
మంగళవారం సూర్యాపేట ఆస్పత్రిలో రోగితో మాట్లాడుతున్న మంత్రి ఈటల
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ప్రతి విష జ్వరం డెంగీ కాదని, ప్రతి జ్వరం మలేరియా కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రకరకాల వైరల్ ఫీవర్స్‌కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు, సెలైన్ బాటిళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంగళవారం మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులతో కలసి సూర్యాపేటలోని జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవలపై రోగులను ఆరా తీశారు. మెడికల్ కళాశాల భవనా న్ని పరిశీలించారు.
విషజ్వరాలపై ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకోవా లని సూచించారు. డాక్టర్లు, సిబ్బంది నెల రోజులు సెలవు పెట్టొద్దని ఆదేశించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఆస్పత్రులకు ఏ లోటు లేకుండా చూస్తామని చెప్పారు. కాగా, నల్లగొండ రహ్మత్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్‌రఫీ కుమార్తె ఆఫీయా మెహ్వీన్ (7) డెంగీ వ్యాధి సోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది.