
దీక్షిత (ఫైల్)
వనపర్తి, అమరచింత: పట్టణానికి చెందిన దీక్షిత (18) ఐఐటీ విద్యార్థిని డెంగీ జ్వరంతో కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండలంలోని చంద్రనాయక్ తండాకు చెందిన సీత్యానాయక్ కూతురు దీక్షిత ఐఐటీలో ఆల్‌ఇండియా 241వ ర్యాంకును సాధించి వారణాసిలో ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి సీత్యానాయక్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడ్డారు. స్వగ్రామమైన చంద్రనాయక్ తండాకు విద్యార్థిని దీక్షిత మృతదేహంను తీసుకువచ్చి ఖననం చేశారు. (రానున్న రోజుల్లో పొంచి ఉన్న వ్యాధుల ముప్పు..)