కర్ణాటక: టీబీ డ్యాం ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలిక డెంగీతో మృతి చెందిన ఘటన జరిగింది. నగరంలోని విజ్ఞాన్ ఈ టెక్నో పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని జాహ్నవి(13)కి డెంగీ జ్వరం సోకింది. జాహ్నవి టీబీ డ్యాం వంకాయ క్యాంపునకు చెందిన తిరుమలేష్ కుమార్తె. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విద్యార్థిని హొసపేటెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది.
అనంతరం ఆమెను తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం ఈనెల 18న దావణగెరె బాపూజీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక ఆసుపత్రిలో బుధవారం మృతి చెందింది. జాహ్నవి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విజయనగర జిల్లాలో ఈ ఏడాది డెంగీతో మృతి చెందిన మొట్టమొదటి వ్యక్తి విద్యార్థిని జాహ్నవి. బాలిక మృతికి వైరల్ ఫీవరా లేక డెంగీ కారణమా అనే విషయంపై విజయనగర జిల్లా ఆరోగ్య శాఖ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment