా, ప్రమాదకరంగా మారడం లేదు. వాటికవే పెరుగుతున్నాయి. కొందరిలో భరించలేని తలనొప్పి, బాడీపెయిన్స్ కూడా ఉంటున్నాయి. నిపుణులైన వైద్యులను సంప్రదించి వైద్యం పొందితే మంచిది.– డాక్టర్ ఎస్.డి.ప్రసాద్, జనరల్ ఫిజీషియన్, విజయవాడ -
తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్స్..
-
డబ్ల్యూహెచ్‌వో చెప్పినా.. పెడచెవిన..
‘ఈ సీజన్లో తెలంగాణకు డెంగీ ప్రమాదం పొంచి ఉంది. డెంగీ ప్రమాదం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉండగా, డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు రెండు మూడు వేరియంట్లు కూడా ఒకేసారి రోగులపై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది.’ – రాష్ట్రానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికసాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలకు తగ్గట్టే రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని..ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కానీ ప్రజారోగ్య సంచాలకుల విభాగం మాత్రం క్షేత్రస్థాయిలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే..ఈ ఏడాది ఆరు నెలల్లో డెంగీ కేసులు అధికంగా నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ నివేదిక పేర్కొంది.లక్షలాది మందికి జ్వరాలు.. ఆస్పత్రులు కిటకిటరాష్ట్రంలో లక్షలాది మందికి జ్వరాలు సోకాయని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు తాజాగా ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నారని ఒక వైద్యాధికారి వెల్లడించారు.దీంతో రాష్ట్రంలో జ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు చికున్‌గున్యా కేసులు భారీగా నమోదయ్యాయి. చాలామంది రోగులు జ్వరంతో బాధపడుతూ ఒళ్లు నొప్పులు కూడా ఉంటున్నట్టు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్లు పెరి గారు. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 40 మంది వచ్చేవారు..కానీ ఇప్పుడు ఆ సంఖ్య వందకు పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వెయ్యిచొప్పున ఓపీ ఉంటోంది.రక్తస్రావం జరిగితే ప్రమాదకరండెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వారు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం కానప్పుడు 20 వేల వరకు ప్లేట్లెట్లు పడిపోయినా ప్రమాదం కాదు. అప్పుడు ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావొచ్చు.– డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, హైదరాబాద్ -
డేంజర్ బెల్స్.. ఫీవర్ హాస్పిటల్
-
డేంజర్ డెంగ్యూ
-
ఒకేసారి 4 వేరియంట్ల దాడి
ఈ సీజన్లో తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు డెంగీ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు తెలంగాణలోనే కనిపిస్తున్నాయని వెల్లడించింది.డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కొన్నిసార్లు రెండుమూడు వేరియంట్లు కూడా ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఫలితంగా డెంగీ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడతారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 500కు పైగా డెంగీ కేసులు వెలుగు చూడడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్వైద్య పరీక్షలే కీలకం ⇒ డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య,ఆరోగ్యశాఖ చెబుతోంది. ⇒ విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ⇒ ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమా దకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. ⇒ డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్ల ని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడ వాలి. ⇒ ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపు లోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య,ఆరోగ్యశాఖ సూచించింది. ⇒ వైరల్ ఫీవర్ నుంచి దూరంగా ఉండాలంటే ఫ్రైడే ను డ్రై డేగా పాటించాలి. ⇒దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. ⇒స్కూల్ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ⇒కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్ ఫీవర్ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్లెట్లు పడిపోకుండా ఉంటుంది.డెంగీ లక్షణాలు⇒డెంగీతో ఉన్నట్టుండి తీవ్రజ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది.⇒కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. ⇒చర్మంపై దద్దుర్లు అయినట్టు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ⇒అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది.ముందుగా గుర్తిస్తే ప్రమాదమేమీ ఉండదుఇక డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారాగానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరమని చెబుతున్నారు. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అధికంగా అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాన్ని వారు గుర్తించాలని సూచిస్తున్నారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ దోపిడీ...ఏటా డెంగీ జ్వరాలతో బాధపడేవారిని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డెంగీ విషయంలో సాధారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే 20 వేల వరకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా ఇబ్బంది లేదని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే వైద్యమే సరిపోతుందని అంటున్నారు. కానీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆస్పత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. డెంగీ ఉన్నా లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు సర్కారుకు చేరాయి. -
డెంగ్యూ జ్వరాన్ని ఎలా గుర్తించాలి?లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
