
ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్
బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ డెంగ్యూ ఫీవర్ తో ఆస్పత్రిలో చేరాడు.
ముంబై: బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ డెంగ్యూ ఫీవర్ తో ఆస్పత్రిలో చేరాడు. గత కొన్నిరోజులు నుంచి షూటింగ్ లో బిజీగా ఉన్న రణ్ వీర్ కు ఆకస్మికంగా జ్వరం ఎక్కువ కావడంతో టెస్టుల నిమిత్తం ముంబై ఆస్పత్రి వెళ్లాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతనికి డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు నిర్దారించారు. దీంతో అతను షూటింగ్ కు కొన్ని రోజులు విరామం ప్రకటించక తప్పడంలేదు.
ప్రస్తుతం అతను 'గూండే' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర సన్నివేశాలను కలకత్తాకు అతి సమీపంలో ఉన్న దుర్గాపూర్ లో షూట్ చేస్తుండగా తొలుత రణ్ వీర్ కొంత అలసటకు లోనైయ్యాడు. అతనికి ఒంట్లో నలతగా ఉన్నా కూడా సినిమా నిర్మాణానికి ఆటంకం కలగ కూడదనే ఉద్దేశంతో షూటింగ్ పాల్గొంటు వస్తున్నాడు. కాగా, శుక్రవారం జ్వరం కొద్దిగా ఎక్కువ కావడంతో ముంబైలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా డెంగ్యూ ఉన్నట్లు తేలింది. పరీక్షలు నిర్వహించిన అనంతరం అతనికి డెంగ్యూ సోకినట్లు తేలింది. దీంతో రణ్ వీర్ ఎప్పుడు తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడు అనే విషయంపై సందిగ్థత నెలకొంది.