gurukul school
-
మీ పిల్లలకు ఇలాగే వండి పెడుతున్నారా?
లంగర్‌హౌస్: ఇంట్లో మీరు తినే భోజనం ఇలాగే వండుకుంటారా? మీ పిల్లలకు ఇలాగే వండి పెడుతున్నారా? ఉడకని కూరగాయలకు తోడు అధికంగా మసాలాలు వేస్తే పిల్లల ఆరోగ్యాలు దెబ్బ తినవా? నాణ్యమైన భోజనం కోసం ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచినా సరైన మెనూ అందివ్వడానికి మీకు వచ్చిన కష్టం ఏమిటి? అంటూ పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. పిల్లల భోజనంపై ఇంత నిర్లక్షమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం లంగర్‌హౌస్ ఇబ్రహీంబాగ్‌లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ సొసైటీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. దుస్తులు, పాఠ్య పుస్తకాలు, ప్లేట్లు, ఇతర వస్తువులు సరిగా అందుతున్నాయా.. లేదా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బోధనపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం భోజనశాలను సందర్శించి విద్యార్థులకు అన్నం వడ్డించారు. విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం సైతం భోజనం పెట్టించుకున్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, గోల్కొండ తహసీల్దార్ అహల్యతో పాటు ఇతర అధికారులను కూడా విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తినాలని సూచించారు. ఈ క్రమంలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి పొన్నం.. కూరలు నాణ్యతగా లేకపోవడాన్ని గుర్తించి నిర్వాహకులపై మండిపడ్డారు. టమాటాలు ముక్కలు చేయకుండా.. కనీసం కోయకుండా అలా మసాలాలో నేరుగా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భోజనం విషయంలో నాణ్యత పాటించకపోయినా.. నిర్లక్ష్యం వహించినా అందరూ బాధ్యులే అవుతారని ఆయన హెచ్చరించారు. మంచినీళ్లూ కరువేనా..? ఈ క్రమంలోనే మంత్రి మంచినీళ్లు కావాలని అడగడంతో అక్కడ ఉన్న గ్లాసులలోని నీరు ముట్టుకోనీయకుండా సిబ్బంది కాస్త ఆలస్యంగా బాటిళ్లు తెచ్చి ఇచ్చారు. ఇదేంటని మంత్రి అడగగా.. వాటర్ ఫిల్టర్ పని చేయడంలేదని నిర్వాహకులు తెలిపారు. అదే నీరు చిన్నారులకు ఇస్తున్నారంటే వారి ఆరోగ్యం, వారి ప్రాణాలపై మీకు బాధ్యత లేదా? అంటూ మరోసారి మండిపడ్డారు. వెంటనే ఫిల్టర్‌కు మరమ్మతులు చేయించాలని, భోజనాలలో కూడా మార్పులు రాకపోతే ఒక్కరు తప్పు చేసినా అందరినీ బాధుల్ని చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. -
భోజనం ఎలా ఉందమ్మా?
బీబీనగర్:బోజనం ఎలా ఉందమ్మా? కొత్త మెనూ ప్రకారం అన్నీ పెడుతున్నారా? సదుపాయాలు బాగున్నాయా?..’అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులను ఆరా తీశారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆదివారం ఆయన వరంగల్ వెళుతూ మధ్యలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని బీసీ బాలికల గురుకులం, ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించారు. తొలుత బీసీ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లారు. కొత్త మెనూ అమలు, వసతిగృహంలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ అడిగారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అరగంటకు పైగా అక్కడ గడిపారు. అనంతరం అదే ఆవరణలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించి తనిఖీలు చేశారు. భోజనం, కిచెన్, డైనింగ్ హాల్, కూరగాయలు, కిరాణా సరుకులు, బియ్యం తదితర వంట సామాన్లను పరిశీలించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారా అని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. హెల్త్చెకప్ కార్డులు మెయింటెయిన్ చేయడం లేదని, రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారని ఆయన చెప్పడంతో, హెల్త్ చెకప్ కార్డులు తప్పనిసరిగా మెయింటెయిన్ చేయాలని వైద్యారోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఎస్సీ బాలికల హాస్టల్లో డిప్యూటీ సీఎం గంటన్నర పాటు ఉన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక భారం ఉన్నా డైట్ చార్జీలు పెంచాం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం కోసం డైట్ చార్జీలను 40 శాతం పెంచినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.పెంచిన చార్జీలు, మెనూ ప్రకారం హాస్టళ్లలో అన్నీ సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్లు గంధాధర్, వీరారెడ్డి ఆయన వెంట ఉన్నారు.వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా: భట్టి గీసుకొండ: భూమిలేని వ్యవసాయ కూలీలందరికీ ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పథకం ద్వారా ఆర్థిక చేయూత అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచర్లలో కీర్తినగర్, మొగిలిచర్ల, విశ్వనాథపురం 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని మాయమాటలు చెప్పి అప్పుల కుప్పగా మార్చి ప్రజల జీవితాలను ఆగం చేసిందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు చేసిన నిర్వాకానికి ప్రతి నెలా రూ.6,500 కోట్ల మేరకు అసలు, వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కరెంటు సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్, రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్
-
గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురైన మరో విద్యార్థి
-
అల్లూరి జిల్లా గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
నాయుడుపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
భావి విద్యకు బాటలు
రాజ్‌కోట్: స్వతంత్ర భారతంలో తొలిసారిగా దేశ భావి అవసరాలను సంపూర్ణంగా తీర్చేలా సమగ్ర విద్యా విధానం అమలుకు చిత్తశుద్ధితో కృషి జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్రిటిష్ పాలనలో కనుమరుగైన మన ఉజ్జ్వల పురాతన గురుకుల విద్యా విధానం తదితరాల సుగుణాలను పునరుద్ధరించేందుకు స్వాతంత్రం రాగానే పాలకులు నడుం బిగించాల్సింది. కానీ బానిస మనస్తత్వంలో నిండా కూరుకుపోయిన గత ప్రభుత్వాలు ఈ దిశగా ఏ ప్రయత్నమూ చేయలేదు పైగా చాలా అంశాల్లో తిరోగమన ధోరణితో దేశాన్ని వెనక్కు తీసుకెళ్లాయి’’ అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ఇలాంటి తరుణంలో మన బాలలకు మళ్లీ గురుకుల తరహా నాణ్యమైన విద్యను అందించేందుకు ఆధ్యాత్మిక గురువులు పూనుకున్నారు. శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ ఇందుకు ఉదాహరణ’’ అన్నార. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న సంస్థ 75వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాని శనివారం వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. సనాతన భారతదేశం అన్ని విషయాల్లోనూ విశ్వ గురువుగా భాసిల్లిందన్నారు. ‘‘మిగతా ప్రపంచం అంధకారంలో మునిగి ఉన్న సమయంలో మన దేశం విద్యా దీపాలను సముఉజ్జ్వలంగా వెలిగించింది. నలంద, తక్షశిల వంటి మన విశ్వవిద్యాలయాలు ప్రపంచమంతటికీ నిస్వార్థంగా, వివక్షారహితంగా విద్యా దానం చేశాయి. ఆత్మ తత్వం నుంచి పరమాత్వ తత్వం దాకా, ఆయుర్వేదం నుంచి సామాజిక శాస్త్రం, గణిత, లోహ అంతరక్ష శాస్త్రాల దాకా, సున్నా నుంచి అనంతం దాకా అన్ని శాస్త్రాలూ మన దేశంలో ఉచ్ఛ స్థాయిలో విలసిల్లిన కాలమది. వాటన్నింటినీ ప్రస్తుత తరాలకు అందించేందుకు స్వామి నారాయణ్ వంటి విద్యా సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి’’ అని ప్రశంసించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఐఐటీలు, ఐఐఎంలు, వైద్య కళాశాలల వంటి అత్యున్నత నాణ్యతతో కూడిన విద్యా సంస్థల సంఖ్య 65 శాతానికి పైగా పెరిగిందని చెప్పారు. ‘‘దేశ భవిష్యత్తు గొప్పగా ఉండాలంటే విద్యా విధానం, విద్యా సంస్థల పాత్ర చాలా కీలకం. కాబట్టే ఈ దిశగా అన్ని స్థాయిల్లోనూ శరవేగంగా మెరుగైన మార్పులు తెచ్చేందుకు మేం నడుం బిగించాం’’ అన్నారు. -
వంటపని చేస్తున్న గురుకుల విద్యార్థి.. సాంబారు పడి తీవ్రగాయాలు
పుల్కల్(అందోల్): సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఒంటిపై సాంబారు పడటంతో తీవ్రగాయాలపాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుల్కల్ గ్రామానికి చెందిన మైసనగారి ప్రణయ్ సింగూరు గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 15న ఉదయం క్యాంటీన్‌లోంచి సాంబారును డైనింగ్ హాల్లోకి తీసుకురావడానికి ప్రణయ్ సహకారాన్ని వంటమనిషి కోరాడు. సాంబరు గిన్నె తీసుకెళ్తుండగా వేడివేడి సాంబారు ప్రమాదవశాత్తు ప్రణయ్ రెండు చేతులు, కాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రిన్సిపాల్ బాలస్వామి వెంటనే ప్రణయ్ కుటుంబసభ్యులకు సమాచారమందించి అతడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి గురుకులంలో నలుగురు వంటమనుషులు ఉండాలి. కానీ, ఒక్కరే ఉండటంతో రోజూ సీనియర్ విద్యార్థులను సహాయకులుగా వాడుకుంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులతో పనులు చేయించుకుంటున్న సింగూరు గురుకుల ప్రిన్సిపాల్, కేర్ టేకర్‌పై చర్యలు తీసుకోవాలని స్వేరోస్ నాయకులు డిమాండ్ చేశారు. -
ఆదివారం.. వంట భారం.. సాయం తీసుకోమంటే ఏకంగా..
కోరుట్ల: రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ బీసీ గురుకుల పాఠశాలల నిర్వహణ గాడి తప్పుతోంది. గురుకులాల్లో ప్రతి ఆదివారం అల్పాహారం తయారు చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే పడుతోంది. వంట మనుషుల్లేక ఒక్కోవారం ఒక్కో తరగతి విద్యార్థులు ప్రణాళిక వేసుకొని కావాల్సినవి తయారు చేసుకోవాల్సి వస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులే చపాతీలు చేసుకోవడం వెలుగులోకి వచ్చింది. 67 గురుకులాలు.. 2,200 మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ బీసీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు 67 వరకు ఉన్నాయి. ఇందులో 5 నుంచి పదో తరగతి వరకు చదువు చెబుతుంటారు. ప్రస్తుతం వీటిలో సుమారు 2,200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురుకుల పాఠశాలల్లో రోజూ విద్యార్థులకు టిఫిన్ అందజేస్తారు. ప్రతి 80 మంది విద్యార్థులకు ఓ వంటమనిషి ఉంటారు. ఈ లెక్కన ఒక్కో గురుకులంలో సుమారు ఆరుగురు వంట మనుషులు ఉండాలి. కానీ చాలా స్కూళ్లలో ఈ లెక్కన వంట మనుషుల్లేరు. సగానికి మించి గురుకులాల్లో ఉదయం విద్యార్థులకు ఇవ్వాల్సిన టిఫిన్ కేటరింగ్ ద్వారా తెప్పిస్తున్నారు. లేదంటే విద్యార్థులతోనే తయారు చేయిస్తారు. దాదాపు మూడేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. సాయం తీసుకోమన్నందుకు.. వారంలో 6 రోజుల పాటు కిచిడీ, ఇడ్లీ, అటుకులు వంటి టిఫిన్లు వంట మనిషులు లేదా కేటరింగ్ ద్వారా తెప్పిస్తున్నారు. అయితే ఆదివారం గురుకులాల్లో తప్పనిసరిగా చపాతీ లేదా పూరీ టిఫిన్‌గా పెట్టాలి. ఒక్కో గురుకులంలో ప్రతి ఆదివారం ఒక్కో విద్యార్థికి రెండు చపాతీలు లేదా పూరీల చొప్పున దాదాపు వెయ్యి వరకు కావాలి. ఇంత పెద్దమొత్తంలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు తలకు మించిన భారమవుతోందని చాలాచోట్ల ఉన్నతాధికారులకు ప్రిన్సిపాళ్లు నివేదించినట్లు సమాచారం. దీంతో ఆదివారం పిల్లల సాయం తీసుకుని చపాతీ లేదా పూరీలు తయారు చేసుకోవాలని అధికారులు మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇదే ఆసరాగా కొన్నిచోట్ల గురుకులాల ప్రిన్సిపాళ్లు ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున విద్యార్థులే చపాతీలు, పూరీలు చేసేలా ప్రణాళిక వేసి వంటపనులు చేయిస్తున్నారు. మౌఖిక ఆదేశాలున్నాయి ఆదివారం పెద్దసంఖ్యలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు సాధ్యం కావట్లేదు. దీంతో పిల్లల సాయం తీసుకోవాలని అధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున పిల్లల సాయంతో చపాతీలు చేయిస్తున్నాం. మిగిలిన రోజుల్లో పిల్లలకు సమస్య ఉండదు. – బాబు, ప్రిన్సిపాల్, కోరుట్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల -
ప్రిన్సిపల్ సంతకం ఫోర్జరీ
పశ్చిమగోదావరి,చింతలపూడి: గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పాఠశాల నిధుల నుంచి రూ. 7.40 లక్షల నగదును కాజేసిన ఘటన చింతలపూడి మండలం, నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.దుర్గాభవాని సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో దినసరి భత్యంపై పని చేస్తున్న కె.హరీష్‌బాబు, రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ జీవీఆర్ మోహన్‌రావు కలిసి ఈ సొమ్మును కాజేశారని, వారిపై చర్యలు తీసుకుని గురుకుల పాఠశాల సొమ్మును రికవరీ చేయాలని ప్రిన్సిపల్ ఫిర్యాదులో కోరారు. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో స్కూల్ ఖాతా నుంచి సొమ్మును డ్రా చేశారని తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంట్లో వివిధ దఫాలుగా సొమ్ములు డ్రా చేసినట్లు ఉందని, డ్రా అయిన సొమ్ముల వివరాలు తమ క్యాష్ బుక్‌లో లేక పోవడంతో బ్యాంకుకు వెళ్లి విచారించగా గత ఏడాది జూలై 6వ తేదీన రూ.1.40 లక్షలు, అదే నెల 15వ తేదీన రూ.2.50 లక్షలు, ఆగస్టు 9న రూ.3.50 లక్షలు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి డ్రా చేసినట్లు ఉందని వెల్లడించారు. గురుకుల పాఠశాల నిధులను ఫోర్జరీ చేసి స్వాహా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ దుర్గా భవాని కోరారు. -
మెదక్‌లో ఉద్రిక్తత; విద్యార్థిని మృతదేహంతో నిరసన
సాక్షి, మెదక్ : మెదక్ పట్టణంలోని గురుకుల పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కావ్య అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో బుధవారం రాత్రి మృతి చెందింది. ఈ నేపథ్యంలో కావ్య కుటుంబసభ్యులు మృతదేహంతో పాఠశాలకు ఎదురుగా ఉన్న రోడ్డుపై బైటాయించి తమ నిరసన తెలిపారు. దీంతో ఈ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. గత నెల రోజులుగా కావ్య డెంగ్యూ జ్వరంతో భాదపడుతున్నరెసిడెన్షియల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించలేదని పేర్కొన్నారు. దీనికి పాఠశాల ప్రిన్సిపాల్ భాద్యత వహించాలని, ఆమె నిర్లక్ష్యం కారణంగానే కావ్య మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. -
వరదలో విద్యార్థులు..
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డ గురుకుల పాఠశాలను వరద నీరు చుట్టు ముట్టింది. భారీ వర్షాలు కారణంగా పాఠశాల పక్కనే ఉన్న ఏరు పొంగి ప్రవహిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి ఒకసారిగా వరద చుట్టుముట్టింది. వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను స్థానికులు కాపాడారు. అధికారులు అప్రమత్తమై.. బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థినులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గండికోట జలాశయానికి భారీగా వరదనీరు.. కడప జిల్లా: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గండికోట జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. 30 వేల క్యూసెక్కుల నీరు గండికోటకు చేరింది. మైలవరం నుండి 20 వేల క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వరద ఉధృతిపై కలెక్టర్ హరికిరణ్ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. -
తల్లిదండ్రులూ ఇంగ్లిష్ నేర్చుకోవాలి
మణికొండ: రాబోయే రోజుల్లో ఆంగ్లభాష ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం అవుతుందని, దాన్ని నేర్చుకునేందుకు ప్రతి గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి పేర్కొన్నారు. గండిపేట మండలం నార్సింగి గురుకుల బాలకల పాఠశాలలో ఆరు రోజులుగా తల్లిదండ్రులకు బోలో ఇంగ్లీష్ ధనాధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డెవలప్మెంట్ ఆఫ్ అలుమి రిలేషన్స్ ప్రత్యేక అధికారి కొరివి వినయకళ అధ్యక్షత వహించగా ఆమె ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచభాషగా పిలుస్తున్న ఆంగ్లభాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. విద్యార్థులకు తాము పాఠశాలల్లో ఆంగ్లంలో బోధిస్తున్నా తల్లిదండ్రులు వారితో మాట్లాడలేక పోవటంతో పూర్తి స్థాయి ఫలితం రావడం లేదన్నారు. అందుకే తల్లిదండ్రులకు సైతం ఆగ్లభాష నేర్చించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు ఆంగ్లభాష నేర్చుకోవాల్సిన అవసరాన్ని సమగ్రంగా వివరించారని, రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామన్నారు. గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తల్లితండ్రులు ఆంగ్లం నేర్చుకుని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించే దిశగా వారితోనే పోటీ పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఓలు, ప్రిన్సిపాల్లు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
గురుకులంలో ఫుడ్ పాయిజన్!
మెదక్ రూరల్: మెదక్ జిల్లాలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హవేళిఘణాపూర్ మండల కేంద్రంలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. హవేళిఘణాపూర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఆదివారం రాత్రి అన్నం, చారు, బెండకాయతో భోజనం చేసి నిద్రపోయారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 30 మంది విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వారి బాగోగులు చూసే నర్సు అందుబాటులో లేకపోవడంతో అస్వస్థతకు గురైన పిల్లలను సిబ్బంది మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో 7, 8 వ తరగతికి చెందిన చంద్రిక, నాగవర్ష, శిరీష, మౌనిక, సంధ్య, లతిక అనే ఆరుగురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని పలువురు విద్యార్థినులు వాపోతున్నారు. పిల్లలు అస్వస్థతకు గురైన విషయాన్ని తమకు తెలియజేయకపోవడంపై కొందరు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ శోభాదేవి మాట్లాడుతూ.. పాఠశాలలో మొత్తం 298 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని అన్నారు. పరీక్షించిన డీఎంహెచ్‌వో.. చికిత్స పొందుతున్న విద్యార్థినుల నుంచి డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యు లను ఆదేశించారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై విచారిస్తామన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి పరిసరాలు, విద్యార్థులుండే ప్రాంతా న్ని శుభ్రంగా ఉంచాలని సూచించారు. మండల వైద్యుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు పరీక్షలు చేసి మందులను అందజేశారు. -
రక్షాబంధన్ వేళ.. ఎందుకీ శిక్ష
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నంగా నిర్వహించేది రక్షాబంధన్. అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇచ్చే ఈ పండుగ జరపుకొనేందుకు, తాము ఎక్కడున్నా ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటామని మళ్లీమళ్లీ సోదరిలకు భరోసా కల్పించేందుకు అన్నదమ్ములు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తారు. అయితే ఓ ప్రిన్సిపాల్ వారికి ఆ ఆనందం లేకుండా అడ్డుకున్నారు. కనీసం తమ చెలెళ్లు, అక్కలను చూడడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంతో పలువురు యువకులు, వారి తల్లిదండ్రులు పండగ వేళ తీవ్ర క్షోభకు గురయ్యారు. విశాఖపట్నం, డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలో యండపల్లివలస గురుకుల పాఠశాల(ఏపీఆర్) ప్రిన్సిపాల్ నిర్వాకంతో రక్షాబంధన్ పండుగ వేళ గిరిజన విద్యార్థినులు, వారి అన్నదమ్ములు తీవ్ర క్షోభకు గురయ్యారు. మాకెందుకీ శిక్ష అంటూ ఆవేదన చెందారు. చివరకు గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఆదేశాల మేరకు రాఖీ కట్టేందుకు ప్రిన్సిపాల్ అంగీకరించడంతో కొంతమందికి మాత్రమే ఆ ఆనందం దక్కింది. వివరాలు ఇలా ఉన్నాయి. పాఠశాలలో చదువుతున్న తమ అక్క,చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకునేందుకు చింతపల్లి, కొయ్యూరు, జీకే వీధి,ముంచంగిపుటు,పెదబయలు,హుకుంపేట,జి.మాగుడుల, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మండలాల నుంచి సుమారు 150 మంది గిరిజన యువకులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఉదయం యండపల్లివలస గురుకుల పాఠశాల(ఏపీఆర్)కు వచ్చారు. అక్కడి ప్రిన్సిపాల్ అరుణజ్యోతి విద్యార్థినులను బయటకు పంపేందుకు నిరాకరించారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను చూసేందుకు దూరప్రాంతాల నుంచి ఎంతో ఆశగా వస్తే ఇలా అడ్డుకోవడమేమిటని గొడవకు దిగారు. అయినా ప్రిన్సిపాల్ ససేమిరా అనడంతో వారు గిరిజన సంక్షేశాఖ డిప్యూటీడైరెక్టర్ విజయ్‌కుమార్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సాయంత్రం నాలుగు గంటలకు కొంత మంది విద్యార్థినుల తల్లిదండ్రులను పాఠశాల లోపలికి వెళ్లేందుకు ప్రిన్సిపాల్ అనుమతించారు. వర్షం పడుతుండడంతో తడుస్తూ ఉండలేక చాలా మంది యువకులు, వారి తల్లిదండ్రులు అప్పటికే నిరాశతో వెళ్లిపోయారు. దీంతో తమ అన్నదమ్ములకు రాఖీ కట్టలేకపోయామని పలువురు విద్యార్థినులు తీవ్ర వేదనకు గురయ్యారు. ప్రిన్సిపాల్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పడిగాపులు కాశాం... దూరం ప్రాంతం నుంచి కుమార్తెను చూసేందుకు, తమ్ముడితో రాఖీ కట్టించేందు ఉదయం 10 గంట లకు పాఠశాలకు వచ్చాం. అయితే ప్రిన్సిపాల్ అనుమతించలేదు. ఎంతో వేడుకున్నాం. మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశాం. అయినా ప్రిన్సిపాల్ కనికరించలేదు. తమ పిల్లలను కలుసుకునే అవకాశం ఇవ్వని ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకోవాలి. – కొండబాబు,విద్యార్థిని తండ్రి, జి.మాడుగుల మండలం -
చౌటుప్పల్ గురుకులానికి మిస్ వరల్డ్ అమెరికా
చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని బాలికల గురుకుల పాఠశాలను సోమవారం మిస్ వరల్డ్ అమెరికా–2017 క్లారిసా బోవర్ సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యంతో బాధపడే చిన్నారుల కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. అందులో భాగంగా చౌటుప్పల్ గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులతో కలసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా చిన్నారులకు సేవ చేస్తానని తెలిపారు. అలాగే యుద్ధాల్లో గాయపడ్డ సైనికులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. -
గురుకులాల్లో కాస్మొటిక్ కిట్లపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులకు అందిస్తున్న కాస్మొటిక్ కిట్లపై అయోమయం నెలకొంది. కిట్లలోని వస్తువుల ధరలు భారీగా పెరగడంతో వాటిని కొనుగోలు చేసి పంపిణీ చేయడం సొసైటీలకు తలకు మించిన భారంగా మారుతోంది. దీనిపై తర్జనభర్జన నెలకొనడంతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా కిట్ల పంపిణీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోసారి చొప్పున ఏడాదిలో నాలుగుసార్లు వాటిని విద్యార్థినులకు అందించాల్సి ఉంది. ఈసారి ఇంకా అందించకపోవడంతో పలువురు విద్యార్థినులు వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకోవల్సి వస్తోంది. కిట్లకు ధరాభారం.. గత విద్యాసంవత్సరం చివర్లో గురుకుల సొసైటీలు విద్యార్థినుల కోసం ప్రయోగాత్మకంగా కాస్మొటిక్ కిట్లను పంపిణీ చేశాయి. కాస్మొటిక్ కేటగిరీలో ఉండే వస్తువులను వేర్వేరుగా కొనుగోలు చేసిన సొసైటీలు... కిట్లుగా మార్చి విద్యార్థినులకు అందించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల్లోని సగానికిపైగా గురుకులాలకు ఈ కిట్లను సరఫరా చేశారు. అయితే సరుకుల కొనుగోలుకు, ప్రభుత్వం ఇచ్చే చార్జీలకు భారీ వ్యత్యాసం ఉండటంతో కిట్లను పంపిణీ చేయడం గురుకుల సొసైటీలకు భారంగా మారింది. మరోవైపు మైనారిటీ గురుకులాల్లో ఇస్తున్న చార్జీలు... ఇతర గురుకుల సొసైటీల్లో ఖర్చు చేసే మొత్తంలో కూడా భారీ తేడా ఉంటోంది. మైనారిటీ గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థినికి ఇచ్చే కిట్‌ను రూ. 300 పెట్టి కొనుగోలు చేస్తుండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీలు ఇందుకోసం రూ. 160 చొప్పున మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. దీంతో మైనారిటీ గురుకులాల్లో అత్యుత్తమ కిట్లు అందుతుండగా మిగతా గురుకులాల్లో కిట్ల నాణ్యత అంతంత మాత్రంగానే ఉంటోంది. ఫలితంగా వాటిని విద్యార్థినులు పెద్దగా ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థినులకు ఇచ్చే కాస్మొటిక్ కిట్లను ఒకే సంస్థ ద్వారా పంపిణీ చేయించాలని గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా కిట్ల పంపిణీని కేంద్రీకరించాలని కోరుతూ ప్రతిపాదనలు తయారు చేశాయి. కిట్‌లో ఉండే వస్తువుల జాబితాను పేర్కొంటూ వాటిని నేరుగా గురుకులాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీలు ప్రభుత్వాన్ని కోరాయి. దీని అమలు సాధ్యాసాధ్యాలపై వచ్చిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది . వాటికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాక గురుకులాలకు కిట్లను పంపిణీ చేయనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
ఇక్కడ కష్టం ‘గురు’
ఉత్తమ విద్యనందించేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే వాటిలో సౌకర్యాల విషయాన్ని ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. దాంతో విద్యార్థులకు కష్టాలతో సహజీవనం తప్పడం లేదు. నరేంద్రపురం గురుకుల పాఠశాల దానికి ఓ ఉదాహరణగా నిలుస్తోంది. పి.గన్నవరం: విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు చెప్పుకొనే ప్రభుత్వం, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమవుతోంది. పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న చందంగా నరేంద్రపురం ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తయారైంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. నరేంద్రపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను రూ. 13 కోట్లతో నిర్మించారు. రెండేళ్ల క్రితం ఈపాఠశాల ప్రారంభోత్సవ సభలో అప్పటి సాంఘికసంక్షేమ శాఖ మంత్రి ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్టు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ గాలిలో కలిసిపోయింది. దాంతో ఆది నుంచి ఇక్కడ సమస్యలతో విద్యార్థులు సమతమవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ పాఠశాలలో ప్రస్తుతం ఐదో తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకూ సుమారు 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతి గదుల్లో బెంచీలు లేవు. అలాగే పడక గదుల్లో మంచాలు, పరుపులు లేవు. దాంతో వారు కిందనే నిద్రిస్తున్నారు. జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి వేళల్లో కరెంటు పోతే చీకటి రాజ్యమేలుతోంది. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించలేదు. దీంతో పాఠశాల ఆవరణలో విష సర్పాలు సంచరిస్తున్నాయి. గతంలో ఒక విద్యార్థి స్కూలు బ్యాగ్‌లో కట్లపాము దూరి అతడిని కాటేసింది. అదృష్టవశాత్తూ అతను ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడు. పాఠశాల ఆవరణను మెరక చేయకపోవడంతో ఆటస్థలం లేక తుప్పల్లోనే విద్యార్థులు ఆటలు ఆడుకుంటున్నారు. పాఠశాల ఆవరణలో సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షం వస్తే విద్యార్థుల రాకపోకలతో తరగతి గదులు బురదమయం అవుతున్నాయి. మూడు నెలలుగా ఆర్వో ప్లాంటు పనిచేయడం లేదు. దీంతో మంచినీటి టిన్నులను కొనుగోలు చేస్తున్నారు. నరేంద్రపురం– అవిడి రోడ్డు నుంచి ఈ పాఠశాల వరకూ కిలోమీటరు మేర గ్రావెల్ రోడ్డు వేశారు. అది పాడై పోవడంతో వర్షం వస్తే రహదారి బురదమయం అవుతోంది. ఆ సమయంలో పాఠశాలకు మంచినీరు కూడా సరఫరా కావడం లేదు. స్నానాలు చేసేందుకూ ఇబ్బందులే.. పాఠశాలలో బోరు సక్రమంగా లేక త్రీ ఫేజ్ వాటర్ మోటారు పనిచేయడం లేదు. దీంతో సింగిల్ ఫేజ్ మోటారుపైనే నీటికోసం ఆధార పడ్డారు. నరేంద్రపురంలో విద్యుత్ కోత ఎక్కువగా ఉంటోంది. దీంతో స్నానాలకు నీరులేక నానా పాట్లు పడుతున్నారు. కొందరు విద్యార్థులు రెండు రోజులకొకసారి స్నానాలు చేస్తున్నారు. బయట ఉన్న చేతిపంపుల వద్ద పలువురు విద్యార్థులు స్నానాలు చేస్తున్నారు. విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో చేతిపంపుల వద్ద ఆలస్యమవుతుండటంతో పక్కనే ఉన్న పంట బోదెల్లో స్నానాలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరుగుదొడ్లలో నీరు లేకపోవడంతో బహిర్భూమికి పొలంగట్లకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఇన్ని సమస్యలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నా, సంబంధిత ఉన్నతాధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఏకకాలంలో 5 వేల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ కోసం ఏర్పాటు చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ(తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు) నోటిఫికేషన్ జారీకి కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు గురువారం బోర్డు సభ్యులు భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన సొసైటీ కార్యదర్శులు నోటిఫికే షన్ ఎలా ఇవ్వాలనే అంశంపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యా శాఖ గురుకులాల్లో బోధన, బోధనేతర కేటగిరీల్లో 5 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 80 శాతం పోస్టులు నేరుగా భర్తీ చేయాలని బోర్డు భావిస్తోంది. వీటికి ఏకకాలంలో నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు రోస్టర్ రూపొందించాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది. జూన్ 15 కల్లా నోటిఫికేషన్! గురుకులాల్లో ఖాళీలపై సొసైటీలు ఇప్పటికే స్పష్టత ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వీటిలో వేజ్ ఇండెంట్‌పై వారంలోగా స్పష్టత రానుంది. సొసైటీల వారీగా రోస్టర్ జాబితా సిద్ధమైతే నోటిఫికేషన్‌కు మార్గం సుగమమవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 15 నాటికి నోటిఫికేషన్ ఇచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడ్డాక పరీక్షల నిర్వహణ, ఫలితాలు, పోస్టుల భర్తీకి కనీసం 3 నెలల సమయం పడుతుందని సమాచారం. ఈ నెలాఖరులోగా తాజా నియామకాలపై స్పష్టత రానుంది. కాగా, గతేడాది టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన భర్తీ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. -
గురుకుల విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సు
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటివరకు ఇంటర్మీడియెట్ వరకు వసతితోపాటు ఉచిత విద్య అందిస్తుండగా.. తాజాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, దేశంలోని ప్రఖ్యాత కాలేజీల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆ కాలేజీల్లో సీటు వచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించనుంది. ఇందుకోసం ప్రముఖ శిక్షణ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ అందజేసింది. నెలాఖరులోగా ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ప్రముఖ సంస్థలతో ఒప్పందం ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్‌తోపాటు ఇతర రంగాలపైనా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు రాష్ట్ర విద్యాసంస్థల వరకే పరిమితం అవుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో కోర్సు చదవాలంటే వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించాలి. అంతేకాకుండా ప్రఖ్యాత యూనివర్సిటీలు, కాలేజీల్లో సీట్లు సాధించాలంటే ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఆర్థికంగా వెనుకబడ్డ గురుకుల విద్యార్థులకు ఇవి రెండూ కష్టం. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. పట్టుదల, భారీ లక్ష్యాలున్న విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించనుంది. దీనికి సంబంధించిన శిక్షణ కోసం ప్రముఖ ఇన్స్టిట్యూట్లతో అవగాహన కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ఉచితంగా మెటీరియల్ కూడా అందజేయనుంది. అలాగే ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకుతో సీటు సాధించిన వారి కోర్సు ఫీజును కూడా ఎస్సీ అభివృద్ధి శాఖ భరించనుంది. పాఠశాల స్థాయి నుంచే శిక్షణ లక్ష్యాల్ని నిర్దేశించుకునే విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే పలు దఫాలుగా శిక్షణ ఇప్పించేలా ఎస్సీ గురుకుల సొసైటీ ప్రణాళికను రూపొందించింది. ఇంటర్మీడియెట్ నుంచి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనుంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం అందుబాటులోకి రానుంది. తొలుత జూనియర్ కాలేజీ స్థాయి ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలన్నింట్లోనూ ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే ఏడాది ఎస్సీ గురుకులాల్లోనూ దీనిని అందుబాటులోకి తేనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
తరలిపోతున్న గురుకులాలు
మోర్తాడ్(బాల్కొండ): వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం గతేడాది ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలను ఇప్పుడు ఉన్న చోటు నుంచి పొరుగు మండలాలకు తరలించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా అధికారులు ప్రభుత్వానికి పంపించారు. నియోజకవర్గానికి ఒక బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 2017–18కు గాను బా ల్కొండ నియోజకవర్గానికి సంబంధించి మోర్తాడ్, ఆ ర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఖుద్వాన్పూర్ లో, బోధన్ నియోజకవర్గం పాఠశాలను ఎడపల్లిలో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పాఠశాలను చీమన్‌పల్లిలో, నిజామాబాద్ అర్బన్ పాఠశాలను నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. చీమన్‌పల్లి పాఠశాలకు అద్దె భవనం ఆలస్యంగా దొరకగా సౌకర్యాలను కల్పించడానికి అర్బన్‌లోనే కొనసాగించారు. గడచిన విద్యా సంవత్సరానికి గాను 5, 6, 7 తరగతులకే విద్యా బోధన అందించారు. 2018–19 విద్యా సంవత్సరానికి గాను ఎనిమిదో తరగతి ఆరంభం కానుంది. కొత్త విద్యార్థులు వస్తున్నప్పటికీ.. అలాగే తాజాగా ప్రవేశ పరీక్షలను నిర్వహించగా కొత్తగా ఐదో తరగతిలోకి విద్యార్థులు అడ్మిషన్లను పొందనున్నారు. నిన్న మొన్నటి వరకు మూడు తరగతులు రెండే సెక్షన్ల చొప్పున ఉండగా మొత్తం 240 మంది విద్యార్థులకు విద్యతో పాటు వసతిని కల్పించారు. అయితే కొత్త విద్యార్థులకు సరిపడే వసతి లేని కారణంగా ఐదు పాఠశాలల్లో మూడింటిని తరలించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. ప్రధానంగా మోర్తాడ్‌లోని గురుకుల పాఠశాలను బాల్కొండకు, ఎడపల్లిలోని పాఠశాలను బోధన్‌కు, అర్బన్‌లో కొనసాగుతున్న రూరల్ నియోజకవర్గం పాఠశాలను చీమన్‌పల్లికి తరలించాలని ప్రతిపాదనలు చేశారు. మోర్తాడ్ గురుకులాన్ని బాల్కొండకు, ఎడపల్లి గురుకులాన్ని బోధన్ హెడ్‌క్వార్టర్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తరలిస్తారా లేదా అనే విషయం ఇంకా తేలడం లేదు. గురుకుల పాఠశాలలను తరలించడానికి బదులు అద్దెభవనమా, ప్రభుత్వ భవనాన్ని పరిశీలించి ఎక్కడి పాఠశాలలను అక్కడే కొనసాగించాలని పలువురు కోరుతున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేశాం బీసీ గురుకుల పాఠశాలలను తరలించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. తొందరలోనే వీటిని తరలిస్తాం. పాఠశాలలు ఆరంభం కాకముందే పొరుగు మండలాలకు వీటిని తరలించి విద్యార్థులకు అనువైన వాతావరణం కలిగేలా చూస్తాం. కొత్త తరగతు లు కూడా ప్రారంభం కాబోతున్నాయి.– తిరుపతి,బీసీ గురుకులాల రీజినల్ కో ఆర్డినేటర్ -
ఉచిత శిక్షణ ... భవితకు రక్షణ
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసెట్ కోచింగ్ అనేది తల్లిదండ్రులకు భారంగా మారింది. వేల రూపాయిల ఫీజుల కట్టలేక పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆర్థిక భారంతో ప్రతిభ ఉండి కూడా పలువురు సాధారణ డిగ్రీలతో సరిపెట్టుకుంటున్నారు. చదువుకు పేదరికం అడ్డుకారాదన్న ధ్యేయంతో ప్రభుత్వం ముందుకొచ్చి శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలయోగి బాలికల గురుకులం ఉచిత ఎంసెట్ శిక్షణ కేంద్రంగా ఎంపికైంది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ప్రతిభ చూపిన విద్యార్థినుల్ని ఎంపిక చేసి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. సత్తెనపల్లి: ఆటపాటలకు, నాణ్యమైన విద్యా బోధనకు నెలవైన సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలయోగి బాలికల గురుకులం ఎంసెట్ శిక్షణ కేంద్రంగా ఎంపికైంది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ప్రతిభ చూపిన విద్యార్థినుల్ని ఎంపిక చేసి ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి కార్పొరేట్ సంస్థల్లో శిక్షణ పొందలేని గురుకుల విద్యార్థినులకు ప్రభుత్వం ఉచితంగా అత్యున్నత నాణ్యత, ప్రమాణాలతో తరగతుల్ని నిర్వహిస్తోంది. ప్రతిభ ఆధారంగా ఎంపిక జిల్లాలోని పలు ప్రాంతాల్లోని గురుకుల కళాశాలలకు చెందిన 91 మంది విద్యార్థినుల్ని(ఎంపీసీ, బైపీసీ) ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన ఎంపిక చేశారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఐఐటీ అ«ధ్యాపకులు వీరికి వర్చువల్ తరగతులు (ఆన్లైన్, ప్రత్యక్ష ప్రసారాలు) ద్వారా నలభై రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గత నెల 20 నుంచి రామకృష్ణాపురంలో శిక్షణ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సబ్జెక్టుల వారీగా ఇస్తున్నారు. మెటీరియల్‌ను సైతం ఉచితంగా అందించారు. వారానికి గ్రాంట్ టెస్ట్ 160 మార్కులతో నిర్వహిస్తున్నారు. డైలీ పరీక్షలు నిర్వహిస్తూ సామర్థ్యాల్ని అంచనా వేస్తున్నారు. ప్రతి ఆదివారం గురుకులాల కార్యదర్శి కల్నల్ రాములు విద్యార్థినులతో ఆన్లైన్లో ఇంట్రాక్ట్ అవుతూ సలహాలు ఇస్తున్నారు. శిక్షణా కేంద్రాన్ని సాక్షి సందర్శించింది. విద్యార్థుల అభిప్రాయాలు.. -
బంగారు భవితకు గురుకుల బాట
ఒత్తిడి లేని ఉత్తమ విద్యకు గురుకులాలు మార్గదర్శకాలవుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలల్లో కూడా లేని వసతులు కల్పించి పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబుద్దులు నేర్పించి వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. డిజిటల్ విద్యాబోధనలందిస్తూ పిల్లల బంగారు భవిష్యత్‌కు పునాది వేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ప్రచార లోపం, సమాచారం తెలియక అనేక మంది ఈ పాఠశాలల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. జిల్లాలోని మూడు పాఠశాలల్లో ఈనెల 8న అయిదో తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నారు. నాగులుప్పలపాడు: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు జిల్లాలో త్రిపురాంతకం మండలం గణపవరం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామాల్లో మొత్తం 3 ఉన్నాయి. వీటిలో గణపవరం, సంతనూతలపాడులో బాలురకు అవకాశం కల్సిస్తే, అమ్మనబ్రోలు మాత్రం బాలికల కోసం ఏర్పాటు చేశారు. వీటిలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సదుపాయాలతో ఉచితంగా విద్యనందిస్తారు. ఈ గురుకులాల్లో 5వ తరగతిలో చేరడానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఈనెల 8వ తేదీన జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్లో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా మొత్తం మీద సుమారు 1500 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 3 గురుకులాల్లో ఒక్కో పాఠశాలలకు 80 మంది విద్యార్థుల చొప్పున ప్రవేశాలు నిర్వహిస్తారు. వాటిని రోస్టర్ పద్ధతిలో కౌన్సెలింగ్ ద్వారా జనరల్ కేటగిరి –33, బీసీ ఏ–6, బీసీ బి–8, బీసీ సీ–1, బీసీ డి–6, మైనార్టీలకు–3, ఎస్సీ–12, ఎస్టీ–5, పీహెచ్సీ –2, అనాథ పిల్లలకు–2, ఎక్స్ సర్వీస్‌మెన్–2 పద్ధతిలో సీట్లు కేటాయిస్తారు. అంతే కాకుండా తాడికొండలోని ఎక్స్‌లెన్సీ స్కూల్‌కి గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఉన్న మైనార్టీ బాలురతో పాటుగా విజయవాడ మైనార్టీ బాలికల గురుకులాల్లో మన జిల్లా కోటాకు సంబంధించి జిల్లాలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గురుకులాల్లో విద్యార్థులకు మెయింటెనెన్స్ చార్జీలకు, కాస్మోటిక్ ఛార్జి–75 రూపాయలు, వాషింగ్ అలవెన్స్–10, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నోట్ పుస్తకాలు–12 తో పాటుగా దుప్పట్లు, టవల్స్, 2 జతల యూనిఫామ్, గ్లాసు, ప్లేటు, ఇనుప పెట్టె, ఉచితంగా అందిస్తారు. అంతే కాకుండా ప్రతి పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం, స్టాఫ్ నర్స్, వ్యాయామ సంబంధమైన వాటి కోసం పీఈటీ, డ్రాయింగ్ టీచర్ తప్పకుండా ఉంటారు. అమ్మనబ్రోలు గురుకులంలో జిల్లాలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసే క్రమంలో బాలికల కోసం అమ్మనబ్రోలు గ్రామంలో 1983 సంవత్సరంలో గురుకులాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులతో పాటు మంచి ఉద్యోగాలు, వ్యాపారాల్లో దేశ, విదేశాలలో స్థిరపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గురుకులంలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, డిజిటల్ క్లాస్ రూం, కంప్యూటర్ తరగతులు, మినరల్ వాటర్ ప్లాంట్ వంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా ప్రత్యేకంగా విద్యుత్ కోసం 10 కేవీ పవర్ కలిగిన 11 లక్షల రూపాలయలతో సోలార్ ప్లేట్లు కూడా ఏర్పాటు చేశారు. -
విద్యార్థినిని చితకబాదారు!
అమ్రాబాద్ (అచ్చంపేట): గిరిజన మినీ గురుకులంలో చదువుతున్న ఓ చిన్నారిని సిబ్బంది చితకబాదారు. ఈ సంఘటన మండలంలోని ఎల్మపల్లి గిరిజన మినీ గురుకులంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా.. మండలంలోని ఉప్పునుంతల(బీకే) గ్రామానికి చెందిన సింధు మినీ గురుకులంలో రెండో తరగతి చదువుతుంది. శనివారం తల్లి బుజ్జి తన కూతుర్ని పండగ కోసం తీసుకువెళ్లడానికి గురుకుల పాఠశాలకు వచ్చింది. అయితే విద్యార్థిని వీపుపై గాయాలు కనిపించడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయమై చిన్నారి అర్ధరాత్రి మూత్రం చేసేందుకు వెళ్లగా సిబ్బంది కొట్టారని పేర్కొంది. ఎవరికైనా చెబితే మళ్లీ కొడతారేమోనని చెప్పలేదని వాపోయింది. చిన్నారి బాలిక అని చూడకుండా ఇలా చితకబాదడం ఏమిటని విద్యార్థిని తల్లి వాపోయింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అయితే సింధు వీపుపై చితకబాదిన గాయాలు ఉన్నమాట వాస్తవమేనని ఎవరు.. ఎందుకు కొట్టారో తెలియదని హెచ్ఎం శోభ పేర్కొంది. ఈ విషయమై సీఐ రమేష్కొత్వాల్ స్పందిస్తూ ఈ విషయమై ఫిర్యాదు రాలేదని, విచారణ చేయాలని ఎస్ఐ రాంబాబుకు సూచించారు. అయితే ప్రేమికుల దినోత్సవం రోజున మన్ననూర్ బాలికల గురుకుల పాఠశాలలోకి ఓ యువకుడు ప్రవేశించిన ఘటన మరవక ముందే గురుకులంలో చిన్నారిని చితకబాదడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. -
ఏమంటాం..ఇష్ట‘పడక’!
ఖమ్మం, నేలకొండపల్లి: గురుకుల పాఠశాలల్లో రాత్రివేళ కటిక నేలపై అటూఇటూ బొర్లుతూ నిద్రపట్టక అవస్థ పడుతున్న విద్యార్థులు ఇక హాయిగా..మెత్తటి పరుపుల(స్లిమ్‌బెడ్స్)పై పడుకోనున్నారు. చాప లేదా పల్చటి దుప్పటి గచ్చుపై వేసుకొని..ఇంతకాలం కష్టంగా నిద్దరోయిన పిల్లలు ఆ అవస్థకు దూరమై చక్కటి స్లిమ్బెడ్లపై పడుకుంటున్నారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన దానవాయిగూడెం, ఎర్రుపాలెం, కూసుమంచి, ముదిగొండ, మధిర, సత్తుపల్లి, తిరుమలాయపాలెం, దానవాయిగూడెం(డిగ్రీ)గురుకులాల్లో మెత్తటి పరుపులను అందజేశారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న విద్యాలయాలకు తగిన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో..జిల్లా వ్యాప్తంగా 8విద్యాలయాల్లోని 2,752 మందికి పరుపులు పంపిణీ చేశారు. అద్దె భవనాలు విశాలంగా లేకపోవడం, అందరికీ సరిపడా మంచాలు వేసే వీలు ఉండకపోవడంతో ఒక రకమైన పడక (స్లిమ్‌బెడ్స్)ను రూపొందించి అందజేశారు. అవసరమైనప్పు డు వేసుకుని, తర్వాత మలుచుకుని దా చుకునే విధంగా ఉన్నాయి. నేలపై చాప పరుచుకుని, ఆపైన పరుపు వేసుకుంటే బెడ్(పడక)పై నిద్రపోతున్న భావన కలిగేలా రూపొందించారు. రూ.15.14 లక్షలతో కొనుగోలు.. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు పరుపుల కోసం రూ.15.14 లక్షలు ఖర్చు చేసింది. జిల్లాలో 8 గురుకుల పాఠశాలలు నూతనంగా ఏర్పాటు అయ్యాయి. ఒక్క పరుపు ఖరీదు దాదాపు రూ.550 విలువ చేస్తుంది. మొత్తం 2,752 మంది విద్యార్థులకు రూ.15.14 లక్షలతో గురుకులాల సంస్థ హైదరాబాద్‌లో కొనుగోలు చేసి..ఇక్కడికి పంపించింది. విద్యార్థులు రాత్రివేళ ఈ పరుపులపై నిద్రించి, ఉదయం లేచాక ఎంచక్కా మలిచి పెట్టెల్లో భద్ర పరుచుకుంటున్నారు. కార్పొరేట్ స్థాయిలో అందించాం.. కార్పొరేట్ హాస్టళ్లల్లో మాదిరి..విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోంది. అందులో భాగంగానే పరుపులు (స్లిమ్‌బెడ్స్)ను అందించాం. గురుకుల విద్యాలయాల బలోపేతానికి గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ఎంతో శ్రద్ధ పెడుతున్నారు. – పుల్లయ్య, ఆర్సీఓ చాలా సంతోషంగా ఉంది.. మొన్నటి దాకా కింద పడుకున్నాం. ఇప్పుడు పరుపులు వచ్చాక వాటిని వేసుకుని నిద్ర పోతున్నాం. చాలా హాయిగా నిద్ర పడుతోంది. పెట్టెలో దాచుకుంటున్నాం. – వివేక్, గురుకుల విద్యార్థి, ముదిగొండ ప్రవీణ్‌కుమార్ సార్‌కు థాంక్స్.. గురుకుల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ సార్‌కు రుణపడి ఉంటాం. ఇంట్లో లెక్కనే..మంచిగా పరుపులు అందజేశారు. స్టూడెంట్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. – యశ్వంత్, గురుకుల విద్యార్థి, ముదిగొండ