ఈ మధ్యకాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. డెంగ్యూ జ్వరం ఉన్న వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. డెంగ్యూ దోమ కాటు వల్ల వస్తుంది. సాధారణంగా పగటిపూట కుట్టే దోమల వల్ల ఇది వస్తుంది. DEN -1 ,DEN-2 , DEN-3 , DEN-4 అనే నాలుగు రకాల వైరస్ల కారణంగా డెంగ్యూ జ్వరం వస్తుంది. దోమలు కుట్టిన 5-8 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ జ్వరం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది సాధారణం కాగా, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ (ప్రమాదకరమైనది). డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా రావడం తీవ్రమైన తలనొప్పి, కంటినొప్పి కండరాలు, కీళ్ళ నొప్పి వాంతులు అవుతున్నట్లు అనిపించడం డీహ్రైడ్రేషన్‌కు గురి కావడం పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరల్లోని హాస్పిటల్లో చూపించుకోవాలి. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అంటూ ఏదీ లేదు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. వ్యాధి వ్యాపించే విధానం ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పగలు కుట్టే దోమల వల్ల ఇతరులకు సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో నీళ్లు ఎక్కువగా నిలిచిఉన్నా దోమలు వృద్ది చెందుతాయి. ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లో గల డ్రిప్ ఫ్యాన్,పూలకుండీలు, టైర్లు, మూత పెట్టని నీరు నిల్వచేసే తొట్టిలు, కుండీలు, ఫౌంటెన్స్ ద్వారా దోమలు గుడ్లు పెట్టి తర్వాత ఇతరులకు వ్యాపిస్తుంది. డెంగ్యూ.. ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మన రక్తంలో తెల్లకణాలు, ఎర్రకణాలతో పాటు ప్లేట్లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డకట్టటంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్లెట్ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావటానికి దారితీస్తుంది. ♦ప్లేట్లెట్లు 40 వేల వరకూ ఉంటే సాధారణంగా రక్తస్రావం కాదు. ♦ 30 వేల వరకు ఉంటే కొద్దిగా రక్తస్రావం కావొచ్చు. ♦ 20 వేలకు పడిపోతే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. ♦ 10 వేలు మాత్రమే ఉంటే బ్లీడింగ్ విపరీతంగా అవుతుంది. కొన్నిసార్లు రక్తపరీక్షలో ప్లేట్లెట్ కణాల లెక్కింపులో తప్పులు రావొచ్చు. కాబట్టి బాగా తక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలితే మరోసారి పరీక్ష చేసి నిర్ధారించుకోవటం అవసరం. ♦ డాక్టర్లు సూచన మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి బలమైన, పౌష్టికాహారం తినాలి. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. డెంగ్యూకు ఆయుర్వేదంలో చికిత్స ఇలా.. ►వేప, కషాయ, వేపనూనె, కామంచి మొక్క, ఉమ్మెత్త మొక్క సారాన్ని జ్వరం, నొప్పులు తగ్గడానికి వాడతారు. తులసీ, పుదీనా, అల్లం, యాలకులు, దాల్చిన చెక్కలతో చేసిన కషాయాన్ని జ్వరం తగ్గడానికి వాడతారు. ► ఊద రంగులో ఉండే చిలకడదుంపల కషాయం డెంగ్యూని తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. చిలకడదుంపల ఆకుల్లో డెంగ్యూని నివారించే యాంటీ ఆక్సిడైజింగ్ గుణాలు ఉన్నాయని పరిశోధకులు నిర్థారించారు. ఈ ఆకుల్లో ఉన్న సహజమైన ఫోలిఫినోలిక్ అందుకు కారణం అని తేల్చారు. ► బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి కాయ, బొప్పాయి రసంతో డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చు. దీనికోసం బొప్పాయి చెట్టు ఆకులు, కాండము లేకుండా మెత్తగా దంచి పసరు తీయాలి. తులసి నూనె: దోమలను తరిమికొట్టడానికి తులసి నూనె చాలా ప్రభావవంతమైనది. ఇది కీటక–వికర్షక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. లెమన్ గ్రాస్ ఆయిల్: దోమల నుంచి రక్షణ కోసం లెమన్ గ్రాస్ ఆయిల్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెను రాసుకుంటే కొన్ని గంటలపాటు దోమల నుంచి రక్షణ లభిస్తుంది. లావెండర్ ఆయిల్: చర్మంపై లావెండర్ ఆయిల్‌ను రాసుకుని ఆరుబయట సంచరించినా, నిద్రపోయినా దోమలు కుట్టవు. పిప్పరమింట్ స్ప్రే: కొబ్బరి నూనెలో పిప్పరమెంటు బిళ్లను కలిపి స్ప్రే బాటిల్లో నింపాలి. పిప్పరమింట్ ఆయిల్ దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్: నిమ్మకాయ,యూకలిప్టస్ నూనెను సమాన పరిమాణంలో కలపాలి. అదే నూనెలో ఆలివ్, కొబ్బరి, అవకాడో నూనె వేసి స్ప్రే బాటిల్లో నింపాలి. ఈ మిశ్రమాన్ని శరీరంపై స్ప్రే చేసుకోవడం ద్వారా దోమల బెడద నుంచి రక్షించుకోవచ్చు. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు (గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఆయుర్వేదంపై అవగాహన కల్పించడానికే. డాక్టర్ల సలహాతోనే వాటిని పాటించాలి. ) -
డెంగీ జ్వరంతో బాలింత మృతి
జైపూర్: మండలంలోని రామారావుపేట గ్రామ పంచాయతీ పరిధి దుబ్బపల్లికి చెందిన బాలింత కామెర రుచిత(22) జ్వరంతో శుక్రవారం మృతిచెందింది. కొడుకు పుట్టిన 12 రోజులకే కన్నతల్లి ప్రేమను పంచకుండానే దూరమైంది. వివరాలిలా ఉన్నాయి. రుచితకు దుబ్బపల్లికే చెందిన కామెర సంతోష్‌కుమార్‌తో ఏడాది క్రితం వివాహామైంది. 12రోజుల క్రితం మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె బాబుకు జన్మనిచ్చింది. వారం రోజుల తర్వాత ఇంటికి చేరింది. మూడు రోజులుగా రుచితకు జ్వరం వస్తుండడంతో గురువారం మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. రక్తకణాలు తగ్గాయని, డెంగీ పాజిటివ్ ఉన్నట్లుగా గుర్తించి కరీంనగర్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు నిర్దారించారు. కాగా, రుచిత తండ్రి లక్ష్మణ్ ఐదేళ్ల క్రితం మరణించాడు. తల్లి చంద్రమ్మ కూలీ పని చేస్తూ కూతురి వివాహం జరిపించింది. కొడుకు జన్మించిన సంతోషంలో ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. -
ఇంజక్షన్ వికటించి వివాహిత మృతి
వరంగల్: మండల కేంద్రానికి చెందిన శ్యామల స్వాతి(23) ఇంజక్షన్ వికటించి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రెండు రోజుల నుంచి జ్వరం వస్తుండడంతో స్వాతి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ స్రవంతి నర్సింగ్ హోమ్‌లో చేరింది. దీంతో ఆమె రక్తాన్ని టెస్ట్ చేయగా మలేరియా, డెంగీ నెగెటివ్ వచ్చాయి. అయితే ప్లేట్స్ లెట్స్, బీపీ తక్కువగా ఉండడంతో సాయంత్రం వైద్యుడు వరప్రసాద్ చికిత్స నిర్వహించారు. బీపీ అదుపులోకి రావడానికి ఇంజక్షన్ ఇవ్వగా ఆమె మృతి చెందింది. ఈ విషయంపై మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు వరప్రసాద్‌ను నిలదీశారు. ఇంజక్షన్ చేసిన తర్వాతే స్వాతికి మాట రాలేదనని, పిచ్చిగా అరిచిందని తెలిపారు. వరంగల్ తీసుకెళ్తుంటే మృతి చెందిందని ఆరోపించారు. ఈ విషయంపై డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఒక్కొకసారి రిపోర్ట్‌లో నెగెటివ్ వచ్చినా పరిస్థితి విషమిస్తుందన్నారు. బీపీ తక్కువగా ఉండడం వల్ల ఇంజక్షన్ చేసి వరంగల్‌కు తీసుకెళ్లాలని చెప్పానన్నారు. స్వామి మృతి విషయంలో తన నిర్లక్ష్య ఏమీ లేదన్నారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ అప్పయ్యను వివరణ కోరగా బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మృతురాలికి భర్త కార్తీక్, కూతురు ఉంది. -
డెంగీతో విద్యార్థిని మృత్యువాత?
కర్ణాటక: టీబీ డ్యాం ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలిక డెంగీతో మృతి చెందిన ఘటన జరిగింది. నగరంలోని విజ్ఞాన్ ఈ టెక్నో పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని జాహ్నవి(13)కి డెంగీ జ్వరం సోకింది. జాహ్నవి టీబీ డ్యాం వంకాయ క్యాంపునకు చెందిన తిరుమలేష్ కుమార్తె. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విద్యార్థిని హొసపేటెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అనంతరం ఆమెను తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం ఈనెల 18న దావణగెరె బాపూజీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక ఆసుపత్రిలో బుధవారం మృతి చెందింది. జాహ్నవి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విజయనగర జిల్లాలో ఈ ఏడాది డెంగీతో మృతి చెందిన మొట్టమొదటి వ్యక్తి విద్యార్థిని జాహ్నవి. బాలిక మృతికి వైరల్ ఫీవరా లేక డెంగీ కారణమా అనే విషయంపై విజయనగర జిల్లా ఆరోగ్య శాఖ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
డెంగీ జ్వరమే కదా.. అని తేలికగా తీసుకున్నారో.. ఇక అంతే!!
మహబూబాబాద్: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని(35) విషజ్వరంతో బుధవారం రాత్రి చనిపోయింది. రజని వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానిక ఆర్ఎంపీల వద్ద నాలుగు రోజులు వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. దీంతో ఏటూరునాగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ పరీక్షలు చేసి టైఫాయిడ్‌గా తేల్చారు. మెరుగైన వైద్యం నిమిత్తం ములుగు వెళ్లాలని సూచించడంతో ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లారు. రజిని చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళ.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో ఉంటున్న మనీష(30) రాఖీ పండుగ సందర్భంగా వాజేడు మండల పరిధిలోని మొరుమూరు కాలనీ గ్రామానికి వచ్చింది. ఆమె ఇక్కడికి జ్వరంతోనే వచ్చింది. స్థానికంగా వైద్యం చేయించుకున్నా తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ తీసుకెళ్లినట్లు సమాచారం. ఆరు నెలల పాప.. వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎస్కే.గౌస్– సహర దంపతుల కుమార్తె మినహ(6నెలలు) డెంగీ జ్వరంతో బాధపడుతూ వారంరోజుల నుంచి ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలించగా గురువారం చనిపోయినట్లు తండ్రి గౌస్ తెలిపారు. -
ప్రబలుతున్న జ్వరాలు.. ఆందోళనలో ప్రజలు..!
చింతలమానెపల్లి మండలం నందికొండ గ్రామానికి చెందిన భీంరావుకు జ్వరం రావడంతో కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. కొద్దిగా కోలుకోవడంతో ఇంటికి వెళ్లాడు. మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించి పదిరోజుల క్రితం ఇంటి వద్ద మృతి చెందాడు. భీంరావు మరణంతో భార్య, పిల్లలు పెద్దదిక్కును కోల్పోయారు. కుమరం భీం: పల్లెలు మంచం పడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఫ్లూజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలతోపాటు గ్రామీణ మండలాల్లోని ప్రజలు జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. నాణ్య మైన వైద్యం అందక ఇటీవల పెంచికల్పేట్ మండలంలోని కొండెపల్లిలో ఓ మహిళ, చింతలమానెపల్లి మండలం నందికొండలో యువకుడు మృత్యువాత పడ్డారు. అయితే జిల్లావ్యాప్తంగా జ్వరాల వ్యాప్తిపై అధికారికంగా రికార్డులు లేవు. కేవలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోని పరీక్షలనే రికార్డులుగా అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారే అధికంగా ఉండటం గమనార్హం. జ్వరాల వ్యాప్తి గ్రామీణ మండలాల్లో విద్యుత్ సరఫరా అంతరా యంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ కారణంగా నే దోమలతో వ్యాప్తిచెందే మలేరియా, డెంగీ వి జృంభిస్తున్నాయి. కలుషితమైన వాతావరణం, ఆహారం కారణంగా టైఫాయిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. వాతావరణ మార్పులతో చిన్నారులపై ఫ్లూజ్వరం ప్రభావం చూపుతోంది. జలుబు, దగ్గు, స్వల్ప జ్వరంతో అస్వస్థతకు గురవుతున్నారు. టైఫాయిడ్ సోకిన వ్యక్తికి తీవ్రమైన జ్వరం, వాంతులు, విరోచనాలు ఉంటాయి. డెంగీ వ్యాధిగ్రస్తులకు జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, కళ్ల వెనుక భాగంలో తలనొప్పి ఉంటుంది. వీపు భాగంలో ద ద్దుర్లు, మచ్చలను కూడా గమనించవచ్చు. మలేరియా బానిన వారిలో చలి జ్వరం ఎక్కువగా ఉంటుంది. పీహెచ్‌సీల్లో పరీక్షలు టైఫాయిడ్, మలేరియా, డెంగీ జ్వరాలకు బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాపిడ్ పరీక్షల ద్వారా మలేరియాను నిర్ధారిస్తున్నా.. టైఫాయిడ్, డెంగీ శాంపిళ్లను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఫలితాలు రావడానికి ఒక రోజు సమయం పడుతోంది. దీంతో కొన్నిచోట్ల అనుమానిత లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. కట్టడి చర్యలేవి.? జ్వరాల కట్టడికి చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు పంచాయితీ కార్యాలయాల్లో ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతుండడంతో ఫాగింగ్ నిలిచిపోయింది. మరోవైపు పారిశుధ్యం అధ్వానంగా ఉండడం కూడా దోమలు ఉధృతికి కారణమవుతోంది. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో కలుషిత నీరే ప్రజలకు దిక్కవుతోంది. నియంత్రణకు చర్యలు జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. తిర్యాణి వంటి ఏజన్సీ ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎలిసా పరీక్ష ద్వారా డెంగీని కచ్చితంగా నిర్ధారిస్తున్నాం. ఈ ఫలితాలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నాం. – కృష్ణప్రసాద్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డెంగీతో ఒకరి మృతి పెంచికల్పేట్ మండలం అగర్‌గూడ గ్రామానికి చెందిన గోలేటి మారుతి(42) డెంగీతో ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతికి నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఈస్గాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లగా అక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య శారద, కుమార్తె ఉన్నారు. కాగా.. మారుతి తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా 20 ఏళ్లుగా సేవలందిస్తున్నాడు. -
తీవ్రస్థాయిలో జ్వరం.. చిన్నారి మృతి! తండ్రి తిరుగు ప్రయాణం..
జగిత్యాల: డెంగీతో చిన్నారి మృతిచెందిన ఘటన ఆదివారం రాయికల్ మండలం రామాజిపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోనే గౌతమి–రాజరెడ్డి కూతురు గోనే మోక్ష(5)కు వారం రోజులుగా తీవ్రస్థాయిలో జ్వరం రాగా జగిత్యాలలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి డెంగీగా నిర్థారించారు. రక్తకణాలు తక్కువగా ఉన్నాయని తెలపడంతో కరీంనగర్ తరలించి వైద్యం అందిస్తుండగా మృతిచెందింది. రాజరెడ్డి ఇటీవలే ఉపాధి నిమిత్తం గల్ఫ్‌వెళ్లాడు. చిన్నారి మృతితో తండ్రి తిరుగు ప్రయాణం అయ్యాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
డెంగీతో వివాహిత మృతి
భద్రాద్రి: డెంగీతో ఓ వివాహిత మృతిచెందిన ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఎస్సీకాలనీకి చెందిన మలిపెద్ది సంధ్య (22)కు ఇటీవల తీవ్ర జ్వరం రావడంతో భర్త రామకృష్ణ ఆమెను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చాడు. అనంతరం పరీక్షించిన వైద్యులు ఆమెకు డెంగీ లక్షణాలున్నాయని నిర్ధారించి చికిత్స అందిస్తూ వచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి 18 నెలల కుమారుడు ఉన్నాడు. -
ప్రముఖ స్టార్ హీరో సల్మాన్‌కు అనారోగ్యం.. షూటింగులు వాయిదా
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ డెంగ్యూ బారిన పడ్డాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న సల్మాన్ పరీక్షలు చేయించుకోగా డెంగ్యూ ఉన్నట్లు తేలింది. దీంతో రెండువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సల్మాన్‌కు డెంగ్యూ రావడంతో ఆయన నటిస్తున్న సినిమా షూటింగులు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం ఆయన ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ అనే సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు బిగ్‌బాస్ సీజన్-16 ను సల్మాన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన స్థానంలో కరణ్ జోహార్ కనిపించనున్నారు. దీంతో సల్మాన్ కోలుకునేవరకు బిగ్‌బాస్ సీజన్‌ను కరణ్ హోస్ట్ చేయనున్నాడు. ఇప్పటికే గతంలో కరణ్ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణకు ‘ఫుల్ ఫీవర్’.. డెంగీ, మలేరియాతో ఆస్పత్రులకు జనం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి జ్వరమొచ్చింది. ఇక్కడా, అక్కడా అని తేడా లేకుండా ఇంటింటా విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో జనం సతమతం అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలోనే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రుల దాకా రోజూ వేలాది మంది ఔట్ పేషెంట్లు క్యూకడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులూ నమోదవుతున్నాయి. వానలు.. దోమలతో.. ఈసారి తరచూ వానలు పడుతుండటం, మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తగ్గడం, అన్నిచోట్లా నీరు నిల్వ ఉండటం, పారిశుధ్య నిర్వహణ లోపం.. ఇవన్నీ కలిసి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కలుషితాలు వ్యాపిస్తున్నాయి. దీనితో వైరల్ జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా మంది గొంతు నొప్పి, జ్వరంతో ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా న్యుమోనియా, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలూ పెరుగుతున్నాయని అంటున్నారు. పెరుగుతున్న డెంగీ కేసులు అపరిశుభ్ర పరిస్థితులు, దోమల వ్యాప్తి కారణంగా డెంగీ, మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 7 వేలకుపైగా డెంగీ కేసులు నమోదుకాగా.. ఇందులో ఒక్క ఆగస్టులోనే 3,602 కేసులు వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగీ కేసుల వివరాలు సరిగా అందక ఈ సంఖ్య తక్కువగా కనిపిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్రంగా.. విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల తీవ్రత గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రులు సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవాఖాలకు వచ్చే బాధితుల సంఖ్య బాగా పెరిగింది. పలు ఆస్పత్రుల్లో బెడ్లు రోగులతో నిండిపోయాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులూ నమోదవుతున్నాయి. ఒక్క మేడ్చల్ పరిధిలోనే 492 డెంగీ కేసులు వచ్చినట్టు జ్వర సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి తెరతీశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా తీవ్రత గత ఐదు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు 49.67 లక్షల మంది ఔట్ పేషెంట్లు వచ్చారని వైద్యారోగ్యశాఖ బుధవారం వెల్లడించిన నివేదిక తెలిపింది. సగటున నెలకు 9.93 లక్షల ఓపీ నమోదైనట్టు పేర్కొంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధికంగా అనారోగ్యాల బాధితులు ఉన్నారని.. ఇందులో విష జ్వరాల కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కడ చూసినా జ్వర బాధితులే.. ► నల్లగొండ జిల్లాలో విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అధికారికంగానే 56 మందే డెంగీ బారినపడ్డట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ► కరీంనగర్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 236 డెంగీ కేసులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి రోజూ 150 మంది వరకు విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెంగీ 38, వైరల్ జ్వరాలు 1,872 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఈ ఒక్క నెలలోనే 188 డెంగీ కేసులు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో రోజూ వందల్లో జ్వర బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. ► ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనూ సీజనల్ వ్యాధుల కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రోజూ 1,500 మందికిపైగా రోగులు వస్తున్నారని, అందులో విష జ్వరాల బాధితులు ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గత 15 రోజుల్లో 90 డెంగీ కేసులు వచ్చాయి. ► విష జ్వరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను హడలెత్తిస్తున్నాయి. ప్రతీ ఇంట్లో ఒకరైనా మంచం పట్టి కనిపిస్తున్నారు. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు సరిపోక కింద పరుపులు వేసి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 547 డెంగీ కేసులు, 83 చికున్ గున్యా కేసులు వచ్చాయి. ► ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోనూ విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత నాలుగు నెలల్లో 86 డెంగీ కేసులు నమోదుకాగా.. వేల మంది వైరల్ జ్వరాల బారినపడ్డారు. ► సీజనల్ వ్యాధులు, జ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వస్తున్న వారిలో 10 శాతం మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్న పరిస్థితి ఉంది. పిల్లల వార్డులో బెడ్లు నిండిపోయాయి. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచి చికిత్స చేస్తున్నారు. జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యవర్గాలు చెప్తున్నాయి. మూడు రోజులుగా జ్వరంతో.. మా బాబు మహేశ్ వయసు ఎనిమిదేళ్లు. మూడు రోజులుగా తీవ్రంగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. బాగా నీరసంగా ఉంటే ఈ రోజు ఆస్పత్రికి తీసుకొచ్చాం. వైరల్ జ్వరంలా ఉంది.. పరీక్షలు చేయించాలని వైద్యులు అంటున్నారు. – మహేశ్ తల్లి, ఉప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో తగ్గక ప్రైవేటుకు వెళ్లాం డెంగీ రావడంతో వారం రోజుల క్రితం ఫీవర్ ఆస్పత్రిలో చేరి ఐదు రోజులు చికిత్స తీసుకున్నాను. ప్లేట్ లెట్స్ తగ్గిపోతూనే ఉన్నాయి. మా ఇంట్లోవాళ్లు ఆందోళనతో ఫీవర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. – సాయి కిరణ్ (20), బాగ్ అంబర్‌పేట ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’! -
వైరల్ జ్వరాలకు ఆరోగ్యశ్రీ రక్ష
సాక్షి, అమరావతి: సీజనల్ జ్వరాల బారినపడుతున్న ప్రజలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. ఓ వైపు వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు చేపడుతూనే.. మరోవైపు జ్వరాలబారిన పడిన వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 1,237 మలేరియా, 2,174 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సీజనల్ వ్యాధుల బారినపడే వారికి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స లభిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ కింద చేసే చికిత్సల సంఖ్యను ప్రభుత్వం ఏకంగా 2,446కు పెంచింది. త్వరలో వీటిని 3,118కి పెంచనుంది. 7,032 మందికి చికిత్స ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా 689 మంది మలేరియా బాధితులు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పొందారు. వైరల్ జ్వరాల బారినపడిన వారిలో ప్లేట్లెట్స్ తగ్గుదల సమస్య ఉంటోంది. ఈ క్రమంలో ఎలీసా నిర్ధారణ పరీక్షతో సంబంధం లేకుండా వైరల్ జ్వరంతో బాధపడుతూ.. ర్యాపిడ్ కిట్‌లో పాజిటివ్ ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డెంగ్యూ చికిత్స అందిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి ఆగస్టు వరకు 6,343 మంది చికిత్స పొందారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి 1,612 మంది ఉన్నారు. పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకి ఉచిత చికిత్స.. ఎలీసా పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,174 డెంగ్యూ కేసులను మాత్రమే నిర్ధారించారు. ఎలీసా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయితేనే డెంగ్యూ ఉన్నట్టు. అయితే కొన్ని రకాల వైరల్ జ్వరాల్లో ఎముక మజ్జ అణచివేత (బోన్‌మ్యారో సప్రెషన్)తో ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి. ఈ క్రమంలో వైరల్ జ్వరాల బారినపడి.. ప్లేట్లెట్స్ తగ్గినవారికి ఎలీసా పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకు చికిత్స అందించాలని కేంద్రం సూచించింది. ఇలాంటి పరిస్థితులున్న బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు -
డెంగీపై సర్కారు యుద్ధం.. డోర్ టు డోర్ ఫీవర్ సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, దీనిపై సర్కారు యుద్ధం ప్రకటించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రతీ ఐదేళ్లకోసారి కేసులు పెరుగుతుంటాయని, ఇది ఐదో సంవత్సరం అయినందున పెరుగుతున్న తీరు గమనిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీ శాఖలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి సోమవారం ఆయన జూమ్ ద్వారా వైద్య, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ పరిధిలో జూలైలో 542 డెంగీ కేసులుంటే, ఆగస్టులో 1,827 కేసులు నమోదయ్యాయన్నారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా పది వేల బ్లడ్ యూనిట్లు సేకరించామని, ఎంత రక్తం అవసరమైనా ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 17న హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు పెట్టి ఉచితంగా ప్రజలకు బ్లడ్ ఇచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ తరపున ఏర్పాట్లు చేస్తామన్నారు. డెంగీ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో వైద్య సిబ్బంది డోర్ టు డోర్ జ్వర సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జ్వర సర్వేతోపాటు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ను ప్రతీ ఒక్కరికి జీహెచ్ఎంసీ పరిధిలో వేసేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పారు. ప్రతి ఆదివారం పది నిమిషాలు: కేటీఆర్ ఏయే వార్డుల్లో డెంగీ కేసులు ఎక్కువ ఉన్నాయో జీహెచ్ఎంసీ కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు పరిశీలించాలని, నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ ప్రణాళిక రూపొందించాలన్నారు. ‘గత మూడేళ్లలో ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని బాగా చేశాం. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు, మహిళలనూ భాగస్వాములను చేయాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు కూడా తమ గృహాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలి. కలెక్టర్లు జిల్లాల్లో ఈ కార్యక్రమం చేసేలా ఉంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. విద్యార్థులు, టీచర్లు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొని పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇళ్లకు స్టిక్కర్లు అతికించాలి. డిజిటల్ మాధ్యమంలో బాగా ప్రచారం నిర్వహించాలి’ అని కేటీఆర్ చెప్పారు. డెంగీ దోమలు మురికి నీళ్లలో కాకుండా మంచినీటిలో ఉంటాయని అందువల్ల నీరు నిలువ లేకుండా చూడాలని చెప్పారు. పోలీసులు కార్డన్ సెర్చ్ చేసినట్లు జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీలన్నింటిలో జ్వర సర్వే నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ సహా జిల్లాల్లో, డెంగీ కేసులున్న పట్టణ ప్రాంతాల్లోనూ జ్వర సర్వే ఉద్యమంలా నిర్వహించాలన్నారు. ఇదీ చదవండి: ఏడాదిగా రోజూ రూ.లక్షల్లో డిపాజిట్ -
హైదరాబాద్‌లో పెరుగుతోన్న డెంగ్యూ కేసులు
-
హైదరాబాద్‌ను వణికిస్తున్న డెంగీ కేసులు.. షార్ట్స్ వేసుకుంటే కాటేస్తాయి
సాక్షి, హైదరాబాద్: దోమకాటుతో వచ్చే డెంగీ వ్యాధి నగరంలో ప్రబలుతోంది. సాధారణంగా వానాకాలంలో ఎక్కువగా కనపడే డెంగీ.. ఇప్పుడు సీజన్స్‌కు అతీతంగా సిటీలో విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరంలో 167 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. నగరవాసులు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. సంపన్న ప్రాంతాల్లో అధికం.. కొంత కాలంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలోని సంపన్న ప్రాంతాల్లో సైతం కేసులు బాగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. డెంగీ దోమకి గుడ్డు పెట్టడానికి 10మి.లీ ద్రవం చాలు. కూలర్స్, ఫ్రిజ్‌లు, ఏసీలు తదితరాల నుంచి వృథా నీరు ఎప్పటికప్పుడు తొలగించకపోవడం, ఇళ్లల్లో ఇంటీరియర్ అందం కోసం ఎక్వేరియమ్స్ నీళ్లలో తాబేలు, ఫ్లవర్ పాట్స్ లాంటి డెకరేటివ్ ఉత్పత్తుల్లో నీళ్లు రోజూ మార్చకపోవడం దోమల విజృంభణకు కారణమవుతోంది. వేసవి సెలవులు కారణంగా.. ఊరు వెళుతున్నప్పుడు వారం, పదిరోజుల పాటు ఆ నీటిని అలాగే వదిలేస్తుండడం.. ఈ నిల్వ నీటిలో సులభంగా డెంగీ దోమ గుడ్లు పెడుతోంది. షార్ట్స్ వేసుకుంటే.. కాటు.. డెంగీ దోమ అడుగున్నర మించి ఎగరలేదు. మోకాళ్ల పైదాకా వచ్చి కుట్టలేదు. కాబట్టి డెంగీ దోమ షార్ట్స్ వేసుకునే అలవాటు ఉన్నవారికి తరచుగా కాటేస్తున్నట్టు గుర్తించారు. సిబ్బంది దోమల మందు పిచికారీ చేయడానికి కూడా కొన్ని కాలనీస్లలో అడ్డుకుంటున్నారు. ఇది సరికాదు.. ప్రస్తుతం తుంపర్లు లేకుండా గాలిలోనే కలిసిపోయేలా మందు పిచికారీ చేస్తున్నారు. కాబట్టి కాలనీలలో అడ్డు చెప్పకుండా సహకరించాల్సిన అవసరం ఉంది. గత ఏడాది ఆగస్టు వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 48.5 శాతం అంటే 2,091 కేసులు హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం. డెంగీ లక్షణాలు, చికిత్స ►ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి, కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్లనొప్పులు, అధిక దాహం, బీపీ తగ్గుదల. ►ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్‌తోపాటు తప్పనిసరిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ►డెంగీ జ్వరాన్ని గుర్తిస్తే వెంటనేవైద్యుని సలహా తీసుకోవాలి. ►ప్లేట్లెట్లు 50 వేలలోపు పడిపోతే దాన్ని ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణించాలి. ►జ్వరం తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ►రోగికి ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు మళ్లీ పెరుగుతాయి. ఈ జాగ్రత్తలు పాటించాలి ఖాళీ బీరు, విస్కీ తదితర బాటిల్స్ ఇంట్లో, మేడమీద ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్దు. ఫ్లవర్ పాట్స్ కింద ఉంచే ప్లేట్స్ నుంచి నీటిని తొలగిస్తూ ఎప్పటిప్పుడు శుభ్రం చేస్తుండాలి. ప్రతి నాలుగైదు రోజులకోసారి ఇంట్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను శుభ్రం చేస్తుండాలి. పగిలిన వినియోగించని ప్లాస్టిక్ కంటైనర్లు, వాడేసిన కొబ్బరి చిప్పలు, పాత సామాన్లు పడేసే స్టోర్ రూమ్స్ దోమల నివాసాలని గుర్తించాలి. షౌకత్‌నగర్‌లో ఎక్కువ... నాన్ సింప్టమాటిక్ డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటిదాకా ఇన్ పేషెంట్ చికిత్స అవసరం ఎవరికీ రాలేదు. ఒక్క కేసు వచ్చినా చుట్టూ 100 ఇళ్లు ఫీవర్ సర్వే చేస్తూ, మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాం. కేవలం షౌకత్ నగర్లో తప్ప ఒకసారి డెంగీ గుర్తించిన ప్లేస్‌లో మళ్లీ కేసులు రావడం లేదు. సిటీలో షౌకత్ నగర్లో 6 కేసుల వరకూ వచ్చాయి. నగరంలోని 152 బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు.. ఇలా అన్ని చోట్ల ఉచిత పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. – నిరంజన్, జిల్లా మలేరియా ప్రోగ్రామ్ అధికారి, హైదరాబాద్ -
ఢిల్లీలో డెంగీ తొలి మరణం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో డెంగీ బారిన పడి ఒకరు మృతి చెందారు. ఈ ఏడాది ఇదే తొలి మరణమని వెక్టార్ డిసీజ్ పౌర నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సరితా విహార్‌కు చెందిన మమత(35) డెంగీ బారిన పడి సెప్టెంబర్ 20న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆమె సెప్టెంబర్ 25న మృతి చెందారని వివరించింది. ఈ ఏడాది అక్టోబర్ 16 వరకూ ఢిల్లీలో 723 డెంగీ కేసులు నమోదు అయ్యాయని, గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికమని తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 9 వరకూ 480 కేసులు వెలుగులోకి రాగా ఒక్క వారంలోనే 243 కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. గడిచిన 2 వారాలుగా ఢిల్లీలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి పేర్కొన్నారు. 2020లో 1,072 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారని, 2019లో ఇద్దరు, 2018లో నలుగురు, 2017లో 10 మంది, 2016లో 10 మంది మృతి చెందారని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు, మార్చిలో ఐదు, ఏప్రిల్‌లో పది, మేలో 12, జూన్‌లో ఏడు, జూలైలో 16, ఆగస్ట్‌లో 72, సెప్టెంబర్‌లో 217 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 16 వరకూ ఢిల్లీలో మలేరియా కేసులు 142, చికున్‌గున్యా కేసులు 69 నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. (చదవండి: కోవాగ్జిన్‌పై అదనపు సమాచారం కావాలి: డబ్ల్యూహెచ్ఓ) -
Body Aches: ఒళ్లు నొప్పులా? తక్కువగా అంచనా వేయకండి..
అనేక వ్యాధుల్లో అత్యంత సాధారణ ప్రాథమిక లక్షణం ఒళ్లునొప్పులు. ఓ వయసు దాటాక అప్పుడప్పుడూ ఒళ్లునొప్పులు కనిపిస్తుంటాయి. అయితే అవి మామూలుగానే వచ్చే ఒళ్లునొప్పులా లేక ఏదైనా వ్యాధి కారణంగానా అని రోగనిర్ధారణ చేయడం డాక్టర్‌కు ఎప్పుడూ సవాలే. ఎందుకంటే... అది జ్వరంగానీ, జలుబుగానీ లేదా ఏదైనా వైరల్, బ్యాక్టీరియల్, ఇతరత్రా ఇన్ఫెక్షన్లన్నింటిలోనూ చాలా కామన్‌గా కనిపిస్తుంటాయి కాబట్టే ఆ ఇబ్బంది. అలాగే మనం సాధారణంగా వాడే కొలెస్ట్రాల్ మందులు మొదలుకొని అత్యంత తీవ్రమైన వ్యాధి వల్ల కూడా కావచ్చు. మామూలుగానైతే ఒళ్లునొప్పులు గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. అలాగని నిర్లక్ష్యమూ తగదని చెబుతూ... ఏయే సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పించే కథనమిది. కండరాల నొప్పుల్లో చాలా రకాలుంటాయి. కండరాల నొప్పుల్ని మయాల్జియా అని, కీళ్ళనొప్పుల్ని ఆర్థ్రాల్జియా అని, కీళ్ళలో వాపు ఉంటే ఆర్థ్రరైటిస్ అని, మృదుకణజాలం (సాఫ్ట్ టిష్యూ)లో నొప్పులు/ఇన్ఫెక్షన్లు ఉంటే టెండనైటిస్ అని, నరాల్లో నొప్పులుంటే న్యూరాల్జియా అని, ఎముకల్లో నొప్పులుంటే బోన్ పెయిన్స్ అంటాం. నొప్పులకు చాలా కారణాలుంటాయి. ఇందులో కొన్ని... ►ఇన్ఫెక్షన్లు... ∙వైరల్ జ్వరాల్లో : సాధారణ ఫ్లూ (ఇన్ఫ్లుయెంజా), అప్పట్లో చికున్ గున్యా మొదలుకొని ఇటీవల చాలా ఎక్కువగా ప్రబలుతున్న డెంగీ వరకు. అలాగే హెపటైటిస్–బి, హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్లలో. ►ప్రోటోజోవన్ ఇన్ఫెక్షన్లు : మలేరియా, పిల్లి వల్ల వ్యాప్తిచెందే టాక్సోప్లాస్మోసిస్ వంటి ఏకకణజీవి ఇన్ఫెక్షన్లలో. ►బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు: టైఫాయిడ్, రికెట్సియల్ వంటి జ్వరాల్లో, బొరిలియా ప్రజాతికి చెందిన బ్యాక్టీరియాతో వచ్చే లైమ్ డిసీజ్ వంటి జబ్బుల్లో. ►ఇరతత్రా ఇన్ఫెక్షన్లు : ట్రైకినెల్లా స్పైరాలిస్, సిస్టిసెర్కోసిస్ (బద్దెపురుగు) వంటి సరిగ్గా ఉడికించని పోర్క్ ద్వారా వ్యాపించే పరాన్నజీవుల ఇన్ఫెక్షన్లలో. ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన కండిషన్లు... డెంగీ : ఇటీవల అనుమానించాల్సిన జబ్బు ఇది. డెంగీలో ఒళ్లునొప్పుల తీవ్రత చాలా ఎక్కువ. అందుకే దీన్ని ‘బోన్ బ్రేకింగ్ ఫీవర్’ అని కూడా అంటారు. ఇలాంటి నొప్పులతో పాటు విపరీతమైన నడుమునొప్పి ఉంటే దాన్ని ‘డెంగీ’గా అనుమానించాలి. ►ఫ్లూ. ఇతర జ్వరాలు: ఫ్లూ జ్వరం ఇన్ఫ్లుయెంజా వైరస్ల వల్ల వస్తుంది. ఇందులో ‘ఇన్ఫ్లుయెంజా ఎ’, ‘ఇన్ఫ్లుయెంజా బి’, ‘ఇన్ఫ్లుయెంజా సి’ అని మూడు రకాలున్నాయి. వీటన్నింటిలో తీవ్రమైన ఒళ్లునొప్పులతో పాటు దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉంటాయి. చాలామందిలో అవి వాటంతట అవే తగ్గుతాయి. లక్షణాలనుంచి ఉపశమనం కోసం పారాసిటమాల్ తీసుకుంటే చాలు. చాలా అరుదుగా కొందరిలో నిమోనియా, శ్వాస అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాలి. ►చికున్‌గున్యా: ఇదీ వైరల్ జ్వరమే అయినా ఇందులో మిగతా వైరల్ ఇన్ఫెక్షన్ల కంటే కీళ్లనొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. నొప్పుల కారణంగా రోగి నడవలేక పూర్తిగా ఒంగిపోతాడు. దీనికి ఉపశమనం కోసం పారాసిటమాల్ వాడి, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ►లెప్టోస్పైరోసిస్ : ఒళ్లునొప్పులతో మొదలయ్యే జ్వరమిది. ప్రస్తుత వర్షాకాలంలో మురుగునీటివల్ల, ఎలుకల ద్వారా వ్యాప్తిచెందే అవకాశాలెక్కువ. ఇందులోనూ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిమందిలో మాత్రం కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి అనేక కీలక అవయవాలు ఒకేసారి దెబ్బతినే ప్రమాదం (మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్) జరిగి అది ప్రాణాంతకం కావచ్చు. లెప్టోస్పైరోసిస్‌ను ముందే తెలుసుకుంటే పెన్సిలిన్, టెట్రాసైక్లిన్ వంటి మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. ►క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్: ఈ జబ్బులో త్వరగా అలసిపోవడం, తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసట తగ్గకపోవడం, శక్తి లేనట్టు అనిపించడం ముఖ్యలక్షణాలు. ఆర్నెల్లకు పైగా ఇవే లక్షణాలు ఉండి, జ్ఞాపకశక్తి క్షీణించడం, నిద్రలేమి వంటివి కూడా ఉంటే, ఆ లక్షణాలన్నీ చూసి దీన్ని నిర్ధారణ చేస్తారు. ఈ జబ్బుకు సరైన కారణం తెలియదు. క్రానిక్ ఇన్ఫెక్సియస్ మోనోన్యూక్లియోసిస్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ కూడా క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్‌కు కారణం కావచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ►మందులతో : కొన్ని జబ్బులకు మనం వాడే మందులతో కూడా ఒళ్లునొప్పులు రావచ్చు. ఇందులో కొలెస్టరాల్ తగ్గించడానికి సాధారణంగా వాడే స్టాటిన్స్ వంటివీ ఉంటాయి. ఇలాంటప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే మందులు మార్చడమో, మోతాదు తగ్గించడమో చేస్తారు. కొన్ని