
సాక్షి, మెదక్ : మెదక్ పట్టణంలోని గురుకుల పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కావ్య అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో బుధవారం రాత్రి మృతి చెందింది. ఈ నేపథ్యంలో కావ్య కుటుంబసభ్యులు మృతదేహంతో పాఠశాలకు ఎదురుగా ఉన్న రోడ్డుపై బైటాయించి తమ నిరసన తెలిపారు. దీంతో ఈ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. గత నెల రోజులుగా కావ్య డెంగ్యూ జ్వరంతో భాదపడుతున్నరెసిడెన్షియల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించలేదని పేర్కొన్నారు. దీనికి పాఠశాల ప్రిన్సిపాల్ భాద్యత వహించాలని, ఆమె నిర్లక్ష్యం కారణంగానే కావ్య మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment