నిజామాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : కంజర గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో సీట్లు మిగిలిపోతున్నాయి. సైన్స్ గ్రూప్‌లు లేకపోవడమే ఇందుకు కారణం. కంజరలో రూ. 9 కోట్లతో గురుకుల పాఠశాల, కళాశాల భవనాన్ని నిర్మించారు. అప్పటివరకు నిజామాబాద్‌లోని కోటగల్లిలో కొనసాగుతున్న ఈ పాఠశాలను 2013లో నూతన భవనంలోకి మార్చారు. 1,300 మంది విద్యార్థినులు చదువుకోవడానికి వీలుగా వసతులు కల్పించారు. అయితే ఈ పాఠశాల, కళాశాలకు 640 సీట్లను మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది 431 మంది మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు. దీంతో 209 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఐదో తరగతినుంచి పదో తరగతి వరకు 315 మంది విద్యార్థులున్నారు. ఆయా తరగతులన్నింటిలో కలిపి 165 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ గురుకులంలో సీఈసీ, హెచ్‌ఈసీ మాత్రమే ఉన్నాయి. సైన్స్ గ్రూప్‌లు లేవు. దీంతో ఈ పాఠశాలలో చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదని, అందువల్లే సీట్లు మిగిలిపోతున్నాయని తెలుస్తోంది. సీఈసీ ప్రథమ సంవత్సరంలో 40 సీట్లకుగాను 31 మంది విద్యార్థినులే ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో 40 సీట్లకు గాను 37 మంది విద్యార్థినులు చదువుతున్నారు. హెచ్‌ఈసీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రథమ సంవత్సరంలో 19 మంది, ద్వితీయ సంవత్సరంలో 29 మంది విద్యార్థులే ఉన్నారు. ప్రథమ సంవత్సరంలో 21, ద్వితీయ సంవత్సరంలో 11 సీట్లు మిగిలిపోయాయి. సైన్స్ గ్రూప్‌లు ఉండి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. గురుకులంలో సైన్స్ గ్రూప్‌లను ప్రారంభించాలని వారు కోరుతున్నారు.
సైన్స్ గ్రూప్‌లు లేకే..
గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నాం. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనూ ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగుతోంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే తెలుగు మాధ్యమంలో చెబుతున్నాం. సైన్స్ గ్రూపులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఈ గురుకులంలో చేరడం లేదు.
-సింధు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
209 సీట్లు ఖాళీ
Published Mon, Jan 13 2014 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement
Advertisement