విషసర్పాలు కాటు వేసినప్పుడు కండరాల మీద కనిపించే దుష్ప్రభావం వల్ల కూడా కండరాల నొప్పులు వస్తాయి. అలాగే మనకు తెలియకుండా మన దేహంలోకి వెళ్లే విషాల వల్ల కూడా కండరాల నొప్పులు రావచ్చు. కీళ్లనొప్పులకు సంబంధించిన వ్యాధులతో నొప్పులు... కీళ్లనొప్పులతో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో, జన్యుపరమైన లోపాల వల్ల ముక్కుకు ఇరువైపులా మచ్చలా కనిపించే సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్లో, పాలీమయాల్జియా రుమాటికా (అంటే గ్రీకు భాషలో అనేక కండరాల్లో నొప్పి అని అర్థం), పాలీమయోసైటిస్, జోగ్రెన్స్ సిండ్రోమ్ వంటి కీళ్లవ్యాధుల్లో ►నరాలు, కండరాలకు సంబంధించిన వ్యాధులు: – మయోపతి, మయస్థేనియా గ్రేవిస్, ఫైబ్రోమయాల్జియా వ్యాధుల్లో. ►ఎండోక్రైన్ వ్యాధులు : – హైపోథైరాయిడిజం, హైపర్‌పారాథైరాయిడిజం, హైపర్‌పారాథైరాయిడిజం వంటి వాటితోపాటు... ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్లలో. పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్ వల్ల: శరీరంలో ఎక్కడ క్యాన్సర్ సోకినప్పటికీ... ఇతర కండరాలపై దాని ప్రభావం వల్ల వచ్చే కండిషన్ అయిన ‘పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్’లో. ►మల్టిపుల్ మైలోమా: ప్లాస్మాకణాల క్యాన్సర్లలో ఇలా ఒకింత తీవ్రమైన కారణాల్లోనే కాకుండా... సాధారణంగా అంతగా అపాయం లేని సమస్యల్లోనూ ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. అవి... ∙తీవ్రమైన అలసటతో వచ్చే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్‌లో ►మందులు, విషపదార్థాలు: డీ–పెన్సిల్లెమైన్స్, క్లోరోక్విన్, స్టెరాయిడ్స్, జిడోవిడిన్ వంటి మందులతోపాటు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఉపయోగించే మందుల వల్ల కూడా ఒళ్లునొప్పులు వస్తుంటాయి. ∙ఒక్కోసారి ఆల్కహాల్ మితిమీరి తీసుకున్న మర్నాడు కూడా. ►క్యాన్సర్ రోగుల్లో కీమో థెరపీ తీసుకుంటున్నప్పుడు కూడా ఒళ్ళు నొప్పులు బాధిస్తుంటాయి. చేయించాల్సిన పరీక్షలు: పైన మనం చెప్పుకున్నట్లుగా ఎన్నెన్నోరకాల సమస్యల వల్ల ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. కాబట్టి ఏ కారణం వల్ల అవి వస్తున్నాయో కనుగొనడం ప్రధానం. అందుకే చేయించాల్సిన కొన్ని సాధారణ పరీక్షలివి... ►మూత్రపరీక్ష ►ఈఎస్ఆర్ ►హీమోగ్రామ్ ►కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు ►సీరమ్ ప్రోటీన్ ఎలక్ట్రోఫోరోసిస్ (ఎస్పీఈపీ ►స్కెలెటల్ సర్వే ►బోన్ స్కాన్ ►సీరమ్ క్యాల్షియమ్ ఫాస్ఫరస్ ►ఆల్కలైన్ ఫాస్ఫోటేజ్ పరీక్షలు ►25 హైడ్రాక్సీ వైటమిన్ డి లెవెల్స్ ►సీరమ్ పారాథోర్మోన్ లెవెల్స్ ►బోన్‌మ్యారో (ఎముక మూలగ) పరీక్ష ►యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ పరీక్ష ►రుమటాయిడ్ ఫ్యాక్టర్ ►హెచ్ఐవీ ►హెచ్‌బీఎస్‌ఏజీ ►హెచ్‌సీవీ పరీక్షలు ►మజిల్ బయాప్సీ ►ఈఎంజీ... ఒక్కోసారి అన్ని పరీక్షలు చేశాక కూడా రోగనిర్ధారణ జరగకపోవచ్చు. అలాంటివారిలో అందుకు కారణం యాంగై్జటీ, డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులు కారణం కావచ్చు. అలాంటివారికి సైకియాట్రిస్ట్‌లతో తగిన మందులు, సలహాలతో మంచి ఫలితం ఉంటుంది. చాలా సందర్భాల్లో నిరపాయకరమైన కారణాల వల్లనే ఒళ్లునొప్పులు వస్తుంటాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం సాధారణంగా ఉపయోగించే నొప్పినివారణ పూత మందులు వాడితే చాలు. అయితే ఇవి ఉపయోగిస్తున్నప్పటికీ రెండుమూడు వారాల తర్వాత కూడా తగ్గకుండా ఒళ్లునొప్పులు కనిపిస్తూనే ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. - డాక్టర్ కె. శివ రాజు సీనియర్ ఫిజీషియన్ -
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో అడివి శేష్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర అనారోగ్యానికి గురైన నటుడు హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కాగా గతవారం అడివి శేష్ డెంగ్యూ బారిన పడగా.. తాజాగా ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శేష్ అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు హీరో అరోగ్యం విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కాగా హీరో శేష్ ప్రస్తుతం “మేజర్” సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘ 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. దీంతోపాటు ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ‘హిట్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘హిట్2’లో శేష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తారట. ‘హిట్’ తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన శైలేష్ కొలనుయే ‘హిట్ 2’ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. చదవండి: నగరంలో వరుస హత్యలు.. రావాలి ఓ గూఢచారి Sonu Sood: ప్రతి రూపాయి పేదల కోసమే.. ఐటీ సోదాలపై సోనూసూద్ -
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న విషజ్వరాలు