భద్రాద్రి: డెంగీతో ఓ వివాహిత మృతిచెందిన ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఎస్సీకాలనీకి చెందిన మలిపెద్ది సంధ్య (22)కు ఇటీవల తీవ్ర జ్వరం రావడంతో భర్త రామకృష్ణ ఆమెను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చాడు.
అనంతరం పరీక్షించిన వైద్యులు ఆమెకు డెంగీ లక్షణాలున్నాయని నిర్ధారించి చికిత్స అందిస్తూ వచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి 18 నెలల కుమారుడు ